బాల్యం, యవ్వనం
కార్ల్ మార్క్స్ ప్రష్యాలో, రైస్ రాష్ట్రంలోని ట్రియర్ పట్టణంలో 1818 మే 5న జన్మించారు. * 1815కు మునుపు దాదాపు రెండు దశాబ్దాలపాటు రైన్ ఫ్రాన్స్లో భాగంగా ఉండేది. 1790వ దశకంలో ఫ్రెంచ్ విప్లవం సైన్యం రైన్ ప్రాంతంలోని రాజవంశానికీ, మత పీఠానికీ చెందిన ఫ్యూడల్ భూస్వాముల ఆస్తులను జప్తుచేసి, ఫ్యూడల్ పన్నులను తొలగించివేసింది. జర్మనీలో తొలి ఫ్యాక్టరీలు వెలిసినదీ, వాటితోపాటు పారిశ్రామిక బూర్జువా వర్గము, కార్మికవర్గమూ అన్న రెండు కొత్త వర్గాలు ఆవిర్భవించినదీ ఈ ప్రాంతంలోనే. 18వ శతాబ్ది ఆఖరు రోజుల్లోని ఫ్రెంచి బూర్జువా విప్లవం వల్ల ఈ రాష్ట్రంలో చేకూరిన సత్ఫలితాలను తుడిచిపెట్టడానికి ప్రష్యా ప్రభుత్వం సాహసించలేదు; కాని దాని పోలీస్ - నిరంకుశాధికారవర్గ పాలన రైన్ బూర్జువా వర్గాన్ని నొక్కి పెట్టింది.
రోమన్లు స్థాపించిన ట్రియర్ పట్టణంలో ప్రాచీన, మధ్యయుగాల చారిత్రక అవశేషాలు అనేకం ఉండేవి. గత కాలపు కట్టడాలే కాకుండా ఎన్నో చర్చీలు ఆ పట్టణానికి ఒక ప్రత్యేకతను సంతరించాయి. దాని వీధుల్లో బికారులైన చేతివృత్తులవారు, రైతులు తరచూ తటస్థపడేవారు. మార్క్స్ చిన్ననాటినుండీనే సామాజిక వైరుధ్యాల మధ్య పెరిగారు.
ఆయన తండ్రి హీన్రెచ్ మార్క్స్, ట్రియర్లో న్యాయవాదీ; స్థానిక న్యాయవాది సంఘానికి ఎన్నికైన అధిపతీ. ఉన్నత విద్యా, ఉదారస్వభావం, ప్రగతిశీల తాత్విక దృక్పథం గల ఆయన విజ్ఞానవాద, మానవతా భావాలున్న వ్యక్తి. ప్రముఖ జర్మన్ రచయిత లెస్సింగ్ రచనలు, ఫ్రెంచి విజ్ఞానవాదులైన వాల్తేర్, రూసో రచనలు ఆయనకు ఎంతో అభిమాన పాత్రమైనవి.
కార్ల్ మార్క్క తన తండ్రిపట్ల ఎంతో గౌరవభావముండేది. తరువాతి కాలంలో * 1815లో ప్రష్యా జర్మన్ సమాఖ్యలో చేరింది. 38 సంస్థానాలూ, రాజ్యాలూ, నాలుగు స్వేచ్ఛా నగరాలతో ఇది ఏర్పడ్డది.......................
బాల్యం, యవ్వనం కార్ల్ మార్క్స్ ప్రష్యాలో, రైస్ రాష్ట్రంలోని ట్రియర్ పట్టణంలో 1818 మే 5న జన్మించారు. * 1815కు మునుపు దాదాపు రెండు దశాబ్దాలపాటు రైన్ ఫ్రాన్స్లో భాగంగా ఉండేది. 1790వ దశకