Konni Samayaalu Kondaru Peddalu

By Modugula Ravi Krishna (Author)
Rs.180
Rs.180

Konni Samayaalu Kondaru Peddalu
INR
MANIMN3900
In Stock
180.0
Rs.180


In Stock
Ships in 4 - 9 Days
Check for shipping and cod pincode

Description

రవిని తెలుసుకోవడం సాధ్యమా?

రెండు దశాబ్దాలుగా ఎప్పుడూ కలిసే ఉంటున్నా 'రవికృష్ణ నాకెంత తెలుసు?” అని ప్రశ్నించుకుంటే సరైన సమాధానం దొరకలేదనే అనిపిస్తుంది. ఇదే ప్రశ్న మా పద్మకు (ఆయన భార్య) వేస్తే ఆమెకూడా అదే చెప్పింది. గడచిన ఇరవయ్యేళ్ళ కాలంలో క్షణక్షణాన రవికృష్ణ ఉన్నా ఆయన స్పష్టంగా తెలియలేదన్నది మాత్రం అక్షరాలా సత్యం. 'మరెవరికి తెలుస్తాడు?' అని ఆలోచిస్తే వేలకోట్లతో ప్రజాహిత వ్యాపారం చేసే వరప్రసాదరెడ్డిగారినో, హంపీ విజయనగర రాజవంశంలోని ఈతరం కృష్ణదేవరాయలవారినో, రాయల నేలలో రాజసంతో నిలిచిన అమరనాథవర్మ సోదరులనో అడిగితే కొంత తెలియవచ్చు. లేదూ పూర్వుల్ని ప్రసన్నం చేసుకుంటే (ఈమధ్య ఒక స్వామివారు మరణించినవారితో మాట్లాడినట్లు చెప్పడం గురించి విన్నాను), రవికృష్ణ ఈతరానికి మళ్ళీ పరిచయం చేయడానికి ప్రయత్నించిన రాజరాజ నరేంద్రుడినో, శ్రీకృష్ణదేవరాయలవారినో, ఆధునికయుగ ప్రారంభంవారైన ఆదిభట్ల నారాయణదాసు, చెళ్ళపిళ్ళ వెంకటశాస్త్రి, పానుగంటి లక్ష్మీ నరసింహారావుపంతులు, మల్లంపల్లి సోమశేఖరశర్మగార్లలో ఎవరినైనా అడిగితే మరికొంత తెలియవచ్చు. అంతేగాని నాకెలా తెలుస్తాడు! స్నేహం మనుషుల్ని దగ్గర చేయవచ్చుగాని, ఒక మనిషిలో నిగూఢమై దాగిన శక్తిని పరిచయం చేయదు కదా! అయినా రవికృష్ణ మా యింటిబిడ్డ ననిపిస్తాడు.

ఎంతవరకు సమంజసమో తెలియదుగాని, ఇంట్లో అందరూ రవికృష్ణని మా యింటిబిడ్డగానే చూస్తారు. అదే ఆశ్చర్యం! ఈయన ఆలోచనలో కొచ్చిన.............

రవిని తెలుసుకోవడం సాధ్యమా? రెండు దశాబ్దాలుగా ఎప్పుడూ కలిసే ఉంటున్నా 'రవికృష్ణ నాకెంత తెలుసు?” అని ప్రశ్నించుకుంటే సరైన సమాధానం దొరకలేదనే అనిపిస్తుంది. ఇదే ప్రశ్న మా పద్మకు (ఆయన భార్య) వేస్తే ఆమెకూడా అదే చెప్పింది. గడచిన ఇరవయ్యేళ్ళ కాలంలో క్షణక్షణాన రవికృష్ణ ఉన్నా ఆయన స్పష్టంగా తెలియలేదన్నది మాత్రం అక్షరాలా సత్యం. 'మరెవరికి తెలుస్తాడు?' అని ఆలోచిస్తే వేలకోట్లతో ప్రజాహిత వ్యాపారం చేసే వరప్రసాదరెడ్డిగారినో, హంపీ విజయనగర రాజవంశంలోని ఈతరం కృష్ణదేవరాయలవారినో, రాయల నేలలో రాజసంతో నిలిచిన అమరనాథవర్మ సోదరులనో అడిగితే కొంత తెలియవచ్చు. లేదూ పూర్వుల్ని ప్రసన్నం చేసుకుంటే (ఈమధ్య ఒక స్వామివారు మరణించినవారితో మాట్లాడినట్లు చెప్పడం గురించి విన్నాను), రవికృష్ణ ఈతరానికి మళ్ళీ పరిచయం చేయడానికి ప్రయత్నించిన రాజరాజ నరేంద్రుడినో, శ్రీకృష్ణదేవరాయలవారినో, ఆధునికయుగ ప్రారంభంవారైన ఆదిభట్ల నారాయణదాసు, చెళ్ళపిళ్ళ వెంకటశాస్త్రి, పానుగంటి లక్ష్మీ నరసింహారావుపంతులు, మల్లంపల్లి సోమశేఖరశర్మగార్లలో ఎవరినైనా అడిగితే మరికొంత తెలియవచ్చు. అంతేగాని నాకెలా తెలుస్తాడు! స్నేహం మనుషుల్ని దగ్గర చేయవచ్చుగాని, ఒక మనిషిలో నిగూఢమై దాగిన శక్తిని పరిచయం చేయదు కదా! అయినా రవికృష్ణ మా యింటిబిడ్డ ననిపిస్తాడు. ఎంతవరకు సమంజసమో తెలియదుగాని, ఇంట్లో అందరూ రవికృష్ణని మా యింటిబిడ్డగానే చూస్తారు. అదే ఆశ్చర్యం! ఈయన ఆలోచనలో కొచ్చిన.............

Features

  • : Konni Samayaalu Kondaru Peddalu
  • : Modugula Ravi Krishna
  • : Analpa Book Company
  • : MANIMN3900
  • : paparback
  • : 2022
  • : 169
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Konni Samayaalu Kondaru Peddalu

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam