Balam Taruvatane Manchitanam

By A R K Sarma (Author)
Rs.100
Rs.100

Balam Taruvatane Manchitanam
INR
PRISMBK120
In Stock
100.0
Rs.100


In Stock
Ships in 4 - 9 Days
Check for shipping and cod pincode

Description

         మనకు బలమూ, మంచితనమూ రెండూ కావాలి. అయితే వీటిని ఏ క్రమంలో మనం పెంపొంది౦చుకుంటున్నామనేది చాలా ముఖ్యం. సిద్ధాంతాలను వల్లిస్తూ కేవలం ఆదర్శవాదులుగా ఉండి కార్యాచరణ విషయంలో నీరుగారిపొతే మనకు ఎంత మంచితనం ఉన్నా అది స్వీయ ప్రగతికి, సమాజ ప్రగతికి ఏమాత్రం ఉపయోగపడదు. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని స్వామి వివేకానంద యువతరాన్ని బలిష్టులై, కార్యతత్పరులుగా ఉండమని ఆదేశించారు. 

         'బలం' పరిధి చాలా సువిశాలమైంది. శారీరకబలం, మనోబలం, బుద్ధిబలం, వెనుకంజ వెయ్యకుండా క్లిష్ట పరిస్థితులను ధైర్యంతో ఎదుర్కొనగల్గడం, ఆత్మవిశ్వాసం, లక్ష్యసిద్ధి సాధనలో అత్యంత శ్రద్ధ వహించి కార్యశీలురుగా మెలగడం మొదలైనవన్నీ బలాన్ని సూచిస్తాయి.

         అలాగే 'మంచితనం'  పరిధి కుడా సువిశాలమైంది. దయా దాక్షిణ్యాలు, నైతిక విలువలను ఆచరించడంలో పరిపూర్ణత, సౌశీల్య౦, దీనజనులను భగవత్ స్వరూపులుగా భావించి వాళ్ళ సేవ చెయ్యడం, పవిత్రత, పావనత్వం మొదలైనవి మంచితనాన్ని సూచిస్తాయి. 

          బలానికి ఉన్న గుణాలలో ధైర్యం రారాజులాంటిది. ధైర్యం లేకపోతే మనకు ఎన్ని ఇతర సుగుణాలు ఉన్నా వాటికి రాణింపు ఉండదు. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని, స్వామి వివేకానంద దేశ ప్రజలను ఉపనిషత్తుల సందేశంతో మేల్కొల్పుతూ ధైర్యాన్ని పెంపొంది౦చుకోమని సందేశం ఇచ్చారు. ఈ ధైర్య౦  మనకు ముఖ్యంగా ప్రేరణ వల్ల లభిస్తుంది.  తన శరీరాన్ని త్యజించి వెళ్ళేముందు స్వామి వివేకానంద తాను పనిచెయ్యడం ఆపననీ, లోకంలో అందరికీ ప్రేరణను ఇస్తూ వాళ్ళు భగవంతునితో ఐఖ్యతను గుర్తించే వరకు అవిరామంగా పనిచేస్తూనే ఉంటానని వెల్లడించారు. స్వామీజీ నుండి ప్రేరణను పొందుతూ ప్రపంచం నలుమూలలా అనేకమంది ఘనకార్యాలను సాధిస్తున్నారు.

          ఈ పుస్తకంలో స్వామీజీ సందేశాన్ని చక్కటి చిత్రాలతో అందరికీ సులభంగా అర్థమయ్యే రీతిలో వివరించారు. యువతరం స్వామీజీ సందేశాల నుండి స్పూర్తిని పొంది ధైర్యోత్సాహాలతో కార్యశీలురుగా రూపొందాలని ఆశిస్తూ....

                                                                             - స్వామి జ్ఞానదానంద 

         మనకు బలమూ, మంచితనమూ రెండూ కావాలి. అయితే వీటిని ఏ క్రమంలో మనం పెంపొంది౦చుకుంటున్నామనేది చాలా ముఖ్యం. సిద్ధాంతాలను వల్లిస్తూ కేవలం ఆదర్శవాదులుగా ఉండి కార్యాచరణ విషయంలో నీరుగారిపొతే మనకు ఎంత మంచితనం ఉన్నా అది స్వీయ ప్రగతికి, సమాజ ప్రగతికి ఏమాత్రం ఉపయోగపడదు. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని స్వామి వివేకానంద యువతరాన్ని బలిష్టులై, కార్యతత్పరులుగా ఉండమని ఆదేశించారు.           'బలం' పరిధి చాలా సువిశాలమైంది. శారీరకబలం, మనోబలం, బుద్ధిబలం, వెనుకంజ వెయ్యకుండా క్లిష్ట పరిస్థితులను ధైర్యంతో ఎదుర్కొనగల్గడం, ఆత్మవిశ్వాసం, లక్ష్యసిద్ధి సాధనలో అత్యంత శ్రద్ధ వహించి కార్యశీలురుగా మెలగడం మొదలైనవన్నీ బలాన్ని సూచిస్తాయి.          అలాగే 'మంచితనం'  పరిధి కుడా సువిశాలమైంది. దయా దాక్షిణ్యాలు, నైతిక విలువలను ఆచరించడంలో పరిపూర్ణత, సౌశీల్య౦, దీనజనులను భగవత్ స్వరూపులుగా భావించి వాళ్ళ సేవ చెయ్యడం, పవిత్రత, పావనత్వం మొదలైనవి మంచితనాన్ని సూచిస్తాయి.            బలానికి ఉన్న గుణాలలో ధైర్యం రారాజులాంటిది. ధైర్యం లేకపోతే మనకు ఎన్ని ఇతర సుగుణాలు ఉన్నా వాటికి రాణింపు ఉండదు. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని, స్వామి వివేకానంద దేశ ప్రజలను ఉపనిషత్తుల సందేశంతో మేల్కొల్పుతూ ధైర్యాన్ని పెంపొంది౦చుకోమని సందేశం ఇచ్చారు. ఈ ధైర్య౦  మనకు ముఖ్యంగా ప్రేరణ వల్ల లభిస్తుంది.  తన శరీరాన్ని త్యజించి వెళ్ళేముందు స్వామి వివేకానంద తాను పనిచెయ్యడం ఆపననీ, లోకంలో అందరికీ ప్రేరణను ఇస్తూ వాళ్ళు భగవంతునితో ఐఖ్యతను గుర్తించే వరకు అవిరామంగా పనిచేస్తూనే ఉంటానని వెల్లడించారు. స్వామీజీ నుండి ప్రేరణను పొందుతూ ప్రపంచం నలుమూలలా అనేకమంది ఘనకార్యాలను సాధిస్తున్నారు.           ఈ పుస్తకంలో స్వామీజీ సందేశాన్ని చక్కటి చిత్రాలతో అందరికీ సులభంగా అర్థమయ్యే రీతిలో వివరించారు. యువతరం స్వామీజీ సందేశాల నుండి స్పూర్తిని పొంది ధైర్యోత్సాహాలతో కార్యశీలురుగా రూపొందాలని ఆశిస్తూ....                                                                              - స్వామి జ్ఞానదానంద 

Features

  • : Balam Taruvatane Manchitanam
  • : A R K Sarma
  • : Sree Sarada Book House
  • : PRISMBK120
  • : Paperback
  • : 2015
  • : 152
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Balam Taruvatane Manchitanam

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Homes
Powered by infibeam