ఆత్మకథ - దేని కోసం?
ఒక వ్యక్తి ఆత్మకథను ఎందుకు రాసుకుంటాడు? సొంత వ్యవహారాలను గురించి ముచ్చటించేముందు ఆతను ఈ ప్రశ్న గురించి ఆలోచించాలి. అలాంటి రచన కేవలం తన కోసమేనా? తన సమకాలికులు కోసమా? లేదా భావితరాలను ప్రభావితం చేయడానికా?
ఇందులో ఎలాంటి శషభిషలు లేవు. తన ఆతిశయ ప్రదర్శనకు ఆత్మకథ ప్రజలలో వాహికగా ఉంటుందన్నది అక్షర సత్యం. తను చేసిన ఘనకార్యాలు పదికాలాలపాటు పదిలంగా మిగలాలంటే, వాటిని గ్రంథస్థం చేయవలసిన అవసరం ఎంతో ఉంది. జ్ఞాపకాలు త్వరగా మరుగునపడతాయి కనుక, వాటిని అక్షర రూపంలో తీసుకురావలసి వస్తుంది. తన మరణానంతరం వెలువడే సంస్మరణపత్రాలను అతడు చదవలేడు కదా! ఇదొక అనివార్యమైన దురదృష్టకర జీవితసత్యం.
బ్రిటిష్ ప్రధాని హెచ్. హెచ్. ఆస్క్విత్ తనకు ఎదురైన ఒక ఘటనను గురించి ప్రస్తావిస్తాడు. బస్ట్ పరిమాణంగల ఆయన విగ్రహాన్ని ఆవిష్కరించే సందర్భంలో ఆక్స్ఫర్డ్ యూనియన్ నిర్వహించిన సభకు యఫ్.ఇ.స్మిత్ ముఖ్య అతిథిగా వచ్చారు. నిజానికి వారిద్దరూ భిన్న రాజకీయవర్గాలకు చెందిన ప్రముఖులు. ఇరువురి మధ్య శత్రుత్వం నిత్యం రగులుతూ ఉండేది. బ్రిటిష్వారి జీవన విధానములో ఇలాంటి వింతలు సహజంగానే జరుగుతుంటాయి. ఇద్దరూ ఆక్స్ఫర్డ్లో చదువుకోవడంతోపాటు ఆ సంస్థ యొక్క సాంస్కృతిక వారసత్వం కలిగిఉండటమనేది కూడా ఇరువురికి సంబంధించిన ఐక్యతాపరమైన అంశాలు. రాజకీయ వైరుధ్యాలను మరచి, తమ అభిప్రాయాలను ఒకరితో ఒకరు పంచుకోవడానికి వారు ఎప్పుడూ వెనుకాడరు. ఆరోజు సభలో స్మిత్ అద్భుతంగా ఉపన్యసించాడు. దానికి బదులుగా ఆస్క్విత్ చేసిన ప్రసంగం నాకు బాగా గుర్తుంది. "గౌరవ మిత్రుడు మాట్లాడుతుంటే, నా మరణానంతరం టైమ్స్ పత్రికలో ప్రచురించబోయే స్మృతి వాక్యాలను వింటున్న భావం నాలో కదలాడింది”, అంటూ ఆయన చమత్కరించాడు.........................
ఆత్మకథ - దేని కోసం? ఒక వ్యక్తి ఆత్మకథను ఎందుకు రాసుకుంటాడు? సొంత వ్యవహారాలను గురించి ముచ్చటించేముందు ఆతను ఈ ప్రశ్న గురించి ఆలోచించాలి. అలాంటి రచన కేవలం తన కోసమేనా? తన సమకాలికులు కోసమా? లేదా భావితరాలను ప్రభావితం చేయడానికా? ఇందులో ఎలాంటి శషభిషలు లేవు. తన ఆతిశయ ప్రదర్శనకు ఆత్మకథ ప్రజలలో వాహికగా ఉంటుందన్నది అక్షర సత్యం. తను చేసిన ఘనకార్యాలు పదికాలాలపాటు పదిలంగా మిగలాలంటే, వాటిని గ్రంథస్థం చేయవలసిన అవసరం ఎంతో ఉంది. జ్ఞాపకాలు త్వరగా మరుగునపడతాయి కనుక, వాటిని అక్షర రూపంలో తీసుకురావలసి వస్తుంది. తన మరణానంతరం వెలువడే సంస్మరణపత్రాలను అతడు చదవలేడు కదా! ఇదొక అనివార్యమైన దురదృష్టకర జీవితసత్యం. బ్రిటిష్ ప్రధాని హెచ్. హెచ్. ఆస్క్విత్ తనకు ఎదురైన ఒక ఘటనను గురించి ప్రస్తావిస్తాడు. బస్ట్ పరిమాణంగల ఆయన విగ్రహాన్ని ఆవిష్కరించే సందర్భంలో ఆక్స్ఫర్డ్ యూనియన్ నిర్వహించిన సభకు యఫ్.ఇ.స్మిత్ ముఖ్య అతిథిగా వచ్చారు. నిజానికి వారిద్దరూ భిన్న రాజకీయవర్గాలకు చెందిన ప్రముఖులు. ఇరువురి మధ్య శత్రుత్వం నిత్యం రగులుతూ ఉండేది. బ్రిటిష్వారి జీవన విధానములో ఇలాంటి వింతలు సహజంగానే జరుగుతుంటాయి. ఇద్దరూ ఆక్స్ఫర్డ్లో చదువుకోవడంతోపాటు ఆ సంస్థ యొక్క సాంస్కృతిక వారసత్వం కలిగిఉండటమనేది కూడా ఇరువురికి సంబంధించిన ఐక్యతాపరమైన అంశాలు. రాజకీయ వైరుధ్యాలను మరచి, తమ అభిప్రాయాలను ఒకరితో ఒకరు పంచుకోవడానికి వారు ఎప్పుడూ వెనుకాడరు. ఆరోజు సభలో స్మిత్ అద్భుతంగా ఉపన్యసించాడు. దానికి బదులుగా ఆస్క్విత్ చేసిన ప్రసంగం నాకు బాగా గుర్తుంది. "గౌరవ మిత్రుడు మాట్లాడుతుంటే, నా మరణానంతరం టైమ్స్ పత్రికలో ప్రచురించబోయే స్మృతి వాక్యాలను వింటున్న భావం నాలో కదలాడింది”, అంటూ ఆయన చమత్కరించాడు.........................© 2017,www.logili.com All Rights Reserved.