Samakalika Pettubadidaari Vidhanam Bharatha Arthika Vyavasta

By Gaddam Koteswara Rao (Author)
Rs.100
Rs.100

Samakalika Pettubadidaari Vidhanam Bharatha Arthika Vyavasta
INR
MANIMN4354
In Stock
100.0
Rs.100


In Stock
Ships in 4 - 9 Days
Check for shipping and cod pincode

Description

పెట్టుబడిదారీ వ్యవస్థ

"ఏ విధమైన శ్రమ చెయ్యకుండానే బ్యాంకర్లు, బ్రోకర్లు, వ్యాపారస్తులు, చట్టా | వ్యాపారస్తులు (Speculators) లాంటివారు కేవలం కరెన్సీనో, కాగితాలనో చేతులు మార్చడం ద్వారా కోట్లాది రూపాయలు గడించి, 'తమ సంపాదన ప్రక్రియ' ద్వారా ఆర్థిక వ్యవస్థను సంక్షోభంలోకి నెట్టి కోట్లాది జనం కుటుంబాల్లో చిచ్చుపెట్టగలిగారంటే సామాన్యుడికి అర్థం కాదుగానీ, చదువుకున్నవాడి కెందుకర్థం కాదూ?”

సామ్రాజ్యవాదానికీ, నయా ఉదారవాదానికీ, ప్రపంచీకరణకూ, ఆర్థిక సంక్షోభాలకూ, మూలం పెట్టుబడిదారీ విధానమూ, దాని నడక తీరు :

కార్మికులు కార్లు తయారుచేసినా, ఇళ్ళు కట్టినా, ఉపాధ్యాయులు పాఠాలు చెప్పినా, రైతులు వ్యవసాయం చేసి ఆహార ధాన్యాలు పండించినా, వీళ్ళంతా ఏదో ఒకటి ప్రజల వినియోగం కోసం ఉత్పత్తి చేస్తున్నారు లేక సేవలందిస్తున్నారు. ద్రవ్య మారకపు సంక్లిష్ట సాధనాలు (Complex Financial Instruments) అమ్మకం తప్ప మరేమీ ఉత్పత్తి చెయ్యనివాళ్ళ దగ్గర “ఏం కిటుకుంది?” “ఏం గారడీ చేస్తున్నారు?” “ఏ విధంగా కోట్లు సంపాదిస్తున్నారు?" ఏమీ ఉత్పత్తి చెయ్యకుండా, ఎలాంటి సేవలు అందించకుండా, డబ్బు సంపాదన ప్రక్రియలో ఏదో “నిగూఢ” రహస్యమో లేక "తప్పుడు”తనమో ఉండాలి అని కొద్దిగా ఆలోచించగలిగిన వారు కూడా అనుకోవచ్చు. “మన స్వాములోరై”నా, హస్తసాముద్రికలు చూసేవారైనా, పూజా పునస్కారాలలో మునిగిపోయి, తెరలచాటు నుండి జోస్యాలకోసం తొంగిచూసేవారైనా, అదృష్ట, దురదృష్టాల కాకిలెక్కలతో సమాధానపడతారు. సామాజిక, ఆర్థిక వ్యవస్థ పనితీరు లోతుల్లోకెళ్ళి పరిశీలన చేయకుండానే "షార్టుకట్” సమాధానాలతో సరిపుచ్చుకుంటున్నారు.

ఏ సామాజిక వ్యవస్థ అయినా ప్రజల అవసరాలకు భౌతిక వస్తువులు ఉత్పత్తి చెయ్యకుండా, జీవనాని కవసరమైన ఆహార ధాన్యాలు పండించకుండా మనుగడలో...............

పెట్టుబడిదారీ వ్యవస్థ "ఏ విధమైన శ్రమ చెయ్యకుండానే బ్యాంకర్లు, బ్రోకర్లు, వ్యాపారస్తులు, చట్టా | వ్యాపారస్తులు (Speculators) లాంటివారు కేవలం కరెన్సీనో, కాగితాలనో చేతులు మార్చడం ద్వారా కోట్లాది రూపాయలు గడించి, 'తమ సంపాదన ప్రక్రియ' ద్వారా ఆర్థిక వ్యవస్థను సంక్షోభంలోకి నెట్టి కోట్లాది జనం కుటుంబాల్లో చిచ్చుపెట్టగలిగారంటే సామాన్యుడికి అర్థం కాదుగానీ, చదువుకున్నవాడి కెందుకర్థం కాదూ?” సామ్రాజ్యవాదానికీ, నయా ఉదారవాదానికీ, ప్రపంచీకరణకూ, ఆర్థిక సంక్షోభాలకూ, మూలం పెట్టుబడిదారీ విధానమూ, దాని నడక తీరు : కార్మికులు కార్లు తయారుచేసినా, ఇళ్ళు కట్టినా, ఉపాధ్యాయులు పాఠాలు చెప్పినా, రైతులు వ్యవసాయం చేసి ఆహార ధాన్యాలు పండించినా, వీళ్ళంతా ఏదో ఒకటి ప్రజల వినియోగం కోసం ఉత్పత్తి చేస్తున్నారు లేక సేవలందిస్తున్నారు. ద్రవ్య మారకపు సంక్లిష్ట సాధనాలు (Complex Financial Instruments) అమ్మకం తప్ప మరేమీ ఉత్పత్తి చెయ్యనివాళ్ళ దగ్గర “ఏం కిటుకుంది?” “ఏం గారడీ చేస్తున్నారు?” “ఏ విధంగా కోట్లు సంపాదిస్తున్నారు?" ఏమీ ఉత్పత్తి చెయ్యకుండా, ఎలాంటి సేవలు అందించకుండా, డబ్బు సంపాదన ప్రక్రియలో ఏదో “నిగూఢ” రహస్యమో లేక "తప్పుడు”తనమో ఉండాలి అని కొద్దిగా ఆలోచించగలిగిన వారు కూడా అనుకోవచ్చు. “మన స్వాములోరై”నా, హస్తసాముద్రికలు చూసేవారైనా, పూజా పునస్కారాలలో మునిగిపోయి, తెరలచాటు నుండి జోస్యాలకోసం తొంగిచూసేవారైనా, అదృష్ట, దురదృష్టాల కాకిలెక్కలతో సమాధానపడతారు. సామాజిక, ఆర్థిక వ్యవస్థ పనితీరు లోతుల్లోకెళ్ళి పరిశీలన చేయకుండానే "షార్టుకట్” సమాధానాలతో సరిపుచ్చుకుంటున్నారు. ఏ సామాజిక వ్యవస్థ అయినా ప్రజల అవసరాలకు భౌతిక వస్తువులు ఉత్పత్తి చెయ్యకుండా, జీవనాని కవసరమైన ఆహార ధాన్యాలు పండించకుండా మనుగడలో...............

Features

  • : Samakalika Pettubadidaari Vidhanam Bharatha Arthika Vyavasta
  • : Gaddam Koteswara Rao
  • : Vishalandra Publishing Housing
  • : MANIMN4354
  • : paparback
  • : April, 2023
  • : 112
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Samakalika Pettubadidaari Vidhanam Bharatha Arthika Vyavasta

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam