Manasuloni Chali

Rs.60
Rs.60

Manasuloni Chali
INR
ETCBKTC123
Out Of Stock
60.0
Rs.60
Out of Stock
Out Of Stock
Check for shipping and cod pincode

Description

                స్వార్థ చింతనతో కూడిన మానవ సంబంధాల్లో పరస్పర అవగాహన ఎంత ముఖ్యమో చెప్పే నవల శ్రీ ముక్తవరం పార్థసారథి రచించిన 'మనసులోని చలి'. మధ్యతరగతి సంసారాల్లో సామాన్యంగా ఉండే కష్టాల్నీ, బాధల్నే, వాస్తవికంగా చిత్రిస్తూనే, ఒక తాత్త్విక దృక్పథంతో, మానసిక విశ్లేషణతో రాసిన నవల ఇది. ఈ నవలలో హృదయాన్ని స్పృశించే, మనస్సుని కుదిపే సహజమైన, అర్థవంతమైన సంభాషణల ద్వారా వివిధ మనస్తత్వాలను ప్రతిభావంతంగా చిత్రించడం జరిగింది. నిర్మలంగా ఉన్నట్లు కనిపించే సరస్సులోకి రాయి విసిరితే అది సృష్టించే అలల లాంటివి ఇందులోని సంఘటనలూ, సన్నివేశాలూ, తీసుకున్న ఇతివృత్తాన్ని సరళంగానూ, శక్తివంతంగానూ ఆవిష్కరించిన తీరు అభినందనీయం.

                 'వేదాంత గ్రంథాలలో' ఎంత చదివామన్నది ముఖ్యం కాదు, 'ఎంతవరకు అది మన జీవిత వైఖరిని మలచగలుగుతుందనేది అవసరం. ఎంత నిజాయితీతో మనం ఆ జ్ఞానాన్ని ఆచరణలో పెట్టగలమనేది ముఖ్యం' అన్న  మాటలు ఆధ్యాత్మిక దృక్పథం ఉన్న వారందరికీ వర్తిస్తాయి. జీవితం సంఘర్షణమయం  కాకుండా ఉండాలంటే, ఎవరైనా చేయవలసింది అదే. ఒక ప్రయోజనకరమైన సందేశాన్ని సూచనాత్మకంగా అందించిన రచయిత పార్థసారథి గారికి అభినందనలు!

                       - అబ్బూరి ఛాయాదేవి

                స్వార్థ చింతనతో కూడిన మానవ సంబంధాల్లో పరస్పర అవగాహన ఎంత ముఖ్యమో చెప్పే నవల శ్రీ ముక్తవరం పార్థసారథి రచించిన 'మనసులోని చలి'. మధ్యతరగతి సంసారాల్లో సామాన్యంగా ఉండే కష్టాల్నీ, బాధల్నే, వాస్తవికంగా చిత్రిస్తూనే, ఒక తాత్త్విక దృక్పథంతో, మానసిక విశ్లేషణతో రాసిన నవల ఇది. ఈ నవలలో హృదయాన్ని స్పృశించే, మనస్సుని కుదిపే సహజమైన, అర్థవంతమైన సంభాషణల ద్వారా వివిధ మనస్తత్వాలను ప్రతిభావంతంగా చిత్రించడం జరిగింది. నిర్మలంగా ఉన్నట్లు కనిపించే సరస్సులోకి రాయి విసిరితే అది సృష్టించే అలల లాంటివి ఇందులోని సంఘటనలూ, సన్నివేశాలూ, తీసుకున్న ఇతివృత్తాన్ని సరళంగానూ, శక్తివంతంగానూ ఆవిష్కరించిన తీరు అభినందనీయం.                  'వేదాంత గ్రంథాలలో' ఎంత చదివామన్నది ముఖ్యం కాదు, 'ఎంతవరకు అది మన జీవిత వైఖరిని మలచగలుగుతుందనేది అవసరం. ఎంత నిజాయితీతో మనం ఆ జ్ఞానాన్ని ఆచరణలో పెట్టగలమనేది ముఖ్యం' అన్న  మాటలు ఆధ్యాత్మిక దృక్పథం ఉన్న వారందరికీ వర్తిస్తాయి. జీవితం సంఘర్షణమయం  కాకుండా ఉండాలంటే, ఎవరైనా చేయవలసింది అదే. ఒక ప్రయోజనకరమైన సందేశాన్ని సూచనాత్మకంగా అందించిన రచయిత పార్థసారథి గారికి అభినందనలు!                        - అబ్బూరి ఛాయాదేవి

Features

  • : Manasuloni Chali
  • : Mukthavaram Parthasaradhi
  • : Vikasam Books
  • : ETCBKTC123
  • : Paperback
  • : 2017
  • : 96
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Manasuloni Chali

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam