కథా ప్రారంభం
ధర్మరాజు పేరు వినని బాలురుండరు. పంచపాండవులలో ఆయన పెద్దవాడు. పేరుకు తగ్గ ధర్మాత్ముడు. ఆయన కలియుగము ప్రారంభం కాగానే ఈ లోకాన్ని వదలి వెళ్ళిపోవాలని నిశ్చయించుకున్నాడు. హింస, అసత్యం మొదలైన అధర్మాలు కలితో కూడ లోకంలో ప్రవేశించినవి. ఇక ఈ లోకంలో ఉండరాదనుకొన్నాడు ధర్మరాజు. తన విశాలమైన రాజ్యాన్ని తన మనుమడైన పరీక్షిత్తుకు అప్పగించినాడు. వైరాగ్యంతో ధర్మరాజు తన నలుగురు తమ్ములను, భార్యను వెంట తీసుకుని హస్తినాపురం వదిలేసి వెళ్ళిపోయినాడు.
పరీక్షిత్తు అభిమన్యుని కుమారుడు. పాండవులకు వారసుడు అతడొక్కడే. పరీక్షిత్తు ఉత్తరుని పుత్రికయయిన ఇరావతిని పెండ్లియాడినాడు. అతనికి జనమేజయుడు మొదలైన నలుగురు కొడుకులు కలిగినారు. ఆయన మూడు అశ్వమేధయాగాలు చేసినాడు. తన తాతలైన పాండవుల వలె వీరుడు, ధర్మమూర్తి. అధర్మాలను అణగద్రొక్కి, కలిని కాలరాచి ప్రజలకు సర్వసౌఖ్యాలు కలిగే రీతిని రాజ్యం చేసినాడు......................
కథా ప్రారంభం ధర్మరాజు పేరు వినని బాలురుండరు. పంచపాండవులలో ఆయన పెద్దవాడు. పేరుకు తగ్గ ధర్మాత్ముడు. ఆయన కలియుగము ప్రారంభం కాగానే ఈ లోకాన్ని వదలి వెళ్ళిపోవాలని నిశ్చయించుకున్నాడు. హింస, అసత్యం మొదలైన అధర్మాలు కలితో కూడ లోకంలో ప్రవేశించినవి. ఇక ఈ లోకంలో ఉండరాదనుకొన్నాడు ధర్మరాజు. తన విశాలమైన రాజ్యాన్ని తన మనుమడైన పరీక్షిత్తుకు అప్పగించినాడు. వైరాగ్యంతో ధర్మరాజు తన నలుగురు తమ్ములను, భార్యను వెంట తీసుకుని హస్తినాపురం వదిలేసి వెళ్ళిపోయినాడు. పరీక్షిత్తు అభిమన్యుని కుమారుడు. పాండవులకు వారసుడు అతడొక్కడే. పరీక్షిత్తు ఉత్తరుని పుత్రికయయిన ఇరావతిని పెండ్లియాడినాడు. అతనికి జనమేజయుడు మొదలైన నలుగురు కొడుకులు కలిగినారు. ఆయన మూడు అశ్వమేధయాగాలు చేసినాడు. తన తాతలైన పాండవుల వలె వీరుడు, ధర్మమూర్తి. అధర్మాలను అణగద్రొక్కి, కలిని కాలరాచి ప్రజలకు సర్వసౌఖ్యాలు కలిగే రీతిని రాజ్యం చేసినాడు......................© 2017,www.logili.com All Rights Reserved.