ఇప్పుడు మనం గ్రామల గురించి
ఎట్లాంటి ఆలోచనలు చేస్తున్నాం?
ఒక దశాబ్దం క్రిందట నేను రచించిన 'క్రోనికల్స్ ఆఫ్ ఎ విలేజ్ బాయ్ ఇన్ ఢిల్లీ' అనే పుస్తకంలో ఒక పల్లెటూరి పిల్లవాడు కొత్త ఢిల్లీలో ఏభై ఏళ్ళ జీవితం గడపడం గురించి వివరించాను. (ఆ పుస్తకానికి 11 ముందుమాట కాశ్మీర్కు చెందిన మాజీ కేంద్రమంత్రి డా॥ కరణ్ సింగ్ వ్రాసారు). ఆ సంవత్సరాలలో నేను నా స్వంత ఊరు ఆంధ్రప్రదేశ్లోని కృష్ణాజిల్లా ముదునూరు గ్రామానికి ఏడాదికొకసారైనా వెళ్ళి అక్కడ జరిగే వివిధ పాఠశాల కార్యక్రమాల లోను పాల్గొనేవాడిని. ఆ పర్యటనల్లో నేను చాలా పబ్లిక్ స్కూళ్ళు, ఎక్కువగా ఆంధ్ర. తెలంగాణ లోని జిల్లా పరిషత్ పాఠశాలలు చూసి నేను స్థాపించిన BREAD అనే సంస్థ ద్వారా ఆ పాఠశాలల్లో 1800 ప్రత్యేక గ్రంథాలయాలు ఏర్పాటు జరిగింది. 2022 నుండి నేను సగం సమయం మా ఊరిలో గడుపుతూ మొట్ట మొదటి 'జీవిత చరిత్రల గ్రంథాలయం' ఏర్పాటు చేసి పిల్లలను అవి చదివి అందులోని పాత్రలను అభినయించడానికి ప్రోత్సహిస్తున్నాను. ఈ గ్రంథాలయం కోసం నేను మా ఊరిలోని వంద సంవత్సరాల నాటి సంప్రదాయ గృహాన్ని పునరుద్ధరించి అక్కడ నా భార్యతో కలసి ఉంటున్నాను.
నేను ఈ గ్రామంలో పుట్టి, పెరగడమే కాదు. నా ప్రాథమిక, ఉన్నత పాఠశాల విద్య ఇక్కడే పూర్తి చేసుకున్నాను. నా కళాశాల వేసవి శెలవుల్లో గ్రామీణ బాలలకు పాఠాలు చెప్పే వాడిని. నా విశ్వవిద్యాలయ డిగ్రీ "ఎమ్.ఎ. రూరల్ డెవలప్మెంట్ అండ్ కో ఆపరేషన్" (1962)లో భాగంగా రెండు క్షేత్ర అధ్యయనాలు జరిపాను........................
------------------------------------------------------------------------------లిటిల్ రిపబ్లిక్కులుగా గ్రామాలు
© 2017,www.logili.com All Rights Reserved.