Oka Ventade Gnapakam

By V Chenchaiah (Author)
Rs.40
Rs.40

Oka Ventade Gnapakam
INR
MANIMN3311
In Stock
40.0
Rs.40


In Stock
Ships in 4 - 9 Days
Check for shipping and cod pincode

Description

ఒక వెంటాడే జ్ఞాపకం

1973 వ సంవత్సరం. చిత్తూరు జిల్లా పుత్తూరులో పుత్తూరు తాలూకా రచయితల సంఘం ఆధ్వర్యంలో సాహితీసభ జరుగుతోంది. శ్రీశ్రీ, త్రిపురనేని మధుసూదనరావులు ప్రధాన వక్తలు, సభానంతరం కవి సమ్మేళనం పెట్టారు. చిట్టచివరగా నేనొక గేయాన్ని చదివాను. అది వెంకటేశ్వరస్వామిపై వ్యంగ్య రచన (సెటైర్), చదువుతున్నంత సేపూ సభలో ముందు కూర్చున్న ఒకతను ఏదో అరుస్తున్నాడు. అది పట్టించుకోకుండా నా పాటికి నేను చదువుతున్నాను. చివరి చరణాలు చదువుతుండగా, ఇక తట్టుకోలేక అతను నాదగ్గర కొచ్చి, మైకులాక్కొని, 'ఇంకాపవయ్య చాలుగాని' అని కోపంగా అన్నాడు. నాకేమీ అర్థం గాలేదు. ఎలాగూ అయిపోయిందిగదా ఆపేశాను, వేదికపై శ్రీ శ్రీ మధుసూదనరావులు చూస్తూనే న్నారు.

అప్పుడు నేను తిరుపతిలో శ్రీవెంకటేశ్వర విశ్వవిద్యాలయంలో తెలుగు ఎం.ఎ. రెండో సంవత్సరం చదువుతున్నాను. అప్పట్లో నేను వచన కవితలు, గేయాలు రాసేవాణ్ని. బహుశ అదే సంవత్సరం అనుకుంటాను ఆగస్టు 15 నాడు హైదరాబాద్ రేడియో కేంద్రంవారు నిర్వహించిన కవి సమేళ నం రేడియోలో ప్రసారం అయింది. అది నేను పూర్తిగా విన్నాను. అందులో శ్రీ శ్రీది ఒక గేయం ఉంది.

దానికి శ్రీశ్రీ హజరు కాలేక పోయినందువల్ల ఆ గేయాన్ని ఆరుద్ర చదివాడు. ఆరుద్ర భావ యుక్తంగా బాగా చదివాడు. శ్రీశ్రీ రాయడం, ఆరుద్ర చదవడం-ఆగేయానికి ఒక నిండుదనం వచ్చింది. బహుశ అప్పట్లో శ్రీశ్రీ చదివుంటే అంత ఆకర్షణీయంగా ఉండేది కాదేమో! ఆగేయం నన్ను బలంగా ఆకర్షించింది.

“ఓ మహాత్మా ఓమహర్షి / ఓ క్షమా పీయూషవరీ ! ఓ తపస్వీ ఓ యశస్వీ ఓ అహింసాశయ మనస్వీ !

ఎక్కడయ్యా నీ అహింస? | ఏడ నీ కరుణారిరంస! 'అలా సాగుతుంది. ఆ గేయం. ఆ తర్వాత అది పత్రికలో అచ్చయింది. దాన్ని ఎన్నిసార్లు చదువుకున్నానో లెక్కలేదు. దాదాపు ఆ గేయం నోటి కొచ్చేసింది. ఆ ప్రభావంతో అదే లయలో నేనో గేయం రాశాను

'వెంకటేశా శ్రీనివాసా! చాలులే ఇక నీతమాషా

పనికి రావని తేలిపోయెను / ఏల నీపై భరోసా!" ఇలా సాగుతుంది నా గేయం. దేవుడిపెన విమర్శ కావడం, అందులోను వ్యంగ్యం ఉండడంతో

కోపం వచ్చింది. నేను గేయాన్ని చదువుతున్నంత సేపూ తనకోపాన్ని ప్రదర్శిస్తూ అరుస్తూనే ఉన్నాడు. గేయం మద్యలో - బహ్మసత్వం జగన్మిధ్యని / గీతలో నీవు చెబితివి |

