అభినందన
ధర్మదండంబునందు పద్యంబులెల్లఁ 
బంచకల్యాణి గుర్రాలు పగిదిఁదనరె 
నాశు వేగోక్తి కాశ్చర్యమందినాను 
విష్ణునందన! శుభమస్తు! వృద్ధిరస్తు!
భావమునందు నార్హతయుఁ బల్కులయందున నార్జవమ్ము గా 
ధా విధమందుఁ గ్లుప్తతయుఁ దర్క సహిష్ణుత వాక్యవైఖరీ 
ధీవిభవంబులందుఁ బ్రణుతిక్షమ సత్కవితాగుణంబు స 
ర్వావయవంబులందు - నిటులైదువ నీ కృతి విష్ణునందనా!
చదివిన వచ్చునే కవనచారిమ ? యయ్యది పూర్వపుణ్యసం 
పదఁబడి రావలెన్ లలిత భారతి సత్కృపమైన రావలెన్ 
పదనుగ నేలఁజీల్చుకొని వచ్చెడి సారణివోలె రావలెన్ 
ముదముగ విష్ణునందన ! యమోఘము నీ కవనంబు నీ గతిన్
నీకున్ నీ కవితా కలాపమునకున్ నీ శక్తికిన్ నీ పరీ 
పాకోన్ముద్రిత భావనా సరళికిన్ వైద్యంపు సద్వృత్తికిన్ 
నీ కామ్యంబుల కిష్టగమ్యములకున్ దీర్ఘాయురారోగ్య సు 
శ్రీ కల్యాణ యశఃప్రకాస్తి వినుతుల్ సేకూరుతన్ మీరుతన్........................
© 2017,www.logili.com All Rights Reserved.