భక్త్యంజలి
శ్రీకర మంగళప్రద
నిత్యదూత కోటి ఆరాధనాద్యుడా
విశ్వనిర్మాణ కారుణ్య వాగ్రూప
నిర్మాణ దక్షతా చతురుడా
భూనభోంతరాళాల లయధ్వనుల
సమరూప నిర్మాణ పవిత్ర మూర్తి
కోటి దీపపు వెలుగుల మహిమాన్విత చక్రవర్తి
అంజలి ఘటింతు తొలుదొల్త తనివితీర
కొనియాడి అర్చించెద ముదమార పూజించెదన్....
అక్షరమై కొలిచెద నిన్ను మనసార
స్వరాంజలితో ప్రస్తుతింతు గాత్రరాగమై
పూజించెద భక్తిమీర కనుల వేడుకతోడ
కీర్తించెద మనసంతా సర్వవేళలా సంతుష్టుండనై...
హే ప్రభూ!
ఆది సంభూతుడా, పూజార్హుడా
విశ్వవీణా జగత్ పునాది ప్రతిష్టాపిత
మంటికి మహిమతో జీవాత్మ నొసగిన
కుటుంబ నిర్మాణ పుణ్యధామ.....................
© 2017,www.logili.com All Rights Reserved.