థ్యాంక్యూ మై డియర్ మేరీ
ఉదయం ఆమె వాషింగ్ మిషన్లో బట్టలు తీసి, వరండాలో ఆరేస్తూ వుంది. ఎప్పుడో పదహైదేళ్ళనాడు కొన్న సెమీ ఆటోమేటిక్ వాషింగ్ మిషన్. అప్పుడప్పుడూ నాబ్లు మొరాయిస్తున్నాయని, గతిలేక చేస్తున్నానని సణుగుతూ బట్టలు ఆరేస్తోంది.
“బట్టలు నన్ను ఆరేయమంటావా?” అన్నాను, అక్కడే కూర్చుని చూస్తున్న ఫోన్ పక్కన స్టూల్ మీద పెట్టి లేస్తూ.
“నువ్వు చేయాల్సిన పనులు నువ్వు చేయి. నా పనులు నేను చేసుకుంటా” అంది చురచురా చూస్తూ.
చేసేదేమీలేక నిస్సహాయంగా తిరిగి కుర్చీలో కూలబడ్డాను. పక్కనున్న ఫోన్ నుండి, నీళ్లలో గులకరాయి పడిన చప్పుడు. మెసెంజర్లో ఏదో మెస్సేజ్. ఇద్దరు ముగ్గరు తప్ప మెసెంజర్లో చాట్ చేసేవాళ్లు లేరు. మెసేజ్ చూడాలన్న ఆతృతను చంపుకోవాలని ప్రయత్నించీ, విఫలమై ఫోన్ చేతికి తీసుకున్నాను. “గుడ్మార్నింగ్ సార్!” మేరీ.
మనసంతా ఆహ్లాదం పరుచుకుంది.....................
థ్యాంక్యూ మై డియర్ మేరీ ఉదయం ఆమె వాషింగ్ మిషన్లో బట్టలు తీసి, వరండాలో ఆరేస్తూ వుంది. ఎప్పుడో పదహైదేళ్ళనాడు కొన్న సెమీ ఆటోమేటిక్ వాషింగ్ మిషన్. అప్పుడప్పుడూ నాబ్లు మొరాయిస్తున్నాయని, గతిలేక చేస్తున్నానని సణుగుతూ బట్టలు ఆరేస్తోంది. “బట్టలు నన్ను ఆరేయమంటావా?” అన్నాను, అక్కడే కూర్చుని చూస్తున్న ఫోన్ పక్కన స్టూల్ మీద పెట్టి లేస్తూ. “నువ్వు చేయాల్సిన పనులు నువ్వు చేయి. నా పనులు నేను చేసుకుంటా” అంది చురచురా చూస్తూ. చేసేదేమీలేక నిస్సహాయంగా తిరిగి కుర్చీలో కూలబడ్డాను. పక్కనున్న ఫోన్ నుండి, నీళ్లలో గులకరాయి పడిన చప్పుడు. మెసెంజర్లో ఏదో మెస్సేజ్. ఇద్దరు ముగ్గరు తప్ప మెసెంజర్లో చాట్ చేసేవాళ్లు లేరు. మెసేజ్ చూడాలన్న ఆతృతను చంపుకోవాలని ప్రయత్నించీ, విఫలమై ఫోన్ చేతికి తీసుకున్నాను. “గుడ్మార్నింగ్ సార్!” మేరీ. మనసంతా ఆహ్లాదం పరుచుకుంది.....................© 2017,www.logili.com All Rights Reserved.