అమ్మే నా ఊపిరి
అమ్మ కాలంచేసే వేళకి నాకు నలభై ఆరేళ్ళు. ఇవాల్టికి కూడా, ఈ నలభై ఆరేళ్ళలో అమ్మ నాతో కలిసి నిర్మించిన ప్రపంచంలోనే నేను బ్రతుకుతున్నాను. సంతోషాన్ని, సౌఖ్యాన్నీ ఇచ్చే అందమైన ప్రపంచం. ఈ ప్రపంచాన్ని వీడడానికి నేను చేసే ప్రయత్నాలన్నీ విఫలం అవుతూనే ఉన్నాయి. నేను మళ్ళీ అమ్మ పైట చెంగులో తిరిగి తలదాచుకుంటూనే ఉంటాను. ఒకరకంగా ఈ నత్తకి అది గుల్లలాంటిదన్నమాట.
నా చదువు, వృత్తి నన్ను మా అమ్మ ప్రపంచానికి దూరం చేసినా, నా ఆలోచనలు, పనులు, జీవన విధానం అన్నీ మా అమ్మ నాకు నేర్పిన విధంగానే సాగుతున్నాయి. ఇలా అమ్మ మాటలను నా మాటలుగా చేసుకోవడం, అమ్మ చేతుల్తో నేను పనిచెయ్యడం, ఆమె మెదడుతో ఆలోచించడం, ఆమె గుండెతో శ్వాసించడం... ఇదంతా సరైనదేనా అని నాకు కొన్నిసార్లు అనిపిస్తుంది. ఇది మంచిదేనా? నాకైతే తెలియదు. కానీ పుట్టుకతో వచ్చిన బుద్ధి పుడకలతో గానీ పోదు కదా!
ఈ సిగ్గరి, ఒంటరి పిల్లాడిని అమ్మ చెయ్యి పట్టుకుని ప్రపంచంలోకి తోసింది. అమ్మ దగ్గర ఉన్నప్పుడు, ఆమెతో మాట్లాడేటప్పుడు ఉండే చనువు, స్వతంత్రత నాకు ఇంకే బంధంలోనూ కనిపించలేదు. అలాగని ఇదేదో ప్రత్యేకమైన ప్రేమ అని గొప్పలు చెప్పటంలేదు. మేం తరచుగా దెబ్బలాడుకునే వాళ్ళం. ఆలకలు, కోపాలు అన్నీ మామూలే. కానీ ఇవేవీ మమ్మల్నెప్పుడూ విడదియ్యలేదు.
చాలామంది లాగే, నేను కూడా అమ్మని ఇంకొంచెం బాగా చూసుకుని ఉండాల్సింది, ఆమెను ఇంకొంచెం సంతోషంగా ఉంచాల్సింది అని అనుకుంటూ ఉంటాను. ఆమె నా కోసం చేసిన దానికి కృతజ్ఞత ఉండాలి కదా! ఈ పశ్చాత్తాపం నన్నెన్నడూ వీడిపోదు.
ఒక రైతు కుటుంబం నుంచి వచ్చిన మహిళకు సరైన ఉదాహరణ అంటే మా అమ్మే! ఆమెకు తన పని, కాయకష్టం తప్ప వేరే ఏమీ తెలియదు. సాధారణంగా మగాళ్ళ పనులుగా భావించబడే పనులన్నింటినీ అమ్మ సునాయాసంగా చేసేసేది. ఇది 'మగపని', ఇది 'ఆడపని' అని ఆమె ఎన్నడూ భావించేది కాదు. ఆమెకు కావల్సిందల్లా తన కుటుంబం గౌరవంగా, తలెత్తుకుని జీవించడమే. ఆమె ఆందోళన, తాపత్రయం అంతా తన కుటుంబం గురించే!
మాది చిన్న కుటుంబమే గానీ, మేం అమ్మని చాలా ఇబ్బంది పెట్టామనే చెప్పాలి. ఆమె చాలా శక్తివంతురాలు. నిజానికి ఆమె వ్యక్తిత్వాన్నిబట్టి ఆమె ఇంతకంటే మంచి, సంతోషకరమైన జీవితాన్ని పొంది ఉండొచ్చనిపిస్తుంది. పరిస్థితుల ప్రభావం వల్లనే అమ్మ సాధించాల్సినంత సాధించలేకపోయిందని నాకు నేను సర్దిచెప్పుకుంటూ ఉంటాను. కుటుంబ.......................
అమ్మే నా ఊపిరి అమ్మ కాలంచేసే వేళకి నాకు నలభై ఆరేళ్ళు. ఇవాల్టికి కూడా, ఈ నలభై ఆరేళ్ళలో అమ్మ నాతో కలిసి నిర్మించిన ప్రపంచంలోనే నేను బ్రతుకుతున్నాను. సంతోషాన్ని, సౌఖ్యాన్నీ ఇచ్చే అందమైన ప్రపంచం. ఈ ప్రపంచాన్ని వీడడానికి నేను చేసే ప్రయత్నాలన్నీ విఫలం అవుతూనే ఉన్నాయి. నేను మళ్ళీ అమ్మ పైట చెంగులో తిరిగి తలదాచుకుంటూనే ఉంటాను. ఒకరకంగా ఈ నత్తకి అది గుల్లలాంటిదన్నమాట. నా చదువు, వృత్తి నన్ను మా అమ్మ ప్రపంచానికి దూరం చేసినా, నా ఆలోచనలు, పనులు, జీవన విధానం అన్నీ మా అమ్మ నాకు నేర్పిన విధంగానే సాగుతున్నాయి. ఇలా అమ్మ మాటలను నా మాటలుగా చేసుకోవడం, అమ్మ చేతుల్తో నేను పనిచెయ్యడం, ఆమె మెదడుతో ఆలోచించడం, ఆమె గుండెతో శ్వాసించడం... ఇదంతా సరైనదేనా అని నాకు కొన్నిసార్లు అనిపిస్తుంది. ఇది మంచిదేనా? నాకైతే తెలియదు. కానీ పుట్టుకతో వచ్చిన బుద్ధి పుడకలతో గానీ పోదు కదా! ఈ సిగ్గరి, ఒంటరి పిల్లాడిని అమ్మ చెయ్యి పట్టుకుని ప్రపంచంలోకి తోసింది. అమ్మ దగ్గర ఉన్నప్పుడు, ఆమెతో మాట్లాడేటప్పుడు ఉండే చనువు, స్వతంత్రత నాకు ఇంకే బంధంలోనూ కనిపించలేదు. అలాగని ఇదేదో ప్రత్యేకమైన ప్రేమ అని గొప్పలు చెప్పటంలేదు. మేం తరచుగా దెబ్బలాడుకునే వాళ్ళం. ఆలకలు, కోపాలు అన్నీ మామూలే. కానీ ఇవేవీ మమ్మల్నెప్పుడూ విడదియ్యలేదు. చాలామంది లాగే, నేను కూడా అమ్మని ఇంకొంచెం బాగా చూసుకుని ఉండాల్సింది, ఆమెను ఇంకొంచెం సంతోషంగా ఉంచాల్సింది అని అనుకుంటూ ఉంటాను. ఆమె నా కోసం చేసిన దానికి కృతజ్ఞత ఉండాలి కదా! ఈ పశ్చాత్తాపం నన్నెన్నడూ వీడిపోదు. ఒక రైతు కుటుంబం నుంచి వచ్చిన మహిళకు సరైన ఉదాహరణ అంటే మా అమ్మే! ఆమెకు తన పని, కాయకష్టం తప్ప వేరే ఏమీ తెలియదు. సాధారణంగా మగాళ్ళ పనులుగా భావించబడే పనులన్నింటినీ అమ్మ సునాయాసంగా చేసేసేది. ఇది 'మగపని', ఇది 'ఆడపని' అని ఆమె ఎన్నడూ భావించేది కాదు. ఆమెకు కావల్సిందల్లా తన కుటుంబం గౌరవంగా, తలెత్తుకుని జీవించడమే. ఆమె ఆందోళన, తాపత్రయం అంతా తన కుటుంబం గురించే! మాది చిన్న కుటుంబమే గానీ, మేం అమ్మని చాలా ఇబ్బంది పెట్టామనే చెప్పాలి. ఆమె చాలా శక్తివంతురాలు. నిజానికి ఆమె వ్యక్తిత్వాన్నిబట్టి ఆమె ఇంతకంటే మంచి, సంతోషకరమైన జీవితాన్ని పొంది ఉండొచ్చనిపిస్తుంది. పరిస్థితుల ప్రభావం వల్లనే అమ్మ సాధించాల్సినంత సాధించలేకపోయిందని నాకు నేను సర్దిచెప్పుకుంటూ ఉంటాను. కుటుంబ.......................© 2017,www.logili.com All Rights Reserved.