Graduate Auto Service

By Govindaraju Chakradar (Author)
Rs.120
Rs.120

Graduate Auto Service
INR
MANIMN3895
In Stock
120.0
Rs.120


In Stock
Ships in 4 - 9 Days
Check for shipping and cod pincode

Description

బతుకు పుస్తకం

  • డాక్టర్ గోవిందరాజు చక్రధర్

ఇవన్నీ జీవితాల కథలు - అనుభవాల కథలు - జీవిత పాఠాల కథలు.

వీటిలో విషాదాలున్నాయి. ఈ కష్టం మరెవరికీ రాకూడదనిపించే కథనాలున్నాయి. విచిత్రాలున్నాయి. ఇలా కూడా జరుగుతుందా? అనే విస్మయాలున్నాయి. సినిమా కథలను తలపించే సస్పెన్స్ థ్రిల్లర్లున్నాయి. అయ్యో! ఇలా చేసి ఉండాల్సింది కాదనే పశ్చాత్తాపాలున్నాయి.

ఆటో డ్రైవర్ జీవితం, ఆ మాట కొస్తే ఏ వాహనం డ్రైవర్ జీవితమైనా ఎంతో విస్తృతమైనది. వైవిధ్యభరితమైనది. రౌడీలు, రాబందులు, వ్యభిచారిణులు, మోసగాళ్ళు మొదలుకుని మానవత్వాన్ని పరిమళింపచేసే మహానుభావులు, కష్టాల కొలిమిలో కాగేవారు, ఆపద అంచుల్లో అల్లాడుతున్నవారు - ఇలా రోడ్డెక్కితే ఎందరెందరో తారసపడతారు. ఈ వ్యక్తుల్ని తరచి చూడగలిగితే, పాఠంగా మలచుకోగలిగితే గొప్ప జీవితసత్యాలెన్నో బోధపడతాయి.

మూడేళ్ళ బతుకు పుస్తకమిది. ఆటోవాలాగా ఏ రోజుకారోజు కొత్త పేజీ తిప్పినపుడు కొత్తపాత్రలు కన్పించేవి. సరికొత్త కథామాలికలు అల్లేవి.

నాలుగున్నర దశాబ్దాలు గడిచినా మెదడు పొరల్లో భద్రంగా కొలువుదీరి రాజ్యమేలుతున్న బతుకు చిత్రాలను వెలికితీసి అక్షరదండలు అల్లితే ఈ వెండివెన్నెల కాంతులు తళుకులీనాయి.

నా జీవన ప్రస్థానం ఆటోవాలాగా మొదలైనా అది కామా మాత్రమే. నేను అక్కడే ఆగిపోలేదు. అందులోనే కూరుకుపోలేదు. రచయితగా, పత్రికా రచయితగా, జర్నలిజం అధ్యాపకుడిగా, ప్రచురణకర్తగా, ఫిల్మ్ సెన్సార్ బోర్డు సభ్యుడిగా నా జీవన కార్యకలాపాలు శాఖోపశాఖలుగా విస్తరించాయి. ఇన్నేళ్ళుగా నిర్విరామంగా రచనా వ్యాసంగాన్ని కొనసాగిస్తూ వస్తున్నందునే ఇప్పుడీ పుస్తకం మీచేతుల్లోకి వచ్చింది............

బతుకు పుస్తకం డాక్టర్ గోవిందరాజు చక్రధర్ ఇవన్నీ జీవితాల కథలు - అనుభవాల కథలు - జీవిత పాఠాల కథలు. వీటిలో విషాదాలున్నాయి. ఈ కష్టం మరెవరికీ రాకూడదనిపించే కథనాలున్నాయి. విచిత్రాలున్నాయి. ఇలా కూడా జరుగుతుందా? అనే విస్మయాలున్నాయి. సినిమా కథలను తలపించే సస్పెన్స్ థ్రిల్లర్లున్నాయి. అయ్యో! ఇలా చేసి ఉండాల్సింది కాదనే పశ్చాత్తాపాలున్నాయి. ఆటో డ్రైవర్ జీవితం, ఆ మాట కొస్తే ఏ వాహనం డ్రైవర్ జీవితమైనా ఎంతో విస్తృతమైనది. వైవిధ్యభరితమైనది. రౌడీలు, రాబందులు, వ్యభిచారిణులు, మోసగాళ్ళు మొదలుకుని మానవత్వాన్ని పరిమళింపచేసే మహానుభావులు, కష్టాల కొలిమిలో కాగేవారు, ఆపద అంచుల్లో అల్లాడుతున్నవారు - ఇలా రోడ్డెక్కితే ఎందరెందరో తారసపడతారు. ఈ వ్యక్తుల్ని తరచి చూడగలిగితే, పాఠంగా మలచుకోగలిగితే గొప్ప జీవితసత్యాలెన్నో బోధపడతాయి. మూడేళ్ళ బతుకు పుస్తకమిది. ఆటోవాలాగా ఏ రోజుకారోజు కొత్త పేజీ తిప్పినపుడు కొత్తపాత్రలు కన్పించేవి. సరికొత్త కథామాలికలు అల్లేవి. నాలుగున్నర దశాబ్దాలు గడిచినా మెదడు పొరల్లో భద్రంగా కొలువుదీరి రాజ్యమేలుతున్న బతుకు చిత్రాలను వెలికితీసి అక్షరదండలు అల్లితే ఈ వెండివెన్నెల కాంతులు తళుకులీనాయి. నా జీవన ప్రస్థానం ఆటోవాలాగా మొదలైనా అది కామా మాత్రమే. నేను అక్కడే ఆగిపోలేదు. అందులోనే కూరుకుపోలేదు. రచయితగా, పత్రికా రచయితగా, జర్నలిజం అధ్యాపకుడిగా, ప్రచురణకర్తగా, ఫిల్మ్ సెన్సార్ బోర్డు సభ్యుడిగా నా జీవన కార్యకలాపాలు శాఖోపశాఖలుగా విస్తరించాయి. ఇన్నేళ్ళుగా నిర్విరామంగా రచనా వ్యాసంగాన్ని కొనసాగిస్తూ వస్తున్నందునే ఇప్పుడీ పుస్తకం మీచేతుల్లోకి వచ్చింది............

Features

  • : Graduate Auto Service
  • : Govindaraju Chakradar
  • : Media House Publications
  • : MANIMN3895
  • : paparback
  • : Dec, 2022
  • : 120
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Graduate Auto Service

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam