వూరికో నాగరాజు వుంటే బావుణ్ణు!
యూనివర్సిటీ ప్రొఫెసర్ అయినా, కాలేజీ లెక్చరర్ అయినా, హైస్కూల్ టీచర్ అయినా... వాళ్ల అనుభవాల్లో తేడా వుంటుంది గానీ, జీవితం మాత్రం అటూ, ఇటుగా ఒక్కలాగే వుంటుంది. నిత్య జీవన పోరాటం, ప్రమోషన్ తాపత్రయం, డి.ఎ. ఎంత పెరుగుతుంది? పిల్లల చదువులు, మూడు వందల గజాలన్నా కొనుక్కోక పోతే ఎలా? చీటీలూ, ఇ.ఎం.ఐ. లూ, ఈ వెధవ మందు మానలేక పోతున్నామనే దిగులూ, పెద్దాణ్ణి ఎలా అయినా అమెరికా పంపించాలనే వున్నతాశయమా... ఇదే ఇక చివరి సిగరెట్ - ఇదొక సింపుల్ మెకానికల్ రొటీన్. ఎక్కువ మందికి పాఠం చెప్పడం అనేది ఒక పని మాత్రమే. నెల జీతం కోసం చేసే క్లర్కులాంటి ఉద్యోగం మాత్రమే.
గాడిచర్ల హరిసర్వోత్తమరావు, పుట్టపర్తి నారాయణచార్యులూ, విద్వాన్ విశ్వమూ, రాచమల్లు రామచంద్రారెడ్డి, మధురాంతకం రాజారామ్లు పనికి మాలిన ఆదర్శాలు పట్టుకు వేలాడిన చాదస్తులుగా వాళ్లకి అనిపించవచ్చు. మరి కొందరుంటారు - చదువు, ఉద్యోగం యిచ్చి, మర్యాదా, సంసార్కమూ నేర్పి, ఆకుపచ్చని తోటల్లో వెన్నెల కాంతి లాంటి జ్ఞానాన్ని ప్రసాదించిన బతుక్కి బదులు తీర్చుకోవా లనుకుంటారు. అలాంటి కొద్ది మందిలో సాకం నాగరాజ అనే సాధారణమైన మానవుడూ వుంటాడు. గట్టి పిండం. తెలివైన వాడు. సాహిత్యాన్నీ, సంగీతాన్నీ ప్రేమించిన మనిషి. పుస్తకం లోని తొలి అధ్యాయం లాంటి భావుకుడు. భక్తులు నడిచి వెళ్లడానికి పసుపు పూసి, కుంకుమ బొట్లు పెట్టిన తిరుపతి మెట్లలాంటి వాడు. మా కొల్లేరు గట్ల మీద పుష్కలంగా దొరికే నల్లేరులాంటి వాడు. తన గురించి క్లుప్తంగా, స్పష్టంగా, నిర్భయంగా రాసుకున్న జీవన చిత్రం ఈ పుస్తకం. సూటిగా వుంటుంది మాట. గుచ్చుకుంటుంది కూడా ఒక్కో చోట. ఇక్కడ దాపరికమూ లేదు, గొప్పలు చెప్పుకునే దరిద్రమూ కానరాదు. నీటి కెరటాలు మీద తేలియాడే........................
వూరికో నాగరాజు వుంటే బావుణ్ణు! యూనివర్సిటీ ప్రొఫెసర్ అయినా, కాలేజీ లెక్చరర్ అయినా, హైస్కూల్ టీచర్ అయినా... వాళ్ల అనుభవాల్లో తేడా వుంటుంది గానీ, జీవితం మాత్రం అటూ, ఇటుగా ఒక్కలాగే వుంటుంది. నిత్య జీవన పోరాటం, ప్రమోషన్ తాపత్రయం, డి.ఎ. ఎంత పెరుగుతుంది? పిల్లల చదువులు, మూడు వందల గజాలన్నా కొనుక్కోక పోతే ఎలా? చీటీలూ, ఇ.ఎం.ఐ. లూ, ఈ వెధవ మందు మానలేక పోతున్నామనే దిగులూ, పెద్దాణ్ణి ఎలా అయినా అమెరికా పంపించాలనే వున్నతాశయమా... ఇదే ఇక చివరి సిగరెట్ - ఇదొక సింపుల్ మెకానికల్ రొటీన్. ఎక్కువ మందికి పాఠం చెప్పడం అనేది ఒక పని మాత్రమే. నెల జీతం కోసం చేసే క్లర్కులాంటి ఉద్యోగం మాత్రమే. గాడిచర్ల హరిసర్వోత్తమరావు, పుట్టపర్తి నారాయణచార్యులూ, విద్వాన్ విశ్వమూ, రాచమల్లు రామచంద్రారెడ్డి, మధురాంతకం రాజారామ్లు పనికి మాలిన ఆదర్శాలు పట్టుకు వేలాడిన చాదస్తులుగా వాళ్లకి అనిపించవచ్చు. మరి కొందరుంటారు - చదువు, ఉద్యోగం యిచ్చి, మర్యాదా, సంసార్కమూ నేర్పి, ఆకుపచ్చని తోటల్లో వెన్నెల కాంతి లాంటి జ్ఞానాన్ని ప్రసాదించిన బతుక్కి బదులు తీర్చుకోవా లనుకుంటారు. అలాంటి కొద్ది మందిలో సాకం నాగరాజ అనే సాధారణమైన మానవుడూ వుంటాడు. గట్టి పిండం. తెలివైన వాడు. సాహిత్యాన్నీ, సంగీతాన్నీ ప్రేమించిన మనిషి. పుస్తకం లోని తొలి అధ్యాయం లాంటి భావుకుడు. భక్తులు నడిచి వెళ్లడానికి పసుపు పూసి, కుంకుమ బొట్లు పెట్టిన తిరుపతి మెట్లలాంటి వాడు. మా కొల్లేరు గట్ల మీద పుష్కలంగా దొరికే నల్లేరులాంటి వాడు. తన గురించి క్లుప్తంగా, స్పష్టంగా, నిర్భయంగా రాసుకున్న జీవన చిత్రం ఈ పుస్తకం. సూటిగా వుంటుంది మాట. గుచ్చుకుంటుంది కూడా ఒక్కో చోట. ఇక్కడ దాపరికమూ లేదు, గొప్పలు చెప్పుకునే దరిద్రమూ కానరాదు. నీటి కెరటాలు మీద తేలియాడే........................© 2017,www.logili.com All Rights Reserved.