Shabdam

Rs.150
Rs.150

Shabdam
INR
MANIMN3594
In Stock
150.0
Rs.150


In Stock
Ships in 4 - 9 Days
Check for shipping and cod pincode

Description

మనసును తట్టే మంచి కథలు

కొందరు రచయితలు తమ చుట్టూ వున్న ప్రజాజీవితాన్ని కథలుగా రాస్తారు. తమకు పరిచయమైన ప్రాంత విశేషాలతోనే ప్రపంచ పరిణామాలను కథల్లో పరిచయం చేస్తారు. ఆలోచనలు రేకేత్తిస్తారు. కొందరు రచయితలు మనుషుల్ని పరిశీలించడం ద్వారా అనేక వైవిధ్యభరితమైన పాత్రల్ని సృష్టించి మంచి సందేశాన్ని కథలుగా అందిస్తారు. కొందరు రచయితలు నిరంతరం అనేక సాహితీ వేదికలను నిరంతరం సాటి రచయితలతో పంచుకుంటారు. కొందరు సాహితీ వేదికలకు దూరంగా వున్నా తమ సాహితీ సృజనను కొనసాగిస్తూ తమ భావాల్ని పాఠకులతో పంచుకుంటారు.

మిత్రుడు రమేష్ కుమార్ తరచూ సాహిత్య సమావేశాల్లో కనిపించకపోయినా (నా వరకు) సాహితీ సృజన విషయంలో నిరంతరం నిమగ్నమై వుంటాదని పత్రికలలో తరచూ వచ్చే అతని కథలే తార్కాణం. చాన్నాళ్ళుగా రమేష్ కుమార్ నాకు కథకుడుగా | తెలుసును. తొలిసారిగా మేం కలిసింది గోపాలపట్నంలో జరిగిన ఒక సాహితీ సమావేశంలో అని గుర్తు. సుమారు పదేళ్ళ క్రిందటి మాట! అతను అప్పుడొక ప్రశ్న అడిగిన గుర్తుంది, “కథ మాండలికంలోనే రాయాలా..?” అని. 'ఆయా పాత్రల భాషలోనే సంభాషణలుండాలి... స్థలకాలాల నిర్దిష్టత లేకపోతే కథ సహజంగా వుండదు..' అని చెప్పినట్టు గుర్తు.

సరే.. అప్పటినుంచీ రమేష్ కుమార్ ఫోన్ లో పలకరించడం, తన కథ పత్రికలో అచ్చయితే వాట్సాప్ లో పంపడం చేస్తూనే వున్నాడు. తన కథల్ని చదివి అభిప్రాయం చెప్పమని కొన్ని కథల జిరాక్స్ కాపీలు ఇచ్చాడు. చాలా కధలు చదివేను. కానీ నా అభిప్రాయాన్ని చెప్పే అవకాశం కుదరలేదు. కొంతకాలం గడిచాక చెప్పడానికి (మరపున పడడంతో) 'తిరిగి చదివి చెప్తానే..' అని దాటవేసేవాణ్ణి. గత 'మే' నెలలో అనుకుంటాను... నాకు కొన్ని కథలు మెయిల్ చేసి 'పుస్తకం వేస్తున్నాను.. అభిప్రాయం రాయండి..' అన్నాడు. కంప్యూటర్ లో చదవడానికి నాకు ఇబ్బందిగా వుండటం మూలంగా కొన్ని కథలు ప్రింట్లు తీయించి చదివేను.............

మనసును తట్టే మంచి కథలు కొందరు రచయితలు తమ చుట్టూ వున్న ప్రజాజీవితాన్ని కథలుగా రాస్తారు. తమకు పరిచయమైన ప్రాంత విశేషాలతోనే ప్రపంచ పరిణామాలను కథల్లో పరిచయం చేస్తారు. ఆలోచనలు రేకేత్తిస్తారు. కొందరు రచయితలు మనుషుల్ని పరిశీలించడం ద్వారా అనేక వైవిధ్యభరితమైన పాత్రల్ని సృష్టించి మంచి సందేశాన్ని కథలుగా అందిస్తారు. కొందరు రచయితలు నిరంతరం అనేక సాహితీ వేదికలను నిరంతరం సాటి రచయితలతో పంచుకుంటారు. కొందరు సాహితీ వేదికలకు దూరంగా వున్నా తమ సాహితీ సృజనను కొనసాగిస్తూ తమ భావాల్ని పాఠకులతో పంచుకుంటారు. మిత్రుడు రమేష్ కుమార్ తరచూ సాహిత్య సమావేశాల్లో కనిపించకపోయినా (నా వరకు) సాహితీ సృజన విషయంలో నిరంతరం నిమగ్నమై వుంటాదని పత్రికలలో తరచూ వచ్చే అతని కథలే తార్కాణం. చాన్నాళ్ళుగా రమేష్ కుమార్ నాకు కథకుడుగా | తెలుసును. తొలిసారిగా మేం కలిసింది గోపాలపట్నంలో జరిగిన ఒక సాహితీ సమావేశంలో అని గుర్తు. సుమారు పదేళ్ళ క్రిందటి మాట! అతను అప్పుడొక ప్రశ్న అడిగిన గుర్తుంది, “కథ మాండలికంలోనే రాయాలా..?” అని. 'ఆయా పాత్రల భాషలోనే సంభాషణలుండాలి... స్థలకాలాల నిర్దిష్టత లేకపోతే కథ సహజంగా వుండదు..' అని చెప్పినట్టు గుర్తు. సరే.. అప్పటినుంచీ రమేష్ కుమార్ ఫోన్ లో పలకరించడం, తన కథ పత్రికలో అచ్చయితే వాట్సాప్ లో పంపడం చేస్తూనే వున్నాడు. తన కథల్ని చదివి అభిప్రాయం చెప్పమని కొన్ని కథల జిరాక్స్ కాపీలు ఇచ్చాడు. చాలా కధలు చదివేను. కానీ నా అభిప్రాయాన్ని చెప్పే అవకాశం కుదరలేదు. కొంతకాలం గడిచాక చెప్పడానికి (మరపున పడడంతో) 'తిరిగి చదివి చెప్తానే..' అని దాటవేసేవాణ్ణి. గత 'మే' నెలలో అనుకుంటాను... నాకు కొన్ని కథలు మెయిల్ చేసి 'పుస్తకం వేస్తున్నాను.. అభిప్రాయం రాయండి..' అన్నాడు. కంప్యూటర్ లో చదవడానికి నాకు ఇబ్బందిగా వుండటం మూలంగా కొన్ని కథలు ప్రింట్లు తీయించి చదివేను.............

Features

  • : Shabdam
  • : M Ramesh Kumar Kathalu
  • : Achanga Telugu Prachuranalu
  • : MANIMN3594
  • : Paperback
  • : Dec, 2021
  • : 152
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Shabdam

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam