సందేశాత్మక నవల సుళుందీ
తమిళంలో ముత్తు నాగు రాసిన సుళుందీ నవలని అనువదించిన రామస్వామి రఘుపతి రాసిన ముందు మాట సవిస్తరంగా ఉంది. నిజానికి దీనికి మరో ముందు మాట అవసరం లేదు. అందులో నవల నేపథ్యాన్ని, వైశిష్ట్యాన్ని, అవసరాన్ని, పరామర్శల్ని విపులీకరించారు. అయినా మిత్రుని మాట కాదనలేక, నవల చదివినాక కల్గిన అనుభూతిని పంచుకోవడానికి మాత్రమే ఈ రెండు మాటలు.
ఈ నవలలో సుళుందీ జనజీవనంలో అనివార్యమైన అగ్గికి ప్రతీక. ఇంటిలో పొయ్యి రగిలించడానికి, అమ్మవారి గుడి ముందున్న అగ్నిగుండం ఆరకుండా ఉండ డానికి, రాత్రిళ్లలో దారి దీపంగా, తలకొరివిగా కూడ అనివార్యమైన అగ్గికి ప్రతీక. అదే అగ్గి తమని కులబహిష్కరణ చేసి, వలసపాలకుల దన్నుతో పంట భూముల్ని లాక్కొని పండిస్తున్న పంటని కాల్చిన చైతన్యానికి కూడా ప్రతీకే.
బీడు భూముల్ని, అడవిని పంటపొలాలుగా మార్చిన, బావుల తవ్వకానికి సింధూరం మండించి రాళ్లు పగలకొట్టిన ఆధునిక చైతన్యానికి ప్రతీక. కులబహిష్కరణ పొంది తిరుగుబాటు దారులుగా మారిన వారి గుడిసెలని కాల్చడానికి కూడా సుళుందే పాలకుల ఆయుధం. అడవిలో నివసిస్తున్న సిద్ధ వైద్యుల గుహ ముందు వెలుగు కోసం మండేది, రాత్రి సంచారానికి వెలుగునిచ్చేది కూడా సుళుందీనే. అలాంటి సుళుందీ ప్రజలకి దూరం అయింది. కులబహిష్కరణకు గురైనవారు వాడకుండా కట్టడి చేశారు. దైనందిన కార్యక్రమాలకు కూడా సుళుందీ వాడటం నిషేధం అయింది. సుకుందీ పుల్లను ఎవరూ నరకకూడదు, ఇంట్లో ఉంచుకున్నా కూడా అది అంతఃపుర నేరమే. జమీందారు, జనసేనాధిపతుల ఇండ్లలో నిప్పు రగిలించే అతని దగ్గరి నుంచే మిగతావారు తమ అవసరాలకు నిప్పురవ్వల్ని తీసుకపోవాలి, అతనికి పురజనులు మాన్యం ఇవ్వాలి. నిప్పు రగిలించే వారే......................
సందేశాత్మక నవల సుళుందీ తమిళంలో ముత్తు నాగు రాసిన సుళుందీ నవలని అనువదించిన రామస్వామి రఘుపతి రాసిన ముందు మాట సవిస్తరంగా ఉంది. నిజానికి దీనికి మరో ముందు మాట అవసరం లేదు. అందులో నవల నేపథ్యాన్ని, వైశిష్ట్యాన్ని, అవసరాన్ని, పరామర్శల్ని విపులీకరించారు. అయినా మిత్రుని మాట కాదనలేక, నవల చదివినాక కల్గిన అనుభూతిని పంచుకోవడానికి మాత్రమే ఈ రెండు మాటలు. ఈ నవలలో సుళుందీ జనజీవనంలో అనివార్యమైన అగ్గికి ప్రతీక. ఇంటిలో పొయ్యి రగిలించడానికి, అమ్మవారి గుడి ముందున్న అగ్నిగుండం ఆరకుండా ఉండ డానికి, రాత్రిళ్లలో దారి దీపంగా, తలకొరివిగా కూడ అనివార్యమైన అగ్గికి ప్రతీక. అదే అగ్గి తమని కులబహిష్కరణ చేసి, వలసపాలకుల దన్నుతో పంట భూముల్ని లాక్కొని పండిస్తున్న పంటని కాల్చిన చైతన్యానికి కూడా ప్రతీకే. బీడు భూముల్ని, అడవిని పంటపొలాలుగా మార్చిన, బావుల తవ్వకానికి సింధూరం మండించి రాళ్లు పగలకొట్టిన ఆధునిక చైతన్యానికి ప్రతీక. కులబహిష్కరణ పొంది తిరుగుబాటు దారులుగా మారిన వారి గుడిసెలని కాల్చడానికి కూడా సుళుందే పాలకుల ఆయుధం. అడవిలో నివసిస్తున్న సిద్ధ వైద్యుల గుహ ముందు వెలుగు కోసం మండేది, రాత్రి సంచారానికి వెలుగునిచ్చేది కూడా సుళుందీనే. అలాంటి సుళుందీ ప్రజలకి దూరం అయింది. కులబహిష్కరణకు గురైనవారు వాడకుండా కట్టడి చేశారు. దైనందిన కార్యక్రమాలకు కూడా సుళుందీ వాడటం నిషేధం అయింది. సుకుందీ పుల్లను ఎవరూ నరకకూడదు, ఇంట్లో ఉంచుకున్నా కూడా అది అంతఃపుర నేరమే. జమీందారు, జనసేనాధిపతుల ఇండ్లలో నిప్పు రగిలించే అతని దగ్గరి నుంచే మిగతావారు తమ అవసరాలకు నిప్పురవ్వల్ని తీసుకపోవాలి, అతనికి పురజనులు మాన్యం ఇవ్వాలి. నిప్పు రగిలించే వారే......................© 2017,www.logili.com All Rights Reserved.