Maa Kaathalu 2020

By Ch Siva Rama Prasad (Author)
Rs.99
Rs.99

Maa Kaathalu 2020
INR
MANIMN2980
In Stock
99.0
Rs.99


In Stock
Ships in 4 - 9 Days
Check for shipping and cod pincode

Description

 

                           సహజ కథా చక్రవర్తిగా పేరుగాంచిన పినిశెట్టి శ్రీరామమూర్తి, 20, డిసెంబర్ 1920లో పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురంలో జన్మించారు. ఆయన తండ్రి వెంకటరత్నం, తల్లి అమ్మణ్ణమ్మ. వెంకటరత్నం కోర్టు అమీనుగా ఉద్యోగం చేసి పదవీ విరమణ చేశారు. శ్రీరామమూర్తి గారి తల్లి ఆయనకు రెండేళ వయసులో వుండగా మరణించారు.

                           తండ్రి వెంకటరత్నం పదవీ విరమణతో ఆర్థిక ఇబ్బందులు చుట్టుముట్టి ప్రాథమిక విద్యతోనే చదువు ఆగిపోయింది. వ్యవసాయం పనులు చేస్తూ, టైలరింగ్ నేర్చుకుంటూ కూడా, పుస్తకాలు విపరీతంగా చదువుతూ ఎంతో లోక జ్ఞానం సంపాదించారు. ఆయన అసాధారణ ప్రతిభావంతుడని ఒకటో తరగతి చదువుతున్నప్పుడే ఉపాధ్యాయులు గ్రహించారు. డబుల్ ప్రమోషన్ యిచ్చి ఒకటో తరగతి నుండి మూడో తరగతికి చేర్చారు. ఐదో తరగతిలోనే చదువు ఆగిపోయింది. హైస్కూల్లో చేరి ఆరో తరగతి చదివే పరిస్థితి లేదు. ఆర్థిక ఇబ్బందుల కారణంగా చదువు సాగలేదు. కేవలం ఐదో తరగతి మాత్రమే చదివి గొప్ప రచయిత కావడం ఆయన అద్భుత ప్రతిభకు నిదర్శనం. ప్రాథమిక విద్య మాత్రమే చదివి కథా రచయితగా పేరు తెచ్చుకున్న వారు శ్రీరామమూర్తి మాత్రమే అని చెప్పడం అతిశయోక్తి మాత్రం కాదు.

                           హైస్కూల్లో, కాలేజీల్లో చదవకున్నా జీవితం అనే యూనివర్సిటీలో మనిషి కష్టాలు, కన్నీళ్ళు, బాధలు, ఆవేదనలు, రాగద్వేషాలు, కుళ్ళు కుతంత్రాలు వంటి పాఠాలు చదివారు. కేవలం పుస్తకాలు చదివి కథా రచయిత అయ్యారు. సాహితీ మాసపత్రిక 'భారతి'లో విరివిగా కథలు రాశారు. ఆయన కథలు విమర్శకుల, పండితుల దృష్టిని ఆకర్షించాయి. 1946లో 'సవతి తల్లి' పేరుతో కథల సంపుటి ప్రచురించారు.

                           తర్వాత కథా రచన నుంచి ఆయన నాటక రంగంలోకి ప్రవేశించారు. ఆయనకున్న గ్రామీణ పరిజ్ఞానంతో గ్రామీణ నేపథ్యంలో నాటకాలు రచించారు. 1944లో ఆదర్శ జ్యోతి నాటకాన్ని రాశారు. ఆదర్శ నాట్యమండలి ద్వారా ప్రదర్శించారు. 

                             సహజ కథా చక్రవర్తిగా పేరుగాంచిన పినిశెట్టి శ్రీరామమూర్తి, 20, డిసెంబర్ 1920లో పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురంలో జన్మించారు. ఆయన తండ్రి వెంకటరత్నం, తల్లి అమ్మణ్ణమ్మ. వెంకటరత్నం కోర్టు అమీనుగా ఉద్యోగం చేసి పదవీ విరమణ చేశారు. శ్రీరామమూర్తి గారి తల్లి ఆయనకు రెండేళ వయసులో వుండగా మరణించారు.                            తండ్రి వెంకటరత్నం పదవీ విరమణతో ఆర్థిక ఇబ్బందులు చుట్టుముట్టి ప్రాథమిక విద్యతోనే చదువు ఆగిపోయింది. వ్యవసాయం పనులు చేస్తూ, టైలరింగ్ నేర్చుకుంటూ కూడా, పుస్తకాలు విపరీతంగా చదువుతూ ఎంతో లోక జ్ఞానం సంపాదించారు. ఆయన అసాధారణ ప్రతిభావంతుడని ఒకటో తరగతి చదువుతున్నప్పుడే ఉపాధ్యాయులు గ్రహించారు. డబుల్ ప్రమోషన్ యిచ్చి ఒకటో తరగతి నుండి మూడో తరగతికి చేర్చారు. ఐదో తరగతిలోనే చదువు ఆగిపోయింది. హైస్కూల్లో చేరి ఆరో తరగతి చదివే పరిస్థితి లేదు. ఆర్థిక ఇబ్బందుల కారణంగా చదువు సాగలేదు. కేవలం ఐదో తరగతి మాత్రమే చదివి గొప్ప రచయిత కావడం ఆయన అద్భుత ప్రతిభకు నిదర్శనం. ప్రాథమిక విద్య మాత్రమే చదివి కథా రచయితగా పేరు తెచ్చుకున్న వారు శ్రీరామమూర్తి మాత్రమే అని చెప్పడం అతిశయోక్తి మాత్రం కాదు.                            హైస్కూల్లో, కాలేజీల్లో చదవకున్నా జీవితం అనే యూనివర్సిటీలో మనిషి కష్టాలు, కన్నీళ్ళు, బాధలు, ఆవేదనలు, రాగద్వేషాలు, కుళ్ళు కుతంత్రాలు వంటి పాఠాలు చదివారు. కేవలం పుస్తకాలు చదివి కథా రచయిత అయ్యారు. సాహితీ మాసపత్రిక 'భారతి'లో విరివిగా కథలు రాశారు. ఆయన కథలు విమర్శకుల, పండితుల దృష్టిని ఆకర్షించాయి. 1946లో 'సవతి తల్లి' పేరుతో కథల సంపుటి ప్రచురించారు.                            తర్వాత కథా రచన నుంచి ఆయన నాటక రంగంలోకి ప్రవేశించారు. ఆయనకున్న గ్రామీణ పరిజ్ఞానంతో గ్రామీణ నేపథ్యంలో నాటకాలు రచించారు. 1944లో ఆదర్శ జ్యోతి నాటకాన్ని రాశారు. ఆదర్శ నాట్యమండలి ద్వారా ప్రదర్శించారు. 

Features

  • : Maa Kaathalu 2020
  • : Ch Siva Rama Prasad
  • : CH.Siva Rama Prasad
  • : MANIMN2980
  • : Paperback
  • : Oct-2021
  • : 392
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Maa Kaathalu 2020

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam