Srikanta Varma

By Aravind Tripati (Author)
Rs.40
Rs.40

Srikanta Varma
INR
MANIMN4084
In Stock
40.0
Rs.40


In Stock
Ships in 4 - 9 Days
Check for shipping and cod pincode

Description

'నావల్ల కానిది '

"నిజానికి యిరవై నాలుగ్గంటలూ నాతో నేనే యుద్ధం చేస్తూ వుంటాను. ఇందులో ఎవరూ గాయపడరు. నా చేతిలో ఎవరూ చావరు. నేను మాత్రమే నెత్తురోడుతాను. ఒక్కోసారి రాజకీయం కవితపై దండెత్తుతుంది. మరోసారి కవిత, రాజకీయాలను ముట్టడిస్తుంది. ఈ రెండింటి ద్వంద్వ యుద్ధాన్నీ ఆపే ప్రయత్నంలో నేను గాయపడ్డాను. గాయాలు తగిలాయి. కానీ వికలాంగుణ్ణి కాలేదు.

నేనో మధ్యతరగతి కుటుంబంలోనే పుట్టాను. కానీ జమీందారీ సంస్కారాల మధ్య పెరగటం వల్ల ఆ విధమైన మానసికస్థితే నాలోనూ నెలకొన్నది. యిప్పటికీ, ఆ జమీందారీ కుటుంబ లక్షణాలైన భయాలూ, సందేహాలూ నాలో వున్నాయి. మా నాన్న వకీలుగా వుండేవారు. మా తాతయ్య వకీలే. ఆయనకు మంచి పొలమూ పుట్రా, ఆస్తిపాస్తులూ వుండేవి. నౌకర్లూ చాకర్లు వుండేవారు. ఒడుదుడుకులు ఏ మాత్రం లేకుండా, సుఖంగా వుండేది జీవితం. ఇప్పుడూ యిన్ని సంఘర్షణల మధ్య కూడా నాకా సదుపాయాలన్నీ వుంటే బాగుండునన్న ఆశ వుంది. అలాంటి కుటుంబాలలో పుట్టి పెరిగిన వాళ్ళ లక్షణాలలో

యిది ఒకటి మరి.

రెండవది - నేనా యింటిలో అందరికంటే పెద్దకుర్రాణ్ణి కావటం వల్ల గారాబం కూడా బాగానే చేశారు. ప్రత్యేకంగా చూసుకునేవారు కూడా! అందువల్ల నామనసులో ఒక భావం చోటు చేసుకుంది "నేనో గొప్పవ్యక్తిని కావాలి. ఇతరుల ప్రేమ నాకే ఎక్కువ అందాలి. అందరి దృష్టినీ ఆకర్షించేలా నేను తయారుకావాలి" అని. నేను అందరికంటే పెద్దవాణ్ణి కాకపోతే, బహుశా యిలా జరిగి వుండేది కాదేమో!"

శ్రీకాంతవర్మ వంటి కవి జీవన శైలిని తెలుసుకునే క్రమంలో పలువురి దృష్టిని ఆకర్షించిన 'నావల్ల కాని విషయాలకు నా జీవితంలో స్థానం లేదు" అన్న వారి కవితాపంక్తి ఎక్కువ సముచితంగా, పనికివచ్చేదిగా అనిపిస్తుంది...............

'నావల్ల కానిది ' "నిజానికి యిరవై నాలుగ్గంటలూ నాతో నేనే యుద్ధం చేస్తూ వుంటాను. ఇందులో ఎవరూ గాయపడరు. నా చేతిలో ఎవరూ చావరు. నేను మాత్రమే నెత్తురోడుతాను. ఒక్కోసారి రాజకీయం కవితపై దండెత్తుతుంది. మరోసారి కవిత, రాజకీయాలను ముట్టడిస్తుంది. ఈ రెండింటి ద్వంద్వ యుద్ధాన్నీ ఆపే ప్రయత్నంలో నేను గాయపడ్డాను. గాయాలు తగిలాయి. కానీ వికలాంగుణ్ణి కాలేదు. నేనో మధ్యతరగతి కుటుంబంలోనే పుట్టాను. కానీ జమీందారీ సంస్కారాల మధ్య పెరగటం వల్ల ఆ విధమైన మానసికస్థితే నాలోనూ నెలకొన్నది. యిప్పటికీ, ఆ జమీందారీ కుటుంబ లక్షణాలైన భయాలూ, సందేహాలూ నాలో వున్నాయి. మా నాన్న వకీలుగా వుండేవారు. మా తాతయ్య వకీలే. ఆయనకు మంచి పొలమూ పుట్రా, ఆస్తిపాస్తులూ వుండేవి. నౌకర్లూ చాకర్లు వుండేవారు. ఒడుదుడుకులు ఏ మాత్రం లేకుండా, సుఖంగా వుండేది జీవితం. ఇప్పుడూ యిన్ని సంఘర్షణల మధ్య కూడా నాకా సదుపాయాలన్నీ వుంటే బాగుండునన్న ఆశ వుంది. అలాంటి కుటుంబాలలో పుట్టి పెరిగిన వాళ్ళ లక్షణాలలో యిది ఒకటి మరి. రెండవది - నేనా యింటిలో అందరికంటే పెద్దకుర్రాణ్ణి కావటం వల్ల గారాబం కూడా బాగానే చేశారు. ప్రత్యేకంగా చూసుకునేవారు కూడా! అందువల్ల నామనసులో ఒక భావం చోటు చేసుకుంది "నేనో గొప్పవ్యక్తిని కావాలి. ఇతరుల ప్రేమ నాకే ఎక్కువ అందాలి. అందరి దృష్టినీ ఆకర్షించేలా నేను తయారుకావాలి" అని. నేను అందరికంటే పెద్దవాణ్ణి కాకపోతే, బహుశా యిలా జరిగి వుండేది కాదేమో!" శ్రీకాంతవర్మ వంటి కవి జీవన శైలిని తెలుసుకునే క్రమంలో పలువురి దృష్టిని ఆకర్షించిన 'నావల్ల కాని విషయాలకు నా జీవితంలో స్థానం లేదు" అన్న వారి కవితాపంక్తి ఎక్కువ సముచితంగా, పనికివచ్చేదిగా అనిపిస్తుంది...............

Features

  • : Srikanta Varma
  • : Aravind Tripati
  • : Sahitya Acadamy
  • : MANIMN4084
  • : paparback
  • : 2008 First Published
  • : 152
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Srikanta Varma

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam