Madatha Pejee

By Chandra Latha (Author)
Rs.125
Rs.125

Madatha Pejee
INR
VISHALA938
In Stock
125.0
Rs.125


In Stock
Ships in 4 - 9 Days
Check for shipping and cod pincode

Description

             తెలుగు బ్లాగు రచనలు అంతర్జాలంలో అనతికాలంగా ప్రాచుర్యంలోకి వచ్చినప్పటికీ, నాకు వివరంగా తెలియవచ్చింది, డెట్రాయిట్ లిటరరీ క్లబ్ వారి దశమ వార్షికోత్సవ సభలలో. మన భాష మనుగడ సందిగ్దావస్థకు చేరుకొంటున్న దశలో - మన భాషను పదిలపరచుకోవడానికి ప్రమాదసూచిక ఎగరవేసి - దిగాలుగా చూస్తునాం. తోచిన ప్రయత్నాలు చేస్తున్నాం. ఆ దిశగా దీక్షాబద్ధులై ప్రత్యేక్షంగానూ పరోక్షంగానూ కృషి చేస్తూ - తెలుగును పలుకాలాలు పచ్చగా ఉంచేందుకు నడుం బిగించారు కొందరు.

                  అటూఇటుగా అరవైశాతం అక్షరాస్యులున్న ఆంద్రదేశాన, ఆంగ్ల పరిజ్ఞానం ఉన్నవారు ఎందరన్నది అటుంచి, కంప్యూటర్ అందుబాటులో ఉన్నవారెందరన్నది ఒక ప్రశ్న. కంప్యూటర్ అందుబాటులో ఉన్నా, వాడదలచుకున్న సమయానికి కరెంట్ ఉండాలి. కరెంట్ ఉన్నప్పుడు ఇంటర్నెట్ కనెక్షన్ దొరకాలి. తెర మీదున్నవి చదివే వరకన్నా, అక్షరాలను తెరకెక్కించే వరకన్నా ఆ కనెక్షన్ నిలిచి ఉండాలి? అంతేకాదు. తెరమీద త్రిభుజాలు, చదరాలు, నక్షత్రాలు ప్రత్యేక్షమై పలకరించకుండా - అచ్చతెలుగు అక్షరాలు అచ్చవ్వాలి! దానాదీనా బోలెడంత భాషాభిమానంతో పాటు, కాస్త సాంకేతిక జ్ఞానం కావాలి, ఆపై సాంకేతిక నిపుణుల సాయం కావాలి.

             మన దేశంలో ఉన్న డెబ్బైశాతం నిరక్షరాస్యులు నివసిస్తున్న ఆరు రాష్ట్రాల్లో మనది ఒకటి. అయినా, కంప్యూటర్ స్పృహలో మనం ముందున్నామన్నది నిజం. అంతర్జాలంలోనూ, ఇతర దైనందిన వ్యవహారాల్లోనూ లిఖిత భాషగా తెలుగు వాడకం ముమ్మారంజేసి - తెలుగును ఒక ప్రపంచవ్యాప్త భాషగా విస్తృతపరిచి - తెలుగును పదిలపరిచేందుకు ఉద్యమస్పూర్తితో పలువురు చేస్తున్న కృషికి - నేను సైతం సవినయంగా ఒక అక్షరం చేరుస్తున్నాను. ఏది ఏమైనా, పుస్తకం పుస్తకమే. అందుకే ఈ చిన్న రచనలను అచ్చువేసే సాహసం చేస్తున్నాను. ఈ రచనలు వివిధ అంశాలపై అప్పటికప్పుడు తోచిన ఆలోచనలు, కలిగిన స్పందనలు, కొన్ని జ్ఞాపకాలు - మరికొన్ని అభిప్రాయాలు. అనుకున్న తడువే అచ్చువేసుకొనే అవకాశం ఉంది కనుక, అర్థరాత్రైనా అపరాత్రైనా - తెరకెక్కించిన తక్షణ రచనలు.

                          - చంద్రలత

             తెలుగు బ్లాగు రచనలు అంతర్జాలంలో అనతికాలంగా ప్రాచుర్యంలోకి వచ్చినప్పటికీ, నాకు వివరంగా తెలియవచ్చింది, డెట్రాయిట్ లిటరరీ క్లబ్ వారి దశమ వార్షికోత్సవ సభలలో. మన భాష మనుగడ సందిగ్దావస్థకు చేరుకొంటున్న దశలో - మన భాషను పదిలపరచుకోవడానికి ప్రమాదసూచిక ఎగరవేసి - దిగాలుగా చూస్తునాం. తోచిన ప్రయత్నాలు చేస్తున్నాం. ఆ దిశగా దీక్షాబద్ధులై ప్రత్యేక్షంగానూ పరోక్షంగానూ కృషి చేస్తూ - తెలుగును పలుకాలాలు పచ్చగా ఉంచేందుకు నడుం బిగించారు కొందరు.                   అటూఇటుగా అరవైశాతం అక్షరాస్యులున్న ఆంద్రదేశాన, ఆంగ్ల పరిజ్ఞానం ఉన్నవారు ఎందరన్నది అటుంచి, కంప్యూటర్ అందుబాటులో ఉన్నవారెందరన్నది ఒక ప్రశ్న. కంప్యూటర్ అందుబాటులో ఉన్నా, వాడదలచుకున్న సమయానికి కరెంట్ ఉండాలి. కరెంట్ ఉన్నప్పుడు ఇంటర్నెట్ కనెక్షన్ దొరకాలి. తెర మీదున్నవి చదివే వరకన్నా, అక్షరాలను తెరకెక్కించే వరకన్నా ఆ కనెక్షన్ నిలిచి ఉండాలి? అంతేకాదు. తెరమీద త్రిభుజాలు, చదరాలు, నక్షత్రాలు ప్రత్యేక్షమై పలకరించకుండా - అచ్చతెలుగు అక్షరాలు అచ్చవ్వాలి! దానాదీనా బోలెడంత భాషాభిమానంతో పాటు, కాస్త సాంకేతిక జ్ఞానం కావాలి, ఆపై సాంకేతిక నిపుణుల సాయం కావాలి.              మన దేశంలో ఉన్న డెబ్బైశాతం నిరక్షరాస్యులు నివసిస్తున్న ఆరు రాష్ట్రాల్లో మనది ఒకటి. అయినా, కంప్యూటర్ స్పృహలో మనం ముందున్నామన్నది నిజం. అంతర్జాలంలోనూ, ఇతర దైనందిన వ్యవహారాల్లోనూ లిఖిత భాషగా తెలుగు వాడకం ముమ్మారంజేసి - తెలుగును ఒక ప్రపంచవ్యాప్త భాషగా విస్తృతపరిచి - తెలుగును పదిలపరిచేందుకు ఉద్యమస్పూర్తితో పలువురు చేస్తున్న కృషికి - నేను సైతం సవినయంగా ఒక అక్షరం చేరుస్తున్నాను. ఏది ఏమైనా, పుస్తకం పుస్తకమే. అందుకే ఈ చిన్న రచనలను అచ్చువేసే సాహసం చేస్తున్నాను. ఈ రచనలు వివిధ అంశాలపై అప్పటికప్పుడు తోచిన ఆలోచనలు, కలిగిన స్పందనలు, కొన్ని జ్ఞాపకాలు - మరికొన్ని అభిప్రాయాలు. అనుకున్న తడువే అచ్చువేసుకొనే అవకాశం ఉంది కనుక, అర్థరాత్రైనా అపరాత్రైనా - తెరకెక్కించిన తక్షణ రచనలు.                           - చంద్రలత

Features

  • : Madatha Pejee
  • : Chandra Latha
  • : Prabhava publications
  • : VISHALA938
  • : Paperback
  • : 2016
  • : 153
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Madatha Pejee

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam