Modi Bharatham

By D V V S Varma (Author)
Rs.30
Rs.30

Modi Bharatham
INR
MANIMN3361
In Stock
30.0
Rs.30


In Stock
Ships in 4 - 9 Days
Check for shipping and cod pincode

Description

మోదీ జైత్రయాత్రకు అడ్డుకట్ట పడుతుందా?

మె26 తో మోదీ పాలనకు 8 ఏళ్లు నిందు తున్నాయి. మోదీ సాగిస్తున్న జైత్రయాత్ర మీద, పాలన

సంపాదకీయం ఫలితాల మీద సమాలోచనకు ఇదొక సందర్భం. మోదీకి

ఒక భక్త బృందం వుంది. వారు యీ జైత్రయాత్రకు ఎదురులేదంటారు. “హిందూరాష్ట్ర' కనుచూపు మేరలోకి వచ్చిందంటారు. మరోపక్క మోదీని విమర్శించే వారున్నారు. 2024లో మోదీ ఓటమి సాధ్యపడేలా లేదంటారు. మోదీకి ధీటైన నాయకుడు లేడని, ప్రతిపక్షాలు ప్రశ్నించడానికే తప్ప ప్రతిఘటించే ఉమ్మడి వ్యూహం వారికి లేదంటారు. ఎన్నికల బాండ్ల రూపంలో దానికి అపరిమిత ఆర్థికబలం వుందనీ, క్షేత్రస్థాయిలో పుకార్లు నడిపించే పదాతి దళాలు వున్నాయని అంటారు. ఇవన్నీ అందరూ ఏదోమేరకు అంగీకరించే విషయాలుగానే కనిపిస్తాయి.

పోతే మోదీ రాజకీయాలను, పాలనా తీరును లోతుగా పరిశీలిస్తే అందులో చాలా వైరుధ్యాలు కనిపిస్తాయి. ఆయన జైత్రయాత్రను అడుకునే బహుకోణాలు కనిపిస్తాయి. అవి ప్రజలు ఆదరించే ప్రత్యామ్నాయ రాజకీయానికి దారులను సూచిస్తాయి.

మొదటిది - మోదీ అనుసరిస్తున్న హిందూత్వ భావజాలం ముందు చూపుగలది కాదు. గతకాలపు వైభవాలను ఆవాహన చేస్తుంది. అనాదికాలపు రాచరికాలను ఆధునిక ప్రజాస్వామ్యం కంటే మిన్నగా భావిస్తుంది. ప్రజల సార్వభౌమాధికారానికి పట్టంకట్టే ఆధునిక రాజ్యాంగానికి భిన్నంగా నిచ్చెనమెట్ల కులాలను, వివక్షను సమర్ధించే 'మనుధర్మశాస్త్రాన్ని ఆహ్వానిస్తుంది. మనం గతాన్ని తెలుసుకోవాలి. కాని గతంలోకి ప్రయాణించకూడదు. ఎందుకంటే వర్తమాన సమస్యలకు పరిష్కారం ఎంత వెదికినా గతంలో దొరకదు. అది భవిష్యత్తులోనే సాధ్యం అవుతోంది. ఈ గతం మత్తు దాని వైభవం ఎల్లకాలం పనిచేయదు. జనజీవనం ఎన్ని ఆటుపోట్లు వున్నా ముందుకే సాగుతుంది. వెనక్కి నడవదు. హిందూత్వకి వున్న ఈ వెనక చూపు వదిలించుకునే దారి జీనజీవనమే నేర్పుతుంది. -

ఇంక రెండోది - భారత జాతీయవాదం స్థానంలో హిందూ జాతీయ వాదాన్ని, సాంస్కృతిక జాతీయవాదాన్ని, మెజారిటీ జాతీయవాదాన్ని హిందూత్వ తన రాజకీయ సిద్ధాంతం చేసుకుంది. ఇన్ని భాషలు, ప్రాంతాల ప్రత్యేకతలు వాటి ప్రత్యేక సంస్కృతులు, కులాలు, మతాలు, వర్గాలు వున్న దేశంలో ఒకే జాతి, ఒకే మతం, ఒకే భాష, ఒకే ఆహారం, ఒకే ఆహార్యం అన్న నినాదాలు హిందూత్వ సాంస్కృతిక జాతీయవాదాన్ని ప్రతిఘటిస్తాయే గాని, తమ అస్తిత్వాన్ని వదులుకోవు. స్వాతంత్ర్యానంతరం రాష్ట్రాల ఏర్పాటుకు ఈ ప్రత్యేకతలే ప్రాతిపదికగా వున్నాయి. ఒకే భాష మాట్లాడే తెలుగు ప్రజలకు రెండు రాష్ట్రాలు ఏర్పడడం యీ ప్రాంతీయ ప్రత్యేకతలనే స్పష్టం చేస్తున్నది............

