Chitrakavita Sourabham

Rs.500
Rs.500

Chitrakavita Sourabham
INR
MANIMN4466
In Stock
500.0
Rs.500


In Stock
Ships in 4 - 9 Days
Check for shipping and cod pincode

Description

ఎదురుకట్టు మాట

సాహిత్యం భాషా పరిచయం కలిగిస్తుంది. ఆ సాహిత్యాన్ని ఎంతగా అభ్యసిస్తే అంతగా భాషలో పరిచయం పెరుగుతుంది. పద్యకావ్యాలు, గద్యకావ్యాలు, చంపూకావ్యాలు, నాటకాలు మొదలైనవన్నీ సాహిత్య అభ్యాసానికి సాధనాలు. వాటిని చదవగా చదవగా ధారణ ఏర్పడి కవిత్వం వ్రాయగల నేర్పు శక్తి లభిస్తుంది. కవిత్వం అంతసులువైన పనికాదని అందరికీ తెలుసు మొదట పద్యాలు/శ్లోకాలు వ్రాయడం తరువాత అనేక ప్రక్రియల్లో గ ద్యాలతో, గద్యపద్యాలతో అంటే చంపూ కావ్యాలుగా, దృశ్యకావ్యాలుగా నాటకం, యక్షగానం తదితరాలుగా కవిత్వం వ్రాస్తూ ఇంకాకొంచెం ప్రత్యేకతలు మేళవించడానికి ప్రయత్నం చేస్తూ శబ్దాలంకారాలలో అనేక పద్ధతులను కనుగొ న్నారు ప్రత్యేకించి అనుప్రాస యమకాలంకారాలతో దానివల్ల అనేక క్రొత్త పద్ధతులతో కవిత్వం వ్రాయడం మొదలైం ది. ఒకరేమో శబ్దాలతో రకరకాలుగా కవిత్వం అల్లడంఒకే అచ్చుతో, రెండచ్చులతో, మూడచ్చులతో శ్లోకం వ్రాయడం, మరొకరు హల్లులతో ఒక హల్లుతో, రెండు హల్లులతో, మూడు హల్లులతో శ్లోకాలు వ్రాయడం, మరికొందరు పెదిమ లు తగలకుండా నాలుక కదలకుండా, ముక్కుతో పలుకకుండా చదవగల పద్యాలను శ్లోకాలను కూర్చడం మొదలైం ది. కొందరు అన్ని హల్లులతో లేదా అచ్చులతో ఒక్కటికూడా వదలకుండా వరుసగా వచ్చేవిధంగా శ్లోకం చెప్పడం, మరికొందరు ప్రతిపాదం మొదటవరుసగా అచ్చులు హల్లులు వచ్చేవిధంగా శ్లోకాలు చెప్పడం మరికొందరు శ్లోకంలోని అన్ని పాదాలు ఒకేలా ఉండే శ్లోకాలను కూర్చడం ఇలా తమ శబ్దశక్తిని ప్రజలకు పండితులకు చూపడం మొదలైంది. ఇదిలా ఉంటే గూఢంగా అంటే కర్తను/కర్మను/క్రియను ఇలాంటివి దాచిపెట్టి చెప్పడం ఇంకా అనే విధాలైన వాటిని గోపనం చేసి కవిత్వం చెప్పడం జరిగింది. అలాగే శ్లోకాన్ని ఎటునుండి చదివినా ఒకలాగే ఉండేవిధంగా శ్లోకాలు కూ ర్చడం, శ్లోకం మొదటి నుండి చదివితే ఒక అర్థం, చివరినుండి చదివితే మరో అర్థం వచ్చే విధంగా వ్రాయడం జరి గింది. ఛందస్సుతో వివిధ క్రీడలను చేయడం ఒక పద్యంలో మరోపద్యం, రెండు పద్యాలు, మూడు పద్యాలు ఇమి డ్చి వ్రాయడం. ఇలా ఒక మహనీయుడు ఒక సీసపద్యంలో 64 రకాల ఛందస్సులను ఇమిడ్చగా, మరోకవి ఒక కం దపద్యంలో 256 కందపద్యాలను ఇమిడ్చాడు. మరోకవి ఒక శ్లోకం రెండు అర్థాలు వచ్చేలా వ్రాస్తే మరోకవి మూడు ఇంకోకవి నాలుగు, మరోకవి 30, ఇంకోకవి వంద అర్థాలు వచ్చేలా శ్లోకాలను / పద్యాలను కూర్చారు. మరోకవి ఆకృ తులలో అంటే పద్మం, నాగం, ఖడ్గం, శంఖం, చక్రం, గద, త్రిశూలం, పర్వతం, ధేనువు, మృగం, సరస్సు, పుష్ప, మాలలా ఇలా అనేక ఆకృతులలో పద్యాలను/శ్లోకాలను బంధించారు ఇలాగా అనేక చిత్రవిచిత్రాలతో కూడిన ఈ రచ నను మనం చిత్రకవిత్వం అని పేరు పెట్టుకున్నాం. ఇది ఋగ్వేదకాలం నుండి వివిధ రూపాలలో వస్తూంది. నేడు మనం ఆసక్తిగా పూరించే పదకేళిగా మారింది, అంత్యాక్షరిగా నిలిచింది, పొడుపుకథలుగా పాడుస్తోంది ఇంకా అనేక విధాలైన రూపాలలో కొనసాగుతుంది. దీన్ని అర్థం చేసుకోలేనివారు దీనిపై లేనిపోని విషయాలను చెప్పి దీని పై వి. ముఖతను కలిగిస్తున్నారు ఇది అధమకావ్యం అని చెప్పిన వారు సైతం ఈ చిత్రకవిత్వాన్ని వ్రాయడం చరిత్రలో జరి గింది. ప్రపంచంలో ఏదీ తక్కువకాదు దేని ప్రయోజనం దానికి ఉండనే ఉంటుంది..............

ఎదురుకట్టు మాట సాహిత్యం భాషా పరిచయం కలిగిస్తుంది. ఆ సాహిత్యాన్ని ఎంతగా అభ్యసిస్తే అంతగా భాషలో పరిచయం పెరుగుతుంది. పద్యకావ్యాలు, గద్యకావ్యాలు, చంపూకావ్యాలు, నాటకాలు మొదలైనవన్నీ సాహిత్య అభ్యాసానికి సాధనాలు. వాటిని చదవగా చదవగా ధారణ ఏర్పడి కవిత్వం వ్రాయగల నేర్పు శక్తి లభిస్తుంది. కవిత్వం అంతసులువైన పనికాదని అందరికీ తెలుసు మొదట పద్యాలు/శ్లోకాలు వ్రాయడం తరువాత అనేక ప్రక్రియల్లో గ ద్యాలతో, గద్యపద్యాలతో అంటే చంపూ కావ్యాలుగా, దృశ్యకావ్యాలుగా నాటకం, యక్షగానం తదితరాలుగా కవిత్వం వ్రాస్తూ ఇంకాకొంచెం ప్రత్యేకతలు మేళవించడానికి ప్రయత్నం చేస్తూ శబ్దాలంకారాలలో అనేక పద్ధతులను కనుగొ న్నారు ప్రత్యేకించి అనుప్రాస యమకాలంకారాలతో దానివల్ల అనేక క్రొత్త పద్ధతులతో కవిత్వం వ్రాయడం మొదలైం ది. ఒకరేమో శబ్దాలతో రకరకాలుగా కవిత్వం అల్లడంఒకే అచ్చుతో, రెండచ్చులతో, మూడచ్చులతో శ్లోకం వ్రాయడం, మరొకరు హల్లులతో ఒక హల్లుతో, రెండు హల్లులతో, మూడు హల్లులతో శ్లోకాలు వ్రాయడం, మరికొందరు పెదిమ లు తగలకుండా నాలుక కదలకుండా, ముక్కుతో పలుకకుండా చదవగల పద్యాలను శ్లోకాలను కూర్చడం మొదలైం ది. కొందరు అన్ని హల్లులతో లేదా అచ్చులతో ఒక్కటికూడా వదలకుండా వరుసగా వచ్చేవిధంగా శ్లోకం చెప్పడం, మరికొందరు ప్రతిపాదం మొదటవరుసగా అచ్చులు హల్లులు వచ్చేవిధంగా శ్లోకాలు చెప్పడం మరికొందరు శ్లోకంలోని అన్ని పాదాలు ఒకేలా ఉండే శ్లోకాలను కూర్చడం ఇలా తమ శబ్దశక్తిని ప్రజలకు పండితులకు చూపడం మొదలైంది. ఇదిలా ఉంటే గూఢంగా అంటే కర్తను/కర్మను/క్రియను ఇలాంటివి దాచిపెట్టి చెప్పడం ఇంకా అనే విధాలైన వాటిని గోపనం చేసి కవిత్వం చెప్పడం జరిగింది. అలాగే శ్లోకాన్ని ఎటునుండి చదివినా ఒకలాగే ఉండేవిధంగా శ్లోకాలు కూ ర్చడం, శ్లోకం మొదటి నుండి చదివితే ఒక అర్థం, చివరినుండి చదివితే మరో అర్థం వచ్చే విధంగా వ్రాయడం జరి గింది. ఛందస్సుతో వివిధ క్రీడలను చేయడం ఒక పద్యంలో మరోపద్యం, రెండు పద్యాలు, మూడు పద్యాలు ఇమి డ్చి వ్రాయడం. ఇలా ఒక మహనీయుడు ఒక సీసపద్యంలో 64 రకాల ఛందస్సులను ఇమిడ్చగా, మరోకవి ఒక కం దపద్యంలో 256 కందపద్యాలను ఇమిడ్చాడు. మరోకవి ఒక శ్లోకం రెండు అర్థాలు వచ్చేలా వ్రాస్తే మరోకవి మూడు ఇంకోకవి నాలుగు, మరోకవి 30, ఇంకోకవి వంద అర్థాలు వచ్చేలా శ్లోకాలను / పద్యాలను కూర్చారు. మరోకవి ఆకృ తులలో అంటే పద్మం, నాగం, ఖడ్గం, శంఖం, చక్రం, గద, త్రిశూలం, పర్వతం, ధేనువు, మృగం, సరస్సు, పుష్ప, మాలలా ఇలా అనేక ఆకృతులలో పద్యాలను/శ్లోకాలను బంధించారు ఇలాగా అనేక చిత్రవిచిత్రాలతో కూడిన ఈ రచ నను మనం చిత్రకవిత్వం అని పేరు పెట్టుకున్నాం. ఇది ఋగ్వేదకాలం నుండి వివిధ రూపాలలో వస్తూంది. నేడు మనం ఆసక్తిగా పూరించే పదకేళిగా మారింది, అంత్యాక్షరిగా నిలిచింది, పొడుపుకథలుగా పాడుస్తోంది ఇంకా అనేక విధాలైన రూపాలలో కొనసాగుతుంది. దీన్ని అర్థం చేసుకోలేనివారు దీనిపై లేనిపోని విషయాలను చెప్పి దీని పై వి. ముఖతను కలిగిస్తున్నారు ఇది అధమకావ్యం అని చెప్పిన వారు సైతం ఈ చిత్రకవిత్వాన్ని వ్రాయడం చరిత్రలో జరి గింది. ప్రపంచంలో ఏదీ తక్కువకాదు దేని ప్రయోజనం దానికి ఉండనే ఉంటుంది..............

Features

  • : Chitrakavita Sourabham
  • : Alankaram Venkata Ramana Raju
  • : Chitra Sahity Prachuranalu
  • : MANIMN4466
  • : Paperback
  • : May, 2023
  • : 394
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Chitrakavita Sourabham

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam