కబుర్ల దేవత
ఒక ఊళ్లో కామయ్య అనే వాగుడుకాయ ఒకడుండేవాడు. వాడు వాగడం తప్పితే మరోపని చేసేవాడు కాదు. కాని ఇవన్నీ కామయ్య భార్య పట్టించుకోక తనే కూలో నాలో చేసి సంసారాన్ని ఈదుకొస్తూండేది. మూడు పూటలూ తిని ఇరుగుపొరుగు వాళ్ళతో బాతాఖానీ వేయటం కామయ్య పని.
కొన్నాళ్లకు కామయ్య కబుర్లతో ఇరుగుపొరుగు వాళ్లు విసిగిపోయి కామయ్య కనబడితే ఎక్కడ మాటలు పెట్టుకుంటాడోనని తప్పించుకు తిరగటం ప్రారంభించారు. కొందరు ఆకతాయిలు కామయ్యను ఎగతాళి చేయటం ప్రారంభించారు.
ఈ సంగతంతా కామయ్య భార్యకు తెలిసేసరికి ఆమెకు చాలా బాధ కలిగింది. తన భర్త పని చేసి సంపాదించకపోయినా ఆమె బాధపడేది కాదు. కాని అతను ఇలా నలుగురి చేత అవమానింప బడటం ఆమె భరించలేక పోయింది. కామయ్యకు నాలుగయిదుసార్లు చెప్పి చూసింది. కాని ఫలితం లేకపోయింది.
ఇహ చేసేదిలేక కామయ్యను ఒక గదిలో పెట్టి తాళంవేసింది. భోజనం వేళకు మాత్రం తలుపు తీసి భోజనం పెట్టేది, 'వాగే నోరు, తిరిగే కాలు ఊరికే వుండవు కదా!' అందుచేత రామయ్య అక్కడ గదిలో తనకెదురుగా ఉన్న గోడతో కబుర్లు చెప్పడం ప్రారంభించాడు.
ఇలా చాలా రోజులు గడిచాయి.
గోడ ఎదురు ప్రశ్నలు వేయకుండా శ్రద్ధగా వినటం మూలాన కామయ్య గోడకు తనకు తెలిసినన్ని కబుర్లు చెప్పి చెప్పి, విసిగిపోయాడు.
చివరికి రామయ్య ఒకరోజు గోడతో "నీకు ఇన్ని రోజులు ఎంతో కష్టపడి ఇన్ని కబుర్లు చెప్పాను కదా! నువ్వు మాటలాడక పోతే పోయావు, కనీసం నన్ను మెచ్చుకోనన్నా మెచ్చుకోవేం? అని ప్రశ్నించాడు.
గోడనుండి ఎటువంటి సమాధానం రాలేదు. కామయ్య పదే పదే అడిగాడు.
ఉన్నట్టుండి ఒక మెరుపులాంటిది మెరిసినట్టయి ఒక స్త్రీ ఆకారం అతనిముందు నిలబడింది. "ఎవరు నువ్వు? నీకేం కావాలి." అని అడిగాడు కామయ్య ఆశ్చర్యపోతూ............................
కబుర్ల దేవత ఒక ఊళ్లో కామయ్య అనే వాగుడుకాయ ఒకడుండేవాడు. వాడు వాగడం తప్పితే మరోపని చేసేవాడు కాదు. కాని ఇవన్నీ కామయ్య భార్య పట్టించుకోక తనే కూలో నాలో చేసి సంసారాన్ని ఈదుకొస్తూండేది. మూడు పూటలూ తిని ఇరుగుపొరుగు వాళ్ళతో బాతాఖానీ వేయటం కామయ్య పని. కొన్నాళ్లకు కామయ్య కబుర్లతో ఇరుగుపొరుగు వాళ్లు విసిగిపోయి కామయ్య కనబడితే ఎక్కడ మాటలు పెట్టుకుంటాడోనని తప్పించుకు తిరగటం ప్రారంభించారు. కొందరు ఆకతాయిలు కామయ్యను ఎగతాళి చేయటం ప్రారంభించారు. ఈ సంగతంతా కామయ్య భార్యకు తెలిసేసరికి ఆమెకు చాలా బాధ కలిగింది. తన భర్త పని చేసి సంపాదించకపోయినా ఆమె బాధపడేది కాదు. కాని అతను ఇలా నలుగురి చేత అవమానింప బడటం ఆమె భరించలేక పోయింది. కామయ్యకు నాలుగయిదుసార్లు చెప్పి చూసింది. కాని ఫలితం లేకపోయింది. ఇహ చేసేదిలేక కామయ్యను ఒక గదిలో పెట్టి తాళంవేసింది. భోజనం వేళకు మాత్రం తలుపు తీసి భోజనం పెట్టేది, 'వాగే నోరు, తిరిగే కాలు ఊరికే వుండవు కదా!' అందుచేత రామయ్య అక్కడ గదిలో తనకెదురుగా ఉన్న గోడతో కబుర్లు చెప్పడం ప్రారంభించాడు. ఇలా చాలా రోజులు గడిచాయి. గోడ ఎదురు ప్రశ్నలు వేయకుండా శ్రద్ధగా వినటం మూలాన కామయ్య గోడకు తనకు తెలిసినన్ని కబుర్లు చెప్పి చెప్పి, విసిగిపోయాడు. చివరికి రామయ్య ఒకరోజు గోడతో "నీకు ఇన్ని రోజులు ఎంతో కష్టపడి ఇన్ని కబుర్లు చెప్పాను కదా! నువ్వు మాటలాడక పోతే పోయావు, కనీసం నన్ను మెచ్చుకోనన్నా మెచ్చుకోవేం? అని ప్రశ్నించాడు. గోడనుండి ఎటువంటి సమాధానం రాలేదు. కామయ్య పదే పదే అడిగాడు. ఉన్నట్టుండి ఒక మెరుపులాంటిది మెరిసినట్టయి ఒక స్త్రీ ఆకారం అతనిముందు నిలబడింది. "ఎవరు నువ్వు? నీకేం కావాలి." అని అడిగాడు కామయ్య ఆశ్చర్యపోతూ............................© 2017,www.logili.com All Rights Reserved.