Ramayanam Values & Virtues

By Prayaga Ramakrishna (Author)
Rs.250
Rs.250

Ramayanam Values & Virtues
INR
MANIMN4118
In Stock
250.0
Rs.250


In Stock
Ships in 4 - 9 Days
Also available in:
Title Price
Ramayana Values & Virtues Rs.350 In Stock
Check for shipping and cod pincode

Description

యువతరానికి కరదీపిక

ఇతిహాసాలు జాతికి విలువలను, జీవనవిధానాన్ని తెలపడంతో పాటు నీతిపాఠాలు చెప్పే పాఠ్యగ్రంథాలు. భరతజాతికి రామాయణ, భారతాలు అలాంటివే. ప్రయాగ రామకృష్ణగారు రామాయణాన్ని మధించి, అనేక కోణాలనుంచి పరామర్శించి, దాన్నుంచి అనేక మంచి విషయాలను, ధర్మాధర్మవివేచనను సరళమైన వాడుక భాషలో, చిన్న చిన్న కథల రూపంలో పాఠకులకు అందించారు. ఈ పుస్తకం నుంచి తెలుసుకోదగిన విషయాలు అనేకం ఉన్నా, నా దృష్టిని ప్రత్యేకంగా ఆకర్షించినది పాలకులు, మంత్రులు ఎలా వ్యవహరించాలి, తమ బృందసభ్యులుగా ఎటువంటి వారిని సమకూర్చుకోవాలి, వారిని ఎలా నిలుపుకోవాలి అనే విషయాలు. వాటిని మీతో పంచుకుంటాను. రామాయణ కాలం నాటి రాజులను యీనాటి మంత్రులుగా అనుకుంటే, ఆనాటి మంత్రులను యీనాటి సచివులుగా (సెక్రటరీలు) అనుకోవచ్చు.

మొదటి అధ్యాయంలోనే ఆయన స్ట్రాటెజిక్ మేనేజ్మెంట్ గురించి చెప్పారు. రావణాసురుడు పెట్టే బాధల గురించి దేవతలు తన వద్ద మొరపెట్టుకున్నపుడు బ్రహ్మ ఓ దీర్ఘకాలిక ప్రణాళికను రూపొందించాడు. విష్ణువును ప్రార్థించి, రాముడిగా పుట్టేందుకు ఒప్పించాడు. రాముడికి సహాయకారులుగా ఉండేందుకు ముందుగా వానరవీరులను సృష్టించమని దేవతలను కోరాడు. వాళ్ళందరు అప్సరసలతో కలసి వానరవీరులను సృష్టించారు. రాముడి వనవాస సమయంలో వీళ్ళంతా కలిసేట్లు చేశాడు. రావణుడు వంటి మహావీరుడ్ని ఎదుర్కోవాలంటే ఎంతో తర్ఫీదు కావాలి. రాజ్యపాలన చేస్తూ ఉండిపోతే అది ఉండేది కాదు కాబట్టి, 14 ఏళ్ళ వనవాసం ద్వారా విరామం కల్పించి, ఆ సమయంలో అనేకమంది రాక్షసులతో యుద్ధాలు చేసి, నైపుణ్యం మెరుగు పర్చుకునేట్లు చేశాడు. అంతేకాదు, బాల్యంలోనే విశ్వామిత్రుడి చేత రాజప్రాసాదం నుంచి బయటకు రప్పించి, కఠోరశిక్షణ యిప్పించాడు. రావణుడి సోదరుడు విభీషణుడికి ధర్మబుద్ధి కలిగించి, అతని ద్వారా రాముడికి లంక గుట్టుమట్లన్నీ తెలిసేట్లు చేశాడు.

ఇక మంత్రుల గురించి అంటే, యీనాటి సెక్రటరీల గురించి చెప్పినప్పుడు...............

యువతరానికి కరదీపిక ఇతిహాసాలు జాతికి విలువలను, జీవనవిధానాన్ని తెలపడంతో పాటు నీతిపాఠాలు చెప్పే పాఠ్యగ్రంథాలు. భరతజాతికి రామాయణ, భారతాలు అలాంటివే. ప్రయాగ రామకృష్ణగారు రామాయణాన్ని మధించి, అనేక కోణాలనుంచి పరామర్శించి, దాన్నుంచి అనేక మంచి విషయాలను, ధర్మాధర్మవివేచనను సరళమైన వాడుక భాషలో, చిన్న చిన్న కథల రూపంలో పాఠకులకు అందించారు. ఈ పుస్తకం నుంచి తెలుసుకోదగిన విషయాలు అనేకం ఉన్నా, నా దృష్టిని ప్రత్యేకంగా ఆకర్షించినది పాలకులు, మంత్రులు ఎలా వ్యవహరించాలి, తమ బృందసభ్యులుగా ఎటువంటి వారిని సమకూర్చుకోవాలి, వారిని ఎలా నిలుపుకోవాలి అనే విషయాలు. వాటిని మీతో పంచుకుంటాను. రామాయణ కాలం నాటి రాజులను యీనాటి మంత్రులుగా అనుకుంటే, ఆనాటి మంత్రులను యీనాటి సచివులుగా (సెక్రటరీలు) అనుకోవచ్చు. మొదటి అధ్యాయంలోనే ఆయన స్ట్రాటెజిక్ మేనేజ్మెంట్ గురించి చెప్పారు. రావణాసురుడు పెట్టే బాధల గురించి దేవతలు తన వద్ద మొరపెట్టుకున్నపుడు బ్రహ్మ ఓ దీర్ఘకాలిక ప్రణాళికను రూపొందించాడు. విష్ణువును ప్రార్థించి, రాముడిగా పుట్టేందుకు ఒప్పించాడు. రాముడికి సహాయకారులుగా ఉండేందుకు ముందుగా వానరవీరులను సృష్టించమని దేవతలను కోరాడు. వాళ్ళందరు అప్సరసలతో కలసి వానరవీరులను సృష్టించారు. రాముడి వనవాస సమయంలో వీళ్ళంతా కలిసేట్లు చేశాడు. రావణుడు వంటి మహావీరుడ్ని ఎదుర్కోవాలంటే ఎంతో తర్ఫీదు కావాలి. రాజ్యపాలన చేస్తూ ఉండిపోతే అది ఉండేది కాదు కాబట్టి, 14 ఏళ్ళ వనవాసం ద్వారా విరామం కల్పించి, ఆ సమయంలో అనేకమంది రాక్షసులతో యుద్ధాలు చేసి, నైపుణ్యం మెరుగు పర్చుకునేట్లు చేశాడు. అంతేకాదు, బాల్యంలోనే విశ్వామిత్రుడి చేత రాజప్రాసాదం నుంచి బయటకు రప్పించి, కఠోరశిక్షణ యిప్పించాడు. రావణుడి సోదరుడు విభీషణుడికి ధర్మబుద్ధి కలిగించి, అతని ద్వారా రాముడికి లంక గుట్టుమట్లన్నీ తెలిసేట్లు చేశాడు. ఇక మంత్రుల గురించి అంటే, యీనాటి సెక్రటరీల గురించి చెప్పినప్పుడు...............

Features

  • : Ramayanam Values & Virtues
  • : Prayaga Ramakrishna
  • : Navodaya Book House
  • : MANIMN4118
  • : paparback
  • : Jan, 2023
  • : 174
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Ramayanam Values & Virtues

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam