Agneepadham

Rs.375
Rs.375

Agneepadham
INR
MANIMN3407
In Stock
375.0
Rs.375


In Stock
Ships in 4 - 9 Days
Check for shipping and cod pincode

Description

అగ్నిపథం

శ్వేతాశ్వాలవెంట రథం పరుగులు తీస్తోంది.

గుర్రాలు రథాన్ని అవలీలగా లాగుతూ వెళుతున్నాయి. వాటి పరుగులో వేగం ఉ ంది. ఉత్సాహం ఉంది. హరిత ప్రకృతి కాంత పాపటలా వున్న ఆ శకటమార్గం రాజధానికి వెళుతుందని రథాన్ని లాగుతున్న జవనాశ్వాలకు తెలుసు.

"ప్రకృతి విశ్వరూపం ధరించి దర్శనమిస్తోంది. గురుదేవా!" రథంలో గురువుకు అభిముఖంగా కూచుని, దారికి ఇరువైపులా వున్న అరణ్యసౌందర్యాన్ని చూస్తూ అన్నాడు అగ్నిదత్తుడు.

శిష్యుణ్ణి చిరునవ్వుతో చూశాడు విద్యాధరుడు. “ప్రకృతి అనుగ్రహం పొందిన రాజ్యం నాయనా మనది. కాలం మన రాజ్యంమీద ఏనాడూ కన్నెర్ర చేయలేదు. అరణ్య సంపద, పశుసంపద, వ్యవసాయసంపద పుష్కలంగా కొనసాగుతూ మన రాజ్యాన్ని సుభిక్షంగా ఉంచుతున్నాయి. అరణ్యం బాగుంటే అంతా బాగున్నట్లే! తరతరాలుగా మన రాజ్యం వృక్షరక్షణకు పెద్దపీట వేసింది. వృక్షాలను నరికేవాడు 'అసిపత్రం' అనే నరకంలో పడతాడు అన్నాయి శాస్త్రాలు...”

“బాగుంది గురుదేవా!” అన్నాడు అగ్నిదత్తుడు.

“చెట్టుకు పట్టంకట్టింది మనజాతి. 'శివతత్వరత్నాకరం' అనే గ్రంథం ఏమందో తెలుసా, అగ్నీ?"

"చెప్పండి......

“దశపుత్ర సమోద్రుమః" ఒకచెట్టు పదిమంది పుత్రలతో సమానం - అంది! అన్నాడు విద్యాధరుడు.

అగ్నిదత్తుడు గురువుగారిని చూస్తూ ఉండిపోయాడు. ఏడడుగుల ఎత్తుతో బలంగా కనిపిస్తున్న కండలు తిరిగిన శరీరం, తెల్లటి గిరజాలజుట్టు, తెల్లటి బుర్రమీసాలు, ఎర్రటి

ధోవతి, మెడమీద నుండి క్రిందికి, రెండువైపులకూ వేళ్ళాడుతున్న బంగారు రంగు అంచు ఉత్తరీయం. తెల్లగా మెరుస్తున్న యజ్ఞోపవీతం, నాలుగైదు రుద్రాక్షమాలలు. వాటి మధ్య ఇరుక్కున్న బంగారు గొలుసు.................

అగ్నిపథం శ్వేతాశ్వాలవెంట రథం పరుగులు తీస్తోంది. గుర్రాలు రథాన్ని అవలీలగా లాగుతూ వెళుతున్నాయి. వాటి పరుగులో వేగం ఉ ంది. ఉత్సాహం ఉంది. హరిత ప్రకృతి కాంత పాపటలా వున్న ఆ శకటమార్గం రాజధానికి వెళుతుందని రథాన్ని లాగుతున్న జవనాశ్వాలకు తెలుసు. "ప్రకృతి విశ్వరూపం ధరించి దర్శనమిస్తోంది. గురుదేవా!" రథంలో గురువుకు అభిముఖంగా కూచుని, దారికి ఇరువైపులా వున్న అరణ్యసౌందర్యాన్ని చూస్తూ అన్నాడు అగ్నిదత్తుడు. శిష్యుణ్ణి చిరునవ్వుతో చూశాడు విద్యాధరుడు. “ప్రకృతి అనుగ్రహం పొందిన రాజ్యం నాయనా మనది. కాలం మన రాజ్యంమీద ఏనాడూ కన్నెర్ర చేయలేదు. అరణ్య సంపద, పశుసంపద, వ్యవసాయసంపద పుష్కలంగా కొనసాగుతూ మన రాజ్యాన్ని సుభిక్షంగా ఉంచుతున్నాయి. అరణ్యం బాగుంటే అంతా బాగున్నట్లే! తరతరాలుగా మన రాజ్యం వృక్షరక్షణకు పెద్దపీట వేసింది. వృక్షాలను నరికేవాడు 'అసిపత్రం' అనే నరకంలో పడతాడు అన్నాయి శాస్త్రాలు...” “బాగుంది గురుదేవా!” అన్నాడు అగ్నిదత్తుడు. “చెట్టుకు పట్టంకట్టింది మనజాతి. 'శివతత్వరత్నాకరం' అనే గ్రంథం ఏమందో తెలుసా, అగ్నీ?" "చెప్పండి...... “దశపుత్ర సమోద్రుమః" ఒకచెట్టు పదిమంది పుత్రలతో సమానం - అంది! అన్నాడు విద్యాధరుడు. అగ్నిదత్తుడు గురువుగారిని చూస్తూ ఉండిపోయాడు. ఏడడుగుల ఎత్తుతో బలంగా కనిపిస్తున్న కండలు తిరిగిన శరీరం, తెల్లటి గిరజాలజుట్టు, తెల్లటి బుర్రమీసాలు, ఎర్రటి ధోవతి, మెడమీద నుండి క్రిందికి, రెండువైపులకూ వేళ్ళాడుతున్న బంగారు రంగు అంచు ఉత్తరీయం. తెల్లగా మెరుస్తున్న యజ్ఞోపవీతం, నాలుగైదు రుద్రాక్షమాలలు. వాటి మధ్య ఇరుక్కున్న బంగారు గొలుసు.................

Features

  • : Agneepadham
  • : Vakhatham Suryanarayana Rao
  • : Classic Books
  • : MANIMN3407
  • : Papar Back
  • : June, 2022
  • : 430
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Agneepadham

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam