వర్తమానం
డౌన్లైన్ పబ్లోంచి, రాజేశ్వరి, రవి బయటకి వచ్చేటప్పటికి రాత్రి పన్నెండు దాటింది. స్పృహలోనే వున్నా, ఇద్దరి ఒళ్ళూ కొంచెం ఊగుతోంది. రాజేశ్వరి ముందే డ్రైవర్కి ఫోన్ చెయ్యటంవల్ల వీళ్ళు బయటకి వచ్చేటప్పటికే కారు రెడీగా ఉంది. కారులో కూచున్నాక, “ఇంక ఇంటికెళ్ళిపోదామా?” అని అడిగింది రాజేశ్వరి.
“నో... ఐస్క్రీం తిందాం” అన్నాడు రవి.
“విన్నావుగా” అంది డ్రైవర్ వైపు చూస్తూ.
“విన్నానమ్మా” అన్నాడు డ్రైవర్.
ఆ టైములో ఇద్దరికీ ఐస్క్రీం అంత అవసరమేం కాదు. శుక్రవారం రాత్రి... వీకెండ్. ఆనందించాలి. అదే ధోరణి. దానికి ఇది అవసరం, అది అనవసరం అన్న ఆలోచనే లేదు. నాలుగు రకాల ఐస్ క్రీంలు చెప్పాడు రవి. ఒకదాని తర్వాత మరొకటి తెమ్మన్నాడు. అంటే అక్కడ ఎంతసేపు అవుతుందో రవి దృష్టిలో ఉన్నట్టు లేదు.
"రేపు పొద్దున్న తొమ్మిదింటికి, మీ బాస్తో మీటింగ్ ఉందన్నావు, గుర్తుందా?" అనడిగింది.
"లేదు. ఆ గొడవలేం, నీతో ఉండగా వద్దు. ఇప్పుడు ఎంజాయ్ చెయ్యినియ్యి” అన్నాడు మొండి పిల్లాడిలా.
రాజేశ్వరి ఇంక ఆ విషయం మాట్లాడలేదు. తనలో తనే నవ్వుకుంది. రవి తన దగ్గర అలా మొండిగా ప్రవర్తించటం రాజేశ్వరికి ఇష్టం. ఇద్దరూ ఇల్లు చేరేటప్పటికి రెండు దాటింది.
“రాత్రంతా ఉండిపోతున్నావుగా, డ్రైవర్ని పంపించేస్తాను" అంది.
“సరే” అన్నాడు రవి...........................
వర్తమానం డౌన్లైన్ పబ్లోంచి, రాజేశ్వరి, రవి బయటకి వచ్చేటప్పటికి రాత్రి పన్నెండు దాటింది. స్పృహలోనే వున్నా, ఇద్దరి ఒళ్ళూ కొంచెం ఊగుతోంది. రాజేశ్వరి ముందే డ్రైవర్కి ఫోన్ చెయ్యటంవల్ల వీళ్ళు బయటకి వచ్చేటప్పటికే కారు రెడీగా ఉంది. కారులో కూచున్నాక, “ఇంక ఇంటికెళ్ళిపోదామా?” అని అడిగింది రాజేశ్వరి. “నో... ఐస్క్రీం తిందాం” అన్నాడు రవి. “విన్నావుగా” అంది డ్రైవర్ వైపు చూస్తూ.“విన్నానమ్మా” అన్నాడు డ్రైవర్. ఆ టైములో ఇద్దరికీ ఐస్క్రీం అంత అవసరమేం కాదు. శుక్రవారం రాత్రి... వీకెండ్. ఆనందించాలి. అదే ధోరణి. దానికి ఇది అవసరం, అది అనవసరం అన్న ఆలోచనే లేదు. నాలుగు రకాల ఐస్ క్రీంలు చెప్పాడు రవి. ఒకదాని తర్వాత మరొకటి తెమ్మన్నాడు. అంటే అక్కడ ఎంతసేపు అవుతుందో రవి దృష్టిలో ఉన్నట్టు లేదు. "రేపు పొద్దున్న తొమ్మిదింటికి, మీ బాస్తో మీటింగ్ ఉందన్నావు, గుర్తుందా?" అనడిగింది. "లేదు. ఆ గొడవలేం, నీతో ఉండగా వద్దు. ఇప్పుడు ఎంజాయ్ చెయ్యినియ్యి” అన్నాడు మొండి పిల్లాడిలా. రాజేశ్వరి ఇంక ఆ విషయం మాట్లాడలేదు. తనలో తనే నవ్వుకుంది. రవి తన దగ్గర అలా మొండిగా ప్రవర్తించటం రాజేశ్వరికి ఇష్టం. ఇద్దరూ ఇల్లు చేరేటప్పటికి రెండు దాటింది. “రాత్రంతా ఉండిపోతున్నావుగా, డ్రైవర్ని పంపించేస్తాను" అంది. “సరే” అన్నాడు రవి...........................© 2017,www.logili.com All Rights Reserved.