మాలతీ చందూర్... దాదాపు 1963-1964 ప్రాంతంలో అనుకొంటాను ఆ పేరు మొట్టమొదటిసారిగా విన్నాను. మా పెద్దక్కయ్య, మా ఇంటి ఓనర్ గారి భార్య ప్రమదావనం, మాలతీ చందూర్ గారి గురించి మాట్లాడుకోవడం విన్నాను. ఆ రోజుల్లో 'ఆంధ్రప్రభ', 'ఆంధ్రపత్రిక' వాళ్ళింటికీ, మా ఇంటికీ వచ్చేవి.
కాలంతో బాటు ఎదుగుతున్న మాకు జీవితంలో, సమాజంలో ఏది మంచి, ఏది చెడు తెలుసుకొనే విచక్షణ వంటబట్టడానికి మొదటి కారణం మా అమ్మా నాన్న, మా బడి - అంటే మా టీచర్లు. వీటితోపాటు మేం చదివిన సాహిత్యం కూడా చాలా దోహదపడిందని నా నమ్మకం. ముఖ్యంగా స్వాతంత్య్రం వచ్చిన మొదటి నాలుగు దశాబ్దాల కాలం పుస్తకం సమాజంలో బాగా రాజ్యమేలిన కాలం. మంచి మంచి రచయితలు, రచయిత్రులు ఎందరో... ఏ ఇద్దరు వ్యక్తులు కలిసినా, లేదా పార్టీలు ఫంక్షన్లలోనయినా పుస్తకాల గురించి మాట్లాడుకోవడం స్టేటస్ సింబల్గా వుండేది. ఆ సంభాషణల్లో మాలతీ చందూర్ గారి ప్రమదావనం ప్రస్తావన తప్పక వుండేది. అలా ఆవిడ పట్ల మొదలయిన ఇష్టం, ఆవిడ నవలలు, అనువాద రచనలు చదివిన తరువాత పెరిగింది. అనుకోకుండా మావారు హరగోపాల్ గారు హైదరాబాదు హిందూస్థాన్ కేబుల్ కంపెనీ నుండి BEL మద్రాసు డిజిఎమ్ పదోన్నతి పొందారు. అప్పటికే నాకు మద్రాసంటే ఓ గ్లామర్. దాంతో నేను కూడా హైదరాబాద్ ఇసిఐఎల్ నుంచి మద్రాసు బ్రాంచికి ట్రాన్స్ఫర్ చేయించుకొని 1991 ఏప్రిల్లో ఇద్దరు పిల్లలతో, మా అత్తగారితో మద్రాసు చేరాను. మద్రాసు రైలు ఎక్కినపుడు నా మనసులో ఎలాగైనా మాలతీ చందూర్ గారిని కలవాలి, చూడాలి అనుకున్నాను. అంతే అదే నా కోరిక. కానీ జరిగింది వేరు.
ఇల్లు, పిల్లలు, ఆఫీస్ ఓ కొలిక్కి తెచ్చుకొని, మొత్తానికి ఆవిడ నంబరు సంపాదించాను. అప్పటికే ప్రచారంలో వున్న విషయం ఏమిటంటే ఆవిడ ఎవరినీ ఇంటికి..........................
మాలతీ చందూర్... దాదాపు 1963-1964 ప్రాంతంలో అనుకొంటాను ఆ పేరు మొట్టమొదటిసారిగా విన్నాను. మా పెద్దక్కయ్య, మా ఇంటి ఓనర్ గారి భార్య ప్రమదావనం, మాలతీ చందూర్ గారి గురించి మాట్లాడుకోవడం విన్నాను. ఆ రోజుల్లో 'ఆంధ్రప్రభ', 'ఆంధ్రపత్రిక' వాళ్ళింటికీ, మా ఇంటికీ వచ్చేవి. కాలంతో బాటు ఎదుగుతున్న మాకు జీవితంలో, సమాజంలో ఏది మంచి, ఏది చెడు తెలుసుకొనే విచక్షణ వంటబట్టడానికి మొదటి కారణం మా అమ్మా నాన్న, మా బడి - అంటే మా టీచర్లు. వీటితోపాటు మేం చదివిన సాహిత్యం కూడా చాలా దోహదపడిందని నా నమ్మకం. ముఖ్యంగా స్వాతంత్య్రం వచ్చిన మొదటి నాలుగు దశాబ్దాల కాలం పుస్తకం సమాజంలో బాగా రాజ్యమేలిన కాలం. మంచి మంచి రచయితలు, రచయిత్రులు ఎందరో... ఏ ఇద్దరు వ్యక్తులు కలిసినా, లేదా పార్టీలు ఫంక్షన్లలోనయినా పుస్తకాల గురించి మాట్లాడుకోవడం స్టేటస్ సింబల్గా వుండేది. ఆ సంభాషణల్లో మాలతీ చందూర్ గారి ప్రమదావనం ప్రస్తావన తప్పక వుండేది. అలా ఆవిడ పట్ల మొదలయిన ఇష్టం, ఆవిడ నవలలు, అనువాద రచనలు చదివిన తరువాత పెరిగింది. అనుకోకుండా మావారు హరగోపాల్ గారు హైదరాబాదు హిందూస్థాన్ కేబుల్ కంపెనీ నుండి BEL మద్రాసు డిజిఎమ్ పదోన్నతి పొందారు. అప్పటికే నాకు మద్రాసంటే ఓ గ్లామర్. దాంతో నేను కూడా హైదరాబాద్ ఇసిఐఎల్ నుంచి మద్రాసు బ్రాంచికి ట్రాన్స్ఫర్ చేయించుకొని 1991 ఏప్రిల్లో ఇద్దరు పిల్లలతో, మా అత్తగారితో మద్రాసు చేరాను. మద్రాసు రైలు ఎక్కినపుడు నా మనసులో ఎలాగైనా మాలతీ చందూర్ గారిని కలవాలి, చూడాలి అనుకున్నాను. అంతే అదే నా కోరిక. కానీ జరిగింది వేరు. ఇల్లు, పిల్లలు, ఆఫీస్ ఓ కొలిక్కి తెచ్చుకొని, మొత్తానికి ఆవిడ నంబరు సంపాదించాను. అప్పటికే ప్రచారంలో వున్న విషయం ఏమిటంటే ఆవిడ ఎవరినీ ఇంటికి..........................© 2017,www.logili.com All Rights Reserved.