Purana Paramarsa

By Mbs Prasad (Author)
Rs.250
Rs.250

Purana Paramarsa
INR
MANIMN5025
In Stock
250.0
Rs.250


In Stock
Ships in 4 - 9 Days
Check for shipping and cod pincode

Description

01 రామపట్టాభిషేకంలో రాజకీయ కోణం

పురాణాల గురించి నా ఉద్దేశం చెప్తాను. వాటిని తప్పక చదవాలి. ఎందుకంటే మానవస్వభావాలను, వాటి ఫలితాలను అవి చెప్తాయి. చాలా వాటికి చారిత్రక ఘటనలు మూలంగా ఉంటాయి. అయితే కాలక్రమంలో అతిశయోక్తులు, అద్భుతాలు, ప్రక్షిప్తాలు చోటు చేసుకుంటాయి. అందువలన విచక్షణతో చదవాలి. పైగా ఎప్పుడూ విజేతల కథలే గాథలవుతాయి. 2014లో చంద్రబాబుపై పుస్తకాలు వస్తాయి. 2019లో జగన్పై పుస్తకాలు వస్తాయి. నెగ్గినవారిని గొప్పగా వర్ణించి, వారి తప్పులను వైట్ వాష్ చేసి, ఓడినవారిని తక్కువగా చూపి, వారి లోపాలను హైలైట్ చేయడం జరుగుతుంది. పురాణాలలో అయితే వాటికి పూర్వజన్మ వృత్తాంతాలు, శాపాలు, వరాలు వాడుకుంటారు. భారతాన్ని కౌరవుల పరంగా రాస్తే మరోలా తోస్తుంది. ఇన్ని కన్సెషన్లతో మనం పురాణగాథలను తరచి చూడగలగాలి. వాటిని చరిత్ర పుస్తకాలుగా చూడడానికి వీలులేదు. అవి జాతికి నీతిబోధకాలు. మంచి లక్షణాలుంటే ఎలా పైకి వస్తారో, ఎంతటివాడినైనా సరే చెడు లక్షణాలు ఎలా కిందకు లాగుతాయో, రసవత్తరంగా చెప్తాయి.

ఇక రామాయణానికి వస్తే - సీతాపరిత్యాగం, శంబూకవధ వృత్తాంతాలున్న ఉత్తర కాండను పక్కన పెట్టేయాలి. అది వాల్మీకి కృతం కాదనే అనాలి. పట్టాభిషేకంతో వాల్మీకం పూర్తవుతుంది. దాని ప్రకారం రాముడి పాత్ర ఆదర్శప్రాయమైనది. పురుషోత్తముడనే బిరుదుకు తగినవాడు రాముడు. నరుడిగానే ఉంటూ ధర్మాన్ని పాటించి చూపాడు. అయితే అతని చుట్టూ వున్నవాళ్లంతా గొప్పవాళ్లు కానక్కరలేదు. ఎవరి వికారాలు వారికి ఉన్నాయి. అది మనం గుర్తెరగాలి. రాముని యువరాజ పట్టాభిషేకం ఘట్టానికి వస్తే, పెరియార్ రామస్వామి నాయకర్ ఎత్తిపొడిచాడు వశిష్టుడు పెట్టిన ఆ ముహూర్తం ఎంత దరిద్రంగా ఉందంటే సింహాసనం దక్కలేదు సరి కదా, రాముడు అడవులపాలై పోయాడు, అతని తల్లులు విధవలై పోయారు అని. నిజానికి ముహూర్తం దశరథుడు పెట్టాడు. వశిష్టుడు ఆమోదించాడు. అయినా భగ్నమైంది, ఎందువలన అంటే పొలిటికల్ ఇంట్రిగ్యూ కారణంగా అనుకోవాలి.

ఇక్కణ్నుంచి వాల్మీకి రామాయణంలో ఉన్నది రాస్తాను. దానిపై నా వ్యాఖ్యానం బ్రాకెట్లలో రాస్తాను. - రాముడు రాజ్యపాలనం చేస్తూ వుంటే చూసి సంతోషించి చనిపోవాలి అని దశరథుడు అనుకున్నాడు. మంత్రులతో "నాకు వార్ధక్యం వచ్చింది,.............

01 రామపట్టాభిషేకంలో రాజకీయ కోణం పురాణాల గురించి నా ఉద్దేశం చెప్తాను. వాటిని తప్పక చదవాలి. ఎందుకంటే మానవస్వభావాలను, వాటి ఫలితాలను అవి చెప్తాయి. చాలా వాటికి చారిత్రక ఘటనలు మూలంగా ఉంటాయి. అయితే కాలక్రమంలో అతిశయోక్తులు, అద్భుతాలు, ప్రక్షిప్తాలు చోటు చేసుకుంటాయి. అందువలన విచక్షణతో చదవాలి. పైగా ఎప్పుడూ విజేతల కథలే గాథలవుతాయి. 2014లో చంద్రబాబుపై పుస్తకాలు వస్తాయి. 2019లో జగన్పై పుస్తకాలు వస్తాయి. నెగ్గినవారిని గొప్పగా వర్ణించి, వారి తప్పులను వైట్ వాష్ చేసి, ఓడినవారిని తక్కువగా చూపి, వారి లోపాలను హైలైట్ చేయడం జరుగుతుంది. పురాణాలలో అయితే వాటికి పూర్వజన్మ వృత్తాంతాలు, శాపాలు, వరాలు వాడుకుంటారు. భారతాన్ని కౌరవుల పరంగా రాస్తే మరోలా తోస్తుంది. ఇన్ని కన్సెషన్లతో మనం పురాణగాథలను తరచి చూడగలగాలి. వాటిని చరిత్ర పుస్తకాలుగా చూడడానికి వీలులేదు. అవి జాతికి నీతిబోధకాలు. మంచి లక్షణాలుంటే ఎలా పైకి వస్తారో, ఎంతటివాడినైనా సరే చెడు లక్షణాలు ఎలా కిందకు లాగుతాయో, రసవత్తరంగా చెప్తాయి. ఇక రామాయణానికి వస్తే - సీతాపరిత్యాగం, శంబూకవధ వృత్తాంతాలున్న ఉత్తర కాండను పక్కన పెట్టేయాలి. అది వాల్మీకి కృతం కాదనే అనాలి. పట్టాభిషేకంతో వాల్మీకం పూర్తవుతుంది. దాని ప్రకారం రాముడి పాత్ర ఆదర్శప్రాయమైనది. పురుషోత్తముడనే బిరుదుకు తగినవాడు రాముడు. నరుడిగానే ఉంటూ ధర్మాన్ని పాటించి చూపాడు. అయితే అతని చుట్టూ వున్నవాళ్లంతా గొప్పవాళ్లు కానక్కరలేదు. ఎవరి వికారాలు వారికి ఉన్నాయి. అది మనం గుర్తెరగాలి. రాముని యువరాజ పట్టాభిషేకం ఘట్టానికి వస్తే, పెరియార్ రామస్వామి నాయకర్ ఎత్తిపొడిచాడు వశిష్టుడు పెట్టిన ఆ ముహూర్తం ఎంత దరిద్రంగా ఉందంటే సింహాసనం దక్కలేదు సరి కదా, రాముడు అడవులపాలై పోయాడు, అతని తల్లులు విధవలై పోయారు అని. నిజానికి ముహూర్తం దశరథుడు పెట్టాడు. వశిష్టుడు ఆమోదించాడు. అయినా భగ్నమైంది, ఎందువలన అంటే పొలిటికల్ ఇంట్రిగ్యూ కారణంగా అనుకోవాలి. ఇక్కణ్నుంచి వాల్మీకి రామాయణంలో ఉన్నది రాస్తాను. దానిపై నా వ్యాఖ్యానం బ్రాకెట్లలో రాస్తాను. - రాముడు రాజ్యపాలనం చేస్తూ వుంటే చూసి సంతోషించి చనిపోవాలి అని దశరథుడు అనుకున్నాడు. మంత్రులతో "నాకు వార్ధక్యం వచ్చింది,.............

Features

  • : Purana Paramarsa
  • : Mbs Prasad
  • : Navodaya Book House
  • : MANIMN5025
  • : paparback
  • : Dec, 2023
  • : 416
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Purana Paramarsa

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam