Rojuko Sukthi

By Swami Vivekananda (Author)
Rs.50
Rs.50

Rojuko Sukthi
INR
RAMKRIMA11
In Stock
50.0
Rs.50


In Stock
Ships in 5 - 15 Days
Check for shipping and cod pincode

Description

పట్టుదల వదలకుండా చేసే ప్రయత్నం

చివరకు విజయాన్ని చేకూరుస్తుంది.

ఒక్క రోజులో దేన్నీ సాధించలేం.

 

పరాజయాలను పట్టించుకోకండి, అవి సర్వ సాధారణం,

అవే జీవితానికి మెరుగులు దిద్దేవి.

ఓటములే లేని జీవితం ఉంటుందా?    

 

వీరులై ఉండండి! ధీరులై ఉండండి!

మనిషి మరణించేది ఒక్కసారి మాత్రమే. 

 

               ఆధునికత వైపు పరుగులు పెడుతున్న నేటితరం యువత ఆధునికత అంటే నైతిక, ఆధ్యాత్మిక, సామాజిక స్పృహ అనే విలువల పట్ల తిరస్కార భావం కాదని తెలుసుకొనే తరుణం ఆసన్నమయ్యింది. భారతదేశ సంస్కృతీ సంప్రదాయాలను తెలుసుకొని, భారతజాతి నిండు గౌరవాన్ని కాపాడుకోవాలన్న తపనతో, ప్రతికూల ప్రాబల్యాలకు లోనుకాకుండా, శక్తిని, ఉత్సాహాన్ని, దేశభక్తిని, ఆత్మవిశ్వాసాన్ని రగులుకోల్పి మార్గదర్శనం చేసే వ్యక్తి స్వామి వివేకానంద అని యువత గుర్తించింది. అయన గురించి, వారు ఇచ్చిన సందేశం గురించి తెలుసుకోవాలన్న తపన యువతలో నానాటికి పెరగడం ఆనందాన్ని కలిగిస్తుంది.

               సరిగ్గా 150 సంవత్సరాల తరువాత జాతి యావత్తూ ఆ నవీన యువసన్యాసికి నీరాజనం పట్టడానికి సన్నద్ధం అవుతోంది. అయన విశాలమైన ఉదారాశయాలు సర్వజనాంగీకారాన్ని పొందుతున్నాయి. ప్రతీ కార్యరంగంలోను, ప్రతీ ఆలోచనా విధానంలోను ఉత్తేజాన్ని కలిగిస్తున్నాయి. సమస్యావలయంలో ఉన్న సమాజంలో ప్రతి సమస్యా పరిష్కారానికి సమాధానాన్ని యువత అయన రచనల ద్వారా తెలుసుకుంటున్నారు. 

              స్వామి వివేకానంద 150 వ జయంత్యుత్సవాల సందర్బంగా 'స్వామి వివేకానంద స్పూర్తి...రోజుకో సూక్తి' అనే చిన్న పుస్తకాన్ని తీర్చిదిద్ది మీకు అందిస్తున్నాం. యువత ప్రతి రోజు క్రమం తప్పక ఒక సూక్తిని చదివి, స్పూర్తిని పొంది ఆచరించగలిగితే: జీవితంలో అత్యున్నత శిఖరాలను అధిరోహిస్తారనడంలో ఏ మాత్రం సందేహం లేదు.

-ప్రకాశకులు  

పట్టుదల వదలకుండా చేసే ప్రయత్నం చివరకు విజయాన్ని చేకూరుస్తుంది. ఒక్క రోజులో దేన్నీ సాధించలేం.   పరాజయాలను పట్టించుకోకండి, అవి సర్వ సాధారణం, అవే జీవితానికి మెరుగులు దిద్దేవి. ఓటములే లేని జీవితం ఉంటుందా?       వీరులై ఉండండి! ధీరులై ఉండండి! మనిషి మరణించేది ఒక్కసారి మాత్రమే.                   ఆధునికత వైపు పరుగులు పెడుతున్న నేటితరం యువత ఆధునికత అంటే నైతిక, ఆధ్యాత్మిక, సామాజిక స్పృహ అనే విలువల పట్ల తిరస్కార భావం కాదని తెలుసుకొనే తరుణం ఆసన్నమయ్యింది. భారతదేశ సంస్కృతీ సంప్రదాయాలను తెలుసుకొని, భారతజాతి నిండు గౌరవాన్ని కాపాడుకోవాలన్న తపనతో, ప్రతికూల ప్రాబల్యాలకు లోనుకాకుండా, శక్తిని, ఉత్సాహాన్ని, దేశభక్తిని, ఆత్మవిశ్వాసాన్ని రగులుకోల్పి మార్గదర్శనం చేసే వ్యక్తి స్వామి వివేకానంద అని యువత గుర్తించింది. అయన గురించి, వారు ఇచ్చిన సందేశం గురించి తెలుసుకోవాలన్న తపన యువతలో నానాటికి పెరగడం ఆనందాన్ని కలిగిస్తుంది.                సరిగ్గా 150 సంవత్సరాల తరువాత జాతి యావత్తూ ఆ నవీన యువసన్యాసికి నీరాజనం పట్టడానికి సన్నద్ధం అవుతోంది. అయన విశాలమైన ఉదారాశయాలు సర్వజనాంగీకారాన్ని పొందుతున్నాయి. ప్రతీ కార్యరంగంలోను, ప్రతీ ఆలోచనా విధానంలోను ఉత్తేజాన్ని కలిగిస్తున్నాయి. సమస్యావలయంలో ఉన్న సమాజంలో ప్రతి సమస్యా పరిష్కారానికి సమాధానాన్ని యువత అయన రచనల ద్వారా తెలుసుకుంటున్నారు.                స్వామి వివేకానంద 150 వ జయంత్యుత్సవాల సందర్బంగా 'స్వామి వివేకానంద స్పూర్తి...రోజుకో సూక్తి' అనే చిన్న పుస్తకాన్ని తీర్చిదిద్ది మీకు అందిస్తున్నాం. యువత ప్రతి రోజు క్రమం తప్పక ఒక సూక్తిని చదివి, స్పూర్తిని పొంది ఆచరించగలిగితే: జీవితంలో అత్యున్నత శిఖరాలను అధిరోహిస్తారనడంలో ఏ మాత్రం సందేహం లేదు. -ప్రకాశకులు  

Features

  • : Rojuko Sukthi
  • : Swami Vivekananda
  • : Ramakrishna Matam
  • : RAMKRIMA11
  • : Hardbound
  • : 383
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Rojuko Sukthi

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam