Iam That

By Nisargadatta Maharaj (Author)
Rs.250
Rs.250

Iam That
INR
MANIMN4144
Out Of Stock
250.0
Rs.250
Out of Stock
Out Of Stock
Check for shipping and cod pincode

Description

ముందు మాట - 2

శ్రీ నిసర్గ మహరాజ్ జీ అనేక సాధక్ హ్యాంచా సుఖసంవాద్ (అయామ్ దట్ కి మరాఠీ మూలం) పుస్తకానికి మారిస్ ఫ్రీడ్మన్ పీరిక

ఆధ్యాత్మిక గురువైన శ్రీ నిసర్గదత్త మహరాజ్, ముంబాయిలో నివసిస్తున్నారు. నా అదృష్టం కొద్దీ ఆయనను మూడేళ్ళక్రితం కలుసుకోవడం జరిగింది. ఆయన చెప్పే 'సత్ స్వరూప' మార్గానికీ, భగవాన్ రమణమహర్షి బోధలకీ ఉన్న సామ్యం వెంటనే నా మనసుకు స్ఫురించింది.

జ్ఞానులతో 'సత్సంగం' వల్ల చాలా బలమైన అనుగ్రహం, కటాక్షం కలుగుతాయని నేను దృఢంగా విశ్వసిస్తాను. శ్రీ నిసర్గదత్త మహరాజ్ దగ్గరకు తరచూ వెళ్ళడం ఆరంభించాను. ఆయన చెప్పేది సనాతన అద్వైత వేదాంతమే అని నాకు తొందరగానే స్పష్టమైంది. తనదే అయిన ఒక విశిష్టమైన శైలిలో అద్వైతాన్ని మహరాజ్ వివరిస్తున్నారని గ్రహించాను.

ఆధ్యాత్మిక జ్ఞానం, సాక్షాత్కారం, ఆత్మానుభవం కోసం ఇండియా కి వచ్చే విదేశీయులు చాలామంది నాకు తారసపడేవారు. అతి ప్రాచీనమైన భారతదేశపు ఆధ్యాత్మిక బోధకి ప్రత్యక్ష ఉదాహరణని చూపించడానికి మహరాజ్ దగ్గరకి వాళ్ళని తీసుకువెళ్ళేవాడిని. వాళ్ళు మహరాజ్ ను రకరకాలుగా ప్రశ్నించేవారు. ఎక్కువగా ఇంగ్లీషులోనూ, కొన్నిసార్లు ఫ్రెంచి, జర్మన్ భాషల్లోనూ అడిగేవారు. వాటిని అనువాదం చేసే బాధ్యత నామీదో, ఆ భాషలు తెలిసిన వారెవరైనా అక్కడ ఉంటే వాళ్ళమీదో పడేది.

తమని కలత పెడుతున్న ఆధ్యాత్మిక సమస్యల గురించి వాళ్ళడిగే ప్రశ్నలూ - వాటికి మహరాజ్ ఇచ్చే సమాధానాలూ - అమితాసక్తికరంగా ఉండేవి. అత్యున్నత జ్ఞానపూరితమైన ఈ చర్చలను భద్రపరచాల్సిన అవసరాన్ని తొందరగానే గుర్తించాను. ఒక ఆడియో టేప్ రికార్డర్ లో ఈ సంభాషణలన్నింటినీ రికార్డు చేయడం జరిగింది. వీటన్నింటినీ ముందు ఇంగ్లీషులోకి అనువదించి, ఆ తర్వాత ఇంగ్లీషునించి మరాఠీ కి మళ్ళీ అనువాదం చేయడం జరిగింది.

ఇప్పుడు మరాఠీ లో ప్రచురించబడుతున్న ఈ సంభాషణలు అక్షరతా మహరాజ్ మరాఠీ లో సంభాషించినవి కాకపోయినా ఆయనే స్వయంగా మరాఠీ పాఠాన్ని సరిచూసారు. ఇవి ఇంగ్లీషునించి మరాఠీ లోకి అనువదింపబడినవే అయినా, శ్రీ నిసర్గదత్త మహరాజ్ బోధనల సారాంశాన్ని, మూలతత్త్వాన్ని ఇవి సరిగా ప్రతిబింబిస్తున్నాయని పరిగణించవచ్చు. మహరాజే స్వయంగా ఈ ప్రతిని సరిచూసి నిర్ధారించారు కాబట్టి, ఈ మరాఠీ పుస్తకాన్ని మూలప్రతిగా అంగీకరించవచ్చును. వివిధ అధ్యాయాలలో ఉన్న సంభాషణలన్నీ దేనికవి విడివిడిగా జరిగినవే.

ఈ సంభాషణలలో ప్రధానంగా కనిపించే లక్షణం మహరాజ్ కున్న సహజస్ఫురణ, అంతఃస్ఫూర్తి, ప్రశ్నలు అన్నీ ఒక రకంగా ఉండవు. అడిగే వారిలో ఉన్న ఆధ్యాత్మిక గాఢత, తీవ్రత, లోతులను బట్టి ప్రశ్నలలో తేడాలుంటాయి. మహరాజ్ జవాబులలో అందరికీ ఉపయోగపడే సార్వజనీనత ఉంది. చాలామంది పాఠకుల పారమార్థిక సందేహాలకు వీటిలో సమాధానం దొరకవచ్చు................

ముందు మాట - 2 శ్రీ నిసర్గ మహరాజ్ జీ అనేక సాధక్ హ్యాంచా సుఖసంవాద్ (అయామ్ దట్ కి మరాఠీ మూలం) పుస్తకానికి మారిస్ ఫ్రీడ్మన్ పీరిక ఆధ్యాత్మిక గురువైన శ్రీ నిసర్గదత్త మహరాజ్, ముంబాయిలో నివసిస్తున్నారు. నా అదృష్టం కొద్దీ ఆయనను మూడేళ్ళక్రితం కలుసుకోవడం జరిగింది. ఆయన చెప్పే 'సత్ స్వరూప' మార్గానికీ, భగవాన్ రమణమహర్షి బోధలకీ ఉన్న సామ్యం వెంటనే నా మనసుకు స్ఫురించింది. జ్ఞానులతో 'సత్సంగం' వల్ల చాలా బలమైన అనుగ్రహం, కటాక్షం కలుగుతాయని నేను దృఢంగా విశ్వసిస్తాను. శ్రీ నిసర్గదత్త మహరాజ్ దగ్గరకు తరచూ వెళ్ళడం ఆరంభించాను. ఆయన చెప్పేది సనాతన అద్వైత వేదాంతమే అని నాకు తొందరగానే స్పష్టమైంది. తనదే అయిన ఒక విశిష్టమైన శైలిలో అద్వైతాన్ని మహరాజ్ వివరిస్తున్నారని గ్రహించాను. ఆధ్యాత్మిక జ్ఞానం, సాక్షాత్కారం, ఆత్మానుభవం కోసం ఇండియా కి వచ్చే విదేశీయులు చాలామంది నాకు తారసపడేవారు. అతి ప్రాచీనమైన భారతదేశపు ఆధ్యాత్మిక బోధకి ప్రత్యక్ష ఉదాహరణని చూపించడానికి మహరాజ్ దగ్గరకి వాళ్ళని తీసుకువెళ్ళేవాడిని. వాళ్ళు మహరాజ్ ను రకరకాలుగా ప్రశ్నించేవారు. ఎక్కువగా ఇంగ్లీషులోనూ, కొన్నిసార్లు ఫ్రెంచి, జర్మన్ భాషల్లోనూ అడిగేవారు. వాటిని అనువాదం చేసే బాధ్యత నామీదో, ఆ భాషలు తెలిసిన వారెవరైనా అక్కడ ఉంటే వాళ్ళమీదో పడేది. తమని కలత పెడుతున్న ఆధ్యాత్మిక సమస్యల గురించి వాళ్ళడిగే ప్రశ్నలూ - వాటికి మహరాజ్ ఇచ్చే సమాధానాలూ - అమితాసక్తికరంగా ఉండేవి. అత్యున్నత జ్ఞానపూరితమైన ఈ చర్చలను భద్రపరచాల్సిన అవసరాన్ని తొందరగానే గుర్తించాను. ఒక ఆడియో టేప్ రికార్డర్ లో ఈ సంభాషణలన్నింటినీ రికార్డు చేయడం జరిగింది. వీటన్నింటినీ ముందు ఇంగ్లీషులోకి అనువదించి, ఆ తర్వాత ఇంగ్లీషునించి మరాఠీ కి మళ్ళీ అనువాదం చేయడం జరిగింది. ఇప్పుడు మరాఠీ లో ప్రచురించబడుతున్న ఈ సంభాషణలు అక్షరతా మహరాజ్ మరాఠీ లో సంభాషించినవి కాకపోయినా ఆయనే స్వయంగా మరాఠీ పాఠాన్ని సరిచూసారు. ఇవి ఇంగ్లీషునించి మరాఠీ లోకి అనువదింపబడినవే అయినా, శ్రీ నిసర్గదత్త మహరాజ్ బోధనల సారాంశాన్ని, మూలతత్త్వాన్ని ఇవి సరిగా ప్రతిబింబిస్తున్నాయని పరిగణించవచ్చు. మహరాజే స్వయంగా ఈ ప్రతిని సరిచూసి నిర్ధారించారు కాబట్టి, ఈ మరాఠీ పుస్తకాన్ని మూలప్రతిగా అంగీకరించవచ్చును. వివిధ అధ్యాయాలలో ఉన్న సంభాషణలన్నీ దేనికవి విడివిడిగా జరిగినవే. ఈ సంభాషణలలో ప్రధానంగా కనిపించే లక్షణం మహరాజ్ కున్న సహజస్ఫురణ, అంతఃస్ఫూర్తి, ప్రశ్నలు అన్నీ ఒక రకంగా ఉండవు. అడిగే వారిలో ఉన్న ఆధ్యాత్మిక గాఢత, తీవ్రత, లోతులను బట్టి ప్రశ్నలలో తేడాలుంటాయి. మహరాజ్ జవాబులలో అందరికీ ఉపయోగపడే సార్వజనీనత ఉంది. చాలామంది పాఠకుల పారమార్థిక సందేహాలకు వీటిలో సమాధానం దొరకవచ్చు................

Features

  • : Iam That
  • : Nisargadatta Maharaj
  • : Rajachandra Foundation
  • : MANIMN4144
  • : paparback
  • : Jan, 2023
  • : 445
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Iam That

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam