'గాలిలో తేలిపోతున్నాం' ఈ కథా సంపుటికి ఈ పేరే ఎందుకు పెట్టానంటే - విదేశాలకు వెళ్ళేవారు ఎన్నిమార్లు వెళ్ళినా అదొక మధురానుభూతి. నూతనానుభవమే! ఇంటిని వదిలి విదేశానికి పయనమై ఏర్ పోర్టుకు వెళ్ళేవరకు ఉద్వేగంగానే ఉంటుంది. వీడ్కోలు చెప్పడానికి వెంటవచ్చిన ఆత్మీయులు పలుకరింపులు తర్వాత ఏర్ పోర్టులో సెక్యూరిటీ చెకింగ్ పాస్ పోర్టులు, టికెట్ వేరిఫికేషన్స్, లగేజీ తూకాల తర్వాత అన్నీ మరచిపోతాం. ఫ్లైట్లో అడుగుపెట్టి సీటులో సెటిలయ్యాక మనసంతా హాయినిండిపోతుంది. ఇక్కడి ఇండియా ధ్యాస తెగిపోతుంది. అక్కడి మనవాళ్ళ దగ్గరికి చేరుతున్నామన్న ఆనందం మదిలో నిండిపోతుంది. ఫ్లైట్ టేకాఫ్ తో పాటు మనంకూడా గాలిలో తేలిపోతాం.
ఇందులోని కథలన్నీ వాస్తవాలే. వాస్తవం ఎప్పుడూ కళ్ళకు కట్టినట్టుంటుంది. కల్పన కంటే వాస్తవం దిశా నిర్దేశం చేస్తుంది. విదేశాలకు వెళ్లేవారికి, వెళ్లినవారికి, వెళ్లి వచ్చిన వారికి ఈ పుస్తకం కొంత ఉపయోగపడుతుందని నా నమ్మకం. ఇక వెళ్ళే అవకాశం లేనివారికి - వెళ్లి వచ్చినవారు వారి తీపి అనుభవాలు, కబుర్లు ఎదుటివారితో పంచుకున్నప్పుడు ఈ కథలు చదివాక పసందు విందుగా పనికొస్తుందని నా భావన.
'గాలిలో తేలిపోతున్నాం' ఈ కథా సంపుటికి ఈ పేరే ఎందుకు పెట్టానంటే - విదేశాలకు వెళ్ళేవారు ఎన్నిమార్లు వెళ్ళినా అదొక మధురానుభూతి. నూతనానుభవమే! ఇంటిని వదిలి విదేశానికి పయనమై ఏర్ పోర్టుకు వెళ్ళేవరకు ఉద్వేగంగానే ఉంటుంది. వీడ్కోలు చెప్పడానికి వెంటవచ్చిన ఆత్మీయులు పలుకరింపులు తర్వాత ఏర్ పోర్టులో సెక్యూరిటీ చెకింగ్ పాస్ పోర్టులు, టికెట్ వేరిఫికేషన్స్, లగేజీ తూకాల తర్వాత అన్నీ మరచిపోతాం. ఫ్లైట్లో అడుగుపెట్టి సీటులో సెటిలయ్యాక మనసంతా హాయినిండిపోతుంది. ఇక్కడి ఇండియా ధ్యాస తెగిపోతుంది. అక్కడి మనవాళ్ళ దగ్గరికి చేరుతున్నామన్న ఆనందం మదిలో నిండిపోతుంది. ఫ్లైట్ టేకాఫ్ తో పాటు మనంకూడా గాలిలో తేలిపోతాం. ఇందులోని కథలన్నీ వాస్తవాలే. వాస్తవం ఎప్పుడూ కళ్ళకు కట్టినట్టుంటుంది. కల్పన కంటే వాస్తవం దిశా నిర్దేశం చేస్తుంది. విదేశాలకు వెళ్లేవారికి, వెళ్లినవారికి, వెళ్లి వచ్చిన వారికి ఈ పుస్తకం కొంత ఉపయోగపడుతుందని నా నమ్మకం. ఇక వెళ్ళే అవకాశం లేనివారికి - వెళ్లి వచ్చినవారు వారి తీపి అనుభవాలు, కబుర్లు ఎదుటివారితో పంచుకున్నప్పుడు ఈ కథలు చదివాక పసందు విందుగా పనికొస్తుందని నా భావన.
© 2017,www.logili.com All Rights Reserved.