Sri Arunachala Aksharamanamala

Rs.150
Rs.150

Sri Arunachala Aksharamanamala
INR
MANIMN3257
In Stock
150.0
Rs.150


In Stock
Ships in 4 - 9 Days
Check for shipping and cod pincode

Description

సాగర రమణులు

మా మూడో అల్లుడు డా. తాడేపల్లి పతంజలి రచించిన 'అరుణాచల మణమాల' పుస్తకం ఈ రోజు ప్రచురణ వెలుగులోకి వస్తున్నందుకు చాలా ఆనందంగా ఉంది. ఈ సందర్భంలో శ్రీ అరుణాచల రమణులను, నా హృదయంలో సజీవులుగా ఉన్న శ్రీ సత్యసాగర్ గారిని హృదయపూర్వకంగా స్మరిస్తున్నాను.

శ్రీ సాగర్‌ గారు శ్రీ రమణుల గాఢభక్తులు. 'పురుషోత్తమ రమణ' పేరుతో పుస్తకం రచించి రమణుల అక్షరార్చన చేసిన ధన్యులు. వారు రమణులను తన జీవితంలో త్రికరణ శుద్ధిగా నమ్మినవారు. -

నాకు ఇప్పటికీ బాగా గుర్తు. మా మొదటి అబ్బాయి పురుడు రోజులు. ఇంట్లోనే పురుడు. పిల్లవాడు ఎదురు కాలు మొదటగా బయటకు వచ్చింది. అందరూ బెంబేలెత్తుతున్నారు. హాస్పిటల్‌కు తీసుకువెళదామని అందరూ చెబుతున్నారు. వ్యాను కూడా తీసుకువచ్చారు. రమణులను నమ్ముకున్న సాగర్‌గారు చలించలేదు. రమణులే కాపాడుతారని, ఎక్కడికి వెళ్లనక్కరలేదని నిరంతర రమణ జపం చేసారు. ఆ రమణ మంత్రవిభూతిని నా నోట్లో వేసారు. వారి నమ్మకమే గెలిచింది. సుఖప్రసవమయింది. రమణులు సాగరంలాంటి అనుగ్రహం చూపించారు. అబ్బాయికి 'వెంకటరమణ' అని రమణుల పేరు పెట్టుకొన్నాం.

ఈ నేపథ్యంలో మా అల్లుడు పతంజలి రమణులకు సభక్తిపూర్వకంగా రచించిన 'అరుణాచలమణమాల'ను ప్రచురించాలని నాకు 'సాగరరమణ' సంకల్పం కలిగింది. నా పెద్దకుమారుడు చి. వేంకటరమణ, రెండవ కుమారుడు చి, సాయిరాం ప్రసాద్ మంచిపని చేస్తున్నావని నన్ను ప్రోత్సహించారు. ఈ పుస్తకరచయిత చి. పతంజలికి ఆశీస్సులు. చక్కగా ప్రచురించిన ప్రింటర్స్ వారికి, ప్రచురణ బాధ్యత వహించిన శ్రీమతి వలబోజు జ్యోతిగారికి ధన్యవాదాలు.

- పిలలమర్రి రాజరాజేశ్వరి.

సాగర రమణులు మా మూడో అల్లుడు డా. తాడేపల్లి పతంజలి రచించిన 'అరుణాచల మణమాల' పుస్తకం ఈ రోజు ప్రచురణ వెలుగులోకి వస్తున్నందుకు చాలా ఆనందంగా ఉంది. ఈ సందర్భంలో శ్రీ అరుణాచల రమణులను, నా హృదయంలో సజీవులుగా ఉన్న శ్రీ సత్యసాగర్ గారిని హృదయపూర్వకంగా స్మరిస్తున్నాను. శ్రీ సాగర్‌ గారు శ్రీ రమణుల గాఢభక్తులు. 'పురుషోత్తమ రమణ' పేరుతో పుస్తకం రచించి రమణుల అక్షరార్చన చేసిన ధన్యులు. వారు రమణులను తన జీవితంలో త్రికరణ శుద్ధిగా నమ్మినవారు. - నాకు ఇప్పటికీ బాగా గుర్తు. మా మొదటి అబ్బాయి పురుడు రోజులు. ఇంట్లోనే పురుడు. పిల్లవాడు ఎదురు కాలు మొదటగా బయటకు వచ్చింది. అందరూ బెంబేలెత్తుతున్నారు. హాస్పిటల్‌కు తీసుకువెళదామని అందరూ చెబుతున్నారు. వ్యాను కూడా తీసుకువచ్చారు. రమణులను నమ్ముకున్న సాగర్‌గారు చలించలేదు. రమణులే కాపాడుతారని, ఎక్కడికి వెళ్లనక్కరలేదని నిరంతర రమణ జపం చేసారు. ఆ రమణ మంత్రవిభూతిని నా నోట్లో వేసారు. వారి నమ్మకమే గెలిచింది. సుఖప్రసవమయింది. రమణులు సాగరంలాంటి అనుగ్రహం చూపించారు. అబ్బాయికి 'వెంకటరమణ' అని రమణుల పేరు పెట్టుకొన్నాం. ఈ నేపథ్యంలో మా అల్లుడు పతంజలి రమణులకు సభక్తిపూర్వకంగా రచించిన 'అరుణాచలమణమాల'ను ప్రచురించాలని నాకు 'సాగరరమణ' సంకల్పం కలిగింది. నా పెద్దకుమారుడు చి. వేంకటరమణ, రెండవ కుమారుడు చి, సాయిరాం ప్రసాద్ మంచిపని చేస్తున్నావని నన్ను ప్రోత్సహించారు. ఈ పుస్తకరచయిత చి. పతంజలికి ఆశీస్సులు. చక్కగా ప్రచురించిన ప్రింటర్స్ వారికి, ప్రచురణ బాధ్యత వహించిన శ్రీమతి వలబోజు జ్యోతిగారికి ధన్యవాదాలు. - పిలలమర్రి రాజరాజేశ్వరి.

Features

  • : Sri Arunachala Aksharamanamala
  • : Dr Tadepalli Patanjali
  • : Mohan Publications
  • : MANIMN3257
  • : Papar Back
  • : May, 2022
  • : 152
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Sri Arunachala Aksharamanamala

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam