సెప్టెంబర్ మాసం, 2022
నా కథ మలుపు తిరిగిన రోజు..
నేను ఇంటికి వచ్చి ఈ రోజుకి సరిగ్గా నెల అయ్యింది. అంతకు ముందు ఎన్నిసార్లు ఇంటికి రమ్మన్నా ఎప్పుడూ ఏదో ఒక కారణంతో ఆగిపోయేవాడిని. చాలాసార్లు, నేను సమాధానం ఇవ్వలేని ప్రశ్నలు ఇంట్లో నాకోసం ఎదురుచూస్తూ ఉండేవి. ఆ ప్రతీ ప్రశ్న నాకు జీవితంపై భయాన్ని కలిగించేది. కానీ, నెల క్రితం వచ్చిన కాల్ నా కారణం వినడానికి సిద్ధంగా లేదు. నిజానికి నేనూ ఏ కారణం చెప్పాలనుకోలేదు, ఆగిపోవాలనుకోలేదు. నాన్నని ఆఖరిసారి చూడటం అనే ఊహ ముందు నా భయాలు, బాధలు, కష్టాలు అన్నీ చిన్నవైపోయాయి. ఆ క్షణం నేనూ చిన్నపిల్లాడిని అయిపోయాను. చిన్నపిల్లాడిలాగే, ఎవరు ఏమనుకుంటారో అని ఆలోచించకుండా ఏడ్చాను.
హైవే పై కార్ వెళ్తుంది, అద్దాలు మూసి ఉండటం వల్ల వేగం తెలియలేదు కానీ, ముందు ఉన్న మీటర్ రీడింగ్ మూడు అంకెలకు చేరింది. చెన్నై నుండి ఇంటికి వచ్చేదాకా నాన్న తాలూకు ఏదో ఒక జ్ఞాపకం నా తల నిమురుతూనే ఉంది. ఇంటి ముందు కాలిన కట్టెల బూడిద, ఇంట్లోంచి వినిపించే ఏడుపులూ కలిసి ఈ ఇరవై తొమ్మిదేళ్ళలో మొదటిసారి మా ఇంటిని చూసి నేను భయపడేలా చేసాయి.
“తిలక్ వచ్చేసాడు, ఇక కార్యక్రమాలు మొదలుపెట్టండి."
నాన్న క్లోస్ ఫ్రెండ్ మెహర్ అంకుల్ అందరినీ బాధలోనుండి కదిలించి, పనుల్లోకి నెట్టాడు.......................
సెప్టెంబర్ మాసం, 2022 నా కథ మలుపు తిరిగిన రోజు.. నేను ఇంటికి వచ్చి ఈ రోజుకి సరిగ్గా నెల అయ్యింది. అంతకు ముందు ఎన్నిసార్లు ఇంటికి రమ్మన్నా ఎప్పుడూ ఏదో ఒక కారణంతో ఆగిపోయేవాడిని. చాలాసార్లు, నేను సమాధానం ఇవ్వలేని ప్రశ్నలు ఇంట్లో నాకోసం ఎదురుచూస్తూ ఉండేవి. ఆ ప్రతీ ప్రశ్న నాకు జీవితంపై భయాన్ని కలిగించేది. కానీ, నెల క్రితం వచ్చిన కాల్ నా కారణం వినడానికి సిద్ధంగా లేదు. నిజానికి నేనూ ఏ కారణం చెప్పాలనుకోలేదు, ఆగిపోవాలనుకోలేదు. నాన్నని ఆఖరిసారి చూడటం అనే ఊహ ముందు నా భయాలు, బాధలు, కష్టాలు అన్నీ చిన్నవైపోయాయి. ఆ క్షణం నేనూ చిన్నపిల్లాడిని అయిపోయాను. చిన్నపిల్లాడిలాగే, ఎవరు ఏమనుకుంటారో అని ఆలోచించకుండా ఏడ్చాను. హైవే పై కార్ వెళ్తుంది, అద్దాలు మూసి ఉండటం వల్ల వేగం తెలియలేదు కానీ, ముందు ఉన్న మీటర్ రీడింగ్ మూడు అంకెలకు చేరింది. చెన్నై నుండి ఇంటికి వచ్చేదాకా నాన్న తాలూకు ఏదో ఒక జ్ఞాపకం నా తల నిమురుతూనే ఉంది. ఇంటి ముందు కాలిన కట్టెల బూడిద, ఇంట్లోంచి వినిపించే ఏడుపులూ కలిసి ఈ ఇరవై తొమ్మిదేళ్ళలో మొదటిసారి మా ఇంటిని చూసి నేను భయపడేలా చేసాయి. “తిలక్ వచ్చేసాడు, ఇక కార్యక్రమాలు మొదలుపెట్టండి." నాన్న క్లోస్ ఫ్రెండ్ మెహర్ అంకుల్ అందరినీ బాధలోనుండి కదిలించి, పనుల్లోకి నెట్టాడు.......................© 2017,www.logili.com All Rights Reserved.