అహంకారం . ఈ ఒక్క ఎక్కడి అహంకారం మనిషిని ఎక్కడి వరకైనా తెసుకువెళ్ళగలదు. ఎదుటి వాడి మీద గెలవాలి అనే అహంకారం, మనిషిని విచక్షణ కోల్పోయేలా చేసి, పిచ్చోడిలా మార్చగలదు. నేను చేసేదే కరెక్ట్, నేను మాత్రమే తెలివిగలవాడిని, అందరి మీదా నేనే గెలవాలి అనే అహంకారం ఉన్న మనిషి ఎప్పటికి గెలవలేడు, ప్రశాంతంగా బ్రతకలేడు.
వర్షాకాలం కనుక ఏకదాటిగా వర్షం కురుస్తూ ఉంది. సమయం ఉదయం ఆరవుతున్నా చలి వలన కలిగిన బద్దకంతో అనుకుంట హైదరాబాద్ నగరం అంతా నిద్ర మత్తులోనే ఉంది. కొందరు ఆఫీస్కి టైమ్ అవుతుందని తప్పక దుప్పటి తీసి బలవంతంగా లేస్తున్నారు. కొందరు ఇంకాసేపు ఆగి గుద్దాంలే అని, తమకి తామే సర్దిచెప్పుకుంటూ మళ్ళీ నిద్రలోకి జారుకుంటున్నారు. శుక్రవారం అందునా శ్రావణ మాసంలో వచ్చే మొదటి శుక్రవారం కూడా కావడంతో, కొందరు ఆడవాళ్ళు మాత్రం ఈ వర్షం, చలిని లెక్కచేయకుండా పూజలు చేసి, లక్ష్మీదేవిని ఇంప్రెస్ చేయాల్సిందే, అని పట్టు వదలకుండా లేచి తల స్నానాలు మొదలు పెట్టారు. ఇలా ఎవరి పనిలో వాళ్ళు ఉన్నారు.
జూబ్లీహిల్స్ పక్కన ఉన్న బస్తీలో ఒక చిన్న మూడు అంతస్తుల భవనం ఉంది. చెప్పుకోవడానికి మూడంతస్తుల భవనమే, కాని ఒక్కో అంతస్తులో ఇరికించి కట్టిన సింగల్ బెడ్రూమ్ ఫ్లాట్ ఉంది. దాని గోడలు పెచ్చులు ఊడిపోయి ఉన్నాయి. రాత్రి నుండి కురుస్తున్న వర్షం వలన ఆ మూడవ అంతస్తు పైన ఉన్న స్లాబ్ మధ్యలో ఉన్న సన్నని రంధ్రం గుండా కారుతున్న వర్షం నీరు, ఇంటి హాల్ నడి మధ్యలో పెట్టి ఉన్న పాత గిన్నెలో పడుతూ ఉంది. ఆ గిన్నెలో కారే ఒకో చినుకు టక్టాక్ మంటూ.................
అహంకారం . ఈ ఒక్క ఎక్కడి అహంకారం మనిషిని ఎక్కడి వరకైనా తెసుకువెళ్ళగలదు. ఎదుటి వాడి మీద గెలవాలి అనే అహంకారం, మనిషిని విచక్షణ కోల్పోయేలా చేసి, పిచ్చోడిలా మార్చగలదు. నేను చేసేదే కరెక్ట్, నేను మాత్రమే తెలివిగలవాడిని, అందరి మీదా నేనే గెలవాలి అనే అహంకారం ఉన్న మనిషి ఎప్పటికి గెలవలేడు, ప్రశాంతంగా బ్రతకలేడు. వర్షాకాలం కనుక ఏకదాటిగా వర్షం కురుస్తూ ఉంది. సమయం ఉదయం ఆరవుతున్నా చలి వలన కలిగిన బద్దకంతో అనుకుంట హైదరాబాద్ నగరం అంతా నిద్ర మత్తులోనే ఉంది. కొందరు ఆఫీస్కి టైమ్ అవుతుందని తప్పక దుప్పటి తీసి బలవంతంగా లేస్తున్నారు. కొందరు ఇంకాసేపు ఆగి గుద్దాంలే అని, తమకి తామే సర్దిచెప్పుకుంటూ మళ్ళీ నిద్రలోకి జారుకుంటున్నారు. శుక్రవారం అందునా శ్రావణ మాసంలో వచ్చే మొదటి శుక్రవారం కూడా కావడంతో, కొందరు ఆడవాళ్ళు మాత్రం ఈ వర్షం, చలిని లెక్కచేయకుండా పూజలు చేసి, లక్ష్మీదేవిని ఇంప్రెస్ చేయాల్సిందే, అని పట్టు వదలకుండా లేచి తల స్నానాలు మొదలు పెట్టారు. ఇలా ఎవరి పనిలో వాళ్ళు ఉన్నారు. జూబ్లీహిల్స్ పక్కన ఉన్న బస్తీలో ఒక చిన్న మూడు అంతస్తుల భవనం ఉంది. చెప్పుకోవడానికి మూడంతస్తుల భవనమే, కాని ఒక్కో అంతస్తులో ఇరికించి కట్టిన సింగల్ బెడ్రూమ్ ఫ్లాట్ ఉంది. దాని గోడలు పెచ్చులు ఊడిపోయి ఉన్నాయి. రాత్రి నుండి కురుస్తున్న వర్షం వలన ఆ మూడవ అంతస్తు పైన ఉన్న స్లాబ్ మధ్యలో ఉన్న సన్నని రంధ్రం గుండా కారుతున్న వర్షం నీరు, ఇంటి హాల్ నడి మధ్యలో పెట్టి ఉన్న పాత గిన్నెలో పడుతూ ఉంది. ఆ గిన్నెలో కారే ఒకో చినుకు టక్టాక్ మంటూ.................© 2017,www.logili.com All Rights Reserved.