మోదీ జైత్రయాత్రకు అడ్డుకట్ట పడుతుందా? మె26 తో మోదీ పాలనకు 8 ఏళ్లు నిందు తున్నాయి. మోదీ సాగిస్తున్న జైత్రయాత్ర మీద, పాలన సంపాదకీయం ఫలితాల మీద సమాలోచనకు ఇదొక సందర్భం. మోదీకి ఒక భక్త బృందం వుంది. వారు యీ జైత్రయాత్రకు ఎదురులేదంటారు. “హిందూరాష్ట్ర' కనుచూపు మేరలోకి వచ్చిందంటారు. మరోపక్క మోదీని విమర్శించే వారున్నారు. 2024లో మోదీ ఓటమి సాధ్యపడేలా లేదంటారు. మోదీకి ధీటైన నాయకుడు లేడని, ప్రతిపక్షాలు ప్రశ్నించడానికే తప్ప ప్రతిఘటించే ఉమ్మడి వ్యూహం వారికి లేదంటారు. ఎన్నికల బాండ్ల రూపంలో దానికి అపరిమిత ఆర్థికబలం వుందనీ, క్షేత్రస్థాయిలో పుకార్లు నడిపించే పదాతి దళాలు వున్నాయని అంటారు. ఇవన్నీ అందరూ ఏదోమేరకు అంగీకరించే విషయాలుగానే కనిపిస్తాయి. పోతే మోదీ రాజకీయాలను, పాలనా తీరును లోతుగా పరిశీలిస్తే అందులో చాలా వైరుధ్యాలు కనిపిస్తాయి. ఆయన జైత్రయాత్రను అడుకునే బహుకోణాలు కనిపిస్తాయి. అవి ప్రజలు ఆదరించే ప్రత్యామ్నాయ రాజకీయానికి దారులను సూచిస్తాయి. మొదటిది - మోదీ అనుసరిస్తున్న హిందూత్వ భావజాలం ముందు చూపుగలది కాదు. గతకాలపు వైభవాలను ఆవాహన చేస్తుంది. అనాదికాలపు రాచరికాలను ఆధునిక ప్రజాస్వామ్యం కంటే మిన్నగా భావిస్తుంది. ప్రజల సార్వభౌమాధికారానికి పట్టంకట్టే ఆధునిక రాజ్యాంగానికి భిన్నంగా నిచ్చెనమెట్ల కులాలను, వివక్షను సమర్ధించే 'మనుధర్మశాస్త్రాన్ని ఆహ్వానిస్తుంది. మనం గతాన్ని తెలుసుకోవాలి. కాని గతంలోకి ప్రయాణించకూడదు. ఎందుకంటే వర్తమాన సమస్యలకు పరిష్కారం ఎంత వెదికినా గతంలో దొరకదు. అది భవిష్యత్తులోనే సాధ్యం అవుతోంది. ఈ గతం మత్తు దాని వైభవం ఎల్లకాలం పనిచేయదు. జనజీవనం ఎన్ని ఆటుపోట్లు వున్నా ముందుకే సాగుతుంది. వెనక్కి నడవదు. హిందూత్వకి వున్న ఈ వెనక చూపు వదిలించుకునే దారి జీనజీవనమే నేర్పుతుంది. - ఇంక రెండోది - భారత జాతీయవాదం స్థానంలో హిందూ జాతీయ వాదాన్ని, సాంస్కృతిక జాతీయవాదాన్ని, మెజారిటీ జాతీయవాదాన్ని హిందూత్వ తన రాజకీయ సిద్ధాంతం చేసుకుంది. ఇన్ని భాషలు, ప్రాంతాల ప్రత్యేకతలు వాటి ప్రత్యేక సంస్కృతులు, కులాలు, మతాలు, వర్గాలు వున్న దేశంలో ఒకే జాతి, ఒకే మతం, ఒకే భాష, ఒకే ఆహారం, ఒకే ఆహార్యం అన్న నినాదాలు హిందూత్వ సాంస్కృతిక జాతీయవాదాన్ని ప్రతిఘటిస్తాయే గాని, తమ అస్తిత్వాన్ని వదులుకోవు. స్వాతంత్ర్యానంతరం రాష్ట్రాల ఏర్పాటుకు ఈ ప్రత్యేకతలే ప్రాతిపదికగా వున్నాయి. ఒకే భాష మాట్లాడే తెలుగు ప్రజలకు రెండు రాష్ట్రాలు ఏర్పడడం యీ ప్రాంతీయ ప్రత్యేకతలనే స్పష్టం చేస్తున్నది............

Features

  • : Modi Bharatham
  • : D V V S Varma
  • : vishalandra book house
  • : MANIMN3361
  • : Papar Back
  • : may, 2022
  • : 72
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Modi Bharatham

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Magazines
Powered by infibeam