రిహ్లా
ابن بطوطة
ముస్లిం దేశాల మార్కోపోలోగా కీర్తించబడిన మహా యాత్రికుడు ఇబన్ బతూత (క్రీ॥శ॥ 1304-1369). ఇరవై ఐదు సంవత్సరాలపాటు ఆఫ్రికా, ఆసియా, ఐరోపా ఖండాల్లోని నలభై దేశాల్లో విస్తృతంగా ప్రయాణాలు చేసిన సాహసవంతుడు, రాజీపడని యాత్రికుడు. ఈయన ఉత్తర ఆఫ్రికాలో ఉన్న మొరాకో దేశంలోని టాంజీర్ నివాసి. సున్నీ ముస్లిం మతశాఖకు చెందిన ఈ యాత్రికుడు మాలికీ న్యాయశాస్త్రంలో పట్టా పుచ్చుకొని, తన అరబిక్ భాషా పాండిత్యంతో ప్రపంచ యాత్ర చేశాడు. ఏకబిగిన రెండున్నర దశాబ్దాలపాటు ప్రయాణించినవారు ఆనాటికి ఎవరూ లేరు.
'విజ్ఞాన సముపార్జన కోసం చైనా వరకూ ప్రయాణించినా మంచిదే' అనే మహమ్మద్ ప్రవక్త సూక్తిని కార్యాచరణలో నిరూపించిన భక్తుడు ఇబన్ బతూతా. శరీరంలో శక్తి, ఆర్థిక స్థోమత ఉన్న ప్రతి ముస్లిం కూడా తన జీవిత కాలంలో కనీసం ఒక్కసారి హజ్ (మక్కా) యాత్రకు వెళ్ళాలి అనే నియమం ఉంది. సుదూర తీరాల్లో ఉన్న చైనాకి వెళదామని తన మనసులో ఉంది కాబట్టి, చిన్న వయసులోనే తన గమ్యం చేరటానికి ఆలోచించాడు. దీనికి మొదటి మెట్టు మక్కా ప్రయాణం. తన యాత్రని విజయవంతంగా ముగించుకొని అపారమైన....................
రిహ్లా ابن بطوطة ముస్లిం దేశాల మార్కోపోలోగా కీర్తించబడిన మహా యాత్రికుడు ఇబన్ బతూత (క్రీ॥శ॥ 1304-1369). ఇరవై ఐదు సంవత్సరాలపాటు ఆఫ్రికా, ఆసియా, ఐరోపా ఖండాల్లోని నలభై దేశాల్లో విస్తృతంగా ప్రయాణాలు చేసిన సాహసవంతుడు, రాజీపడని యాత్రికుడు. ఈయన ఉత్తర ఆఫ్రికాలో ఉన్న మొరాకో దేశంలోని టాంజీర్ నివాసి. సున్నీ ముస్లిం మతశాఖకు చెందిన ఈ యాత్రికుడు మాలికీ న్యాయశాస్త్రంలో పట్టా పుచ్చుకొని, తన అరబిక్ భాషా పాండిత్యంతో ప్రపంచ యాత్ర చేశాడు. ఏకబిగిన రెండున్నర దశాబ్దాలపాటు ప్రయాణించినవారు ఆనాటికి ఎవరూ లేరు. 'విజ్ఞాన సముపార్జన కోసం చైనా వరకూ ప్రయాణించినా మంచిదే' అనే మహమ్మద్ ప్రవక్త సూక్తిని కార్యాచరణలో నిరూపించిన భక్తుడు ఇబన్ బతూతా. శరీరంలో శక్తి, ఆర్థిక స్థోమత ఉన్న ప్రతి ముస్లిం కూడా తన జీవిత కాలంలో కనీసం ఒక్కసారి హజ్ (మక్కా) యాత్రకు వెళ్ళాలి అనే నియమం ఉంది. సుదూర తీరాల్లో ఉన్న చైనాకి వెళదామని తన మనసులో ఉంది కాబట్టి, చిన్న వయసులోనే తన గమ్యం చేరటానికి ఆలోచించాడు. దీనికి మొదటి మెట్టు మక్కా ప్రయాణం. తన యాత్రని విజయవంతంగా ముగించుకొని అపారమైన....................© 2017,www.logili.com All Rights Reserved.