ఒక వెంటాడే జ్ఞాపకం 1973 వ సంవత్సరం. చిత్తూరు జిల్లా పుత్తూరులో పుత్తూరు తాలూకా రచయితల సంఘం ఆధ్వర్యంలో సాహితీసభ జరుగుతోంది. శ్రీశ్రీ, త్రిపురనేని మధుసూదనరావులు ప్రధాన వక్తలు, సభానంతరం కవి సమ్మేళనం పెట్టారు. చిట్టచివరగా నేనొక గేయాన్ని చదివాను. అది వెంకటేశ్వరస్వామిపై వ్యంగ్య రచన (సెటైర్), చదువుతున్నంత సేపూ సభలో ముందు కూర్చున్న ఒకతను ఏదో అరుస్తున్నాడు. అది పట్టించుకోకుండా నా పాటికి నేను చదువుతున్నాను. చివరి చరణాలు చదువుతుండగా, ఇక తట్టుకోలేక అతను నాదగ్గర కొచ్చి, మైకులాక్కొని, 'ఇంకాపవయ్య చాలుగాని' అని కోపంగా అన్నాడు. నాకేమీ అర్థం గాలేదు. ఎలాగూ అయిపోయిందిగదా ఆపేశాను, వేదికపై శ్రీ శ్రీ మధుసూదనరావులు చూస్తూనే న్నారు. అప్పుడు నేను తిరుపతిలో శ్రీవెంకటేశ్వర విశ్వవిద్యాలయంలో తెలుగు ఎం.ఎ. రెండో సంవత్సరం చదువుతున్నాను. అప్పట్లో నేను వచన కవితలు, గేయాలు రాసేవాణ్ని. బహుశ అదే సంవత్సరం అనుకుంటాను ఆగస్టు 15 నాడు హైదరాబాద్ రేడియో కేంద్రంవారు నిర్వహించిన కవి సమేళ నం రేడియోలో ప్రసారం అయింది. అది నేను పూర్తిగా విన్నాను. అందులో శ్రీ శ్రీది ఒక గేయం ఉంది. దానికి శ్రీశ్రీ హజరు కాలేక పోయినందువల్ల ఆ గేయాన్ని ఆరుద్ర చదివాడు. ఆరుద్ర భావ యుక్తంగా బాగా చదివాడు. శ్రీశ్రీ రాయడం, ఆరుద్ర చదవడం-ఆగేయానికి ఒక నిండుదనం వచ్చింది. బహుశ అప్పట్లో శ్రీశ్రీ చదివుంటే అంత ఆకర్షణీయంగా ఉండేది కాదేమో! ఆగేయం నన్ను బలంగా ఆకర్షించింది. “ఓ మహాత్మా ఓమహర్షి / ఓ క్షమా పీయూషవరీ ! ఓ తపస్వీ ఓ యశస్వీ ఓ అహింసాశయ మనస్వీ ! ఎక్కడయ్యా నీ అహింస? | ఏడ నీ కరుణారిరంస! 'అలా సాగుతుంది. ఆ గేయం. ఆ తర్వాత అది పత్రికలో అచ్చయింది. దాన్ని ఎన్నిసార్లు చదువుకున్నానో లెక్కలేదు. దాదాపు ఆ గేయం నోటి కొచ్చేసింది. ఆ ప్రభావంతో అదే లయలో నేనో గేయం రాశాను 'వెంకటేశా శ్రీనివాసా! చాలులే ఇక నీతమాషా పనికి రావని తేలిపోయెను / ఏల నీపై భరోసా!" ఇలా సాగుతుంది నా గేయం. దేవుడిపెన విమర్శ కావడం, అందులోను వ్యంగ్యం ఉండడంతో కోపం వచ్చింది. నేను గేయాన్ని చదువుతున్నంత సేపూ తనకోపాన్ని ప్రదర్శిస్తూ అరుస్తూనే ఉన్నాడు. గేయం మద్యలో - బహ్మసత్వం జగన్మిధ్యని / గీతలో నీవు చెబితివి |

Features

  • : Oka Ventade Gnapakam
  • : V Chenchaiah
  • : Sri Sri Sahityanidhi Publication
  • : MANIMN3311
  • : Papar Back
  • : April, 2016
  • : 47
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Oka Ventade Gnapakam

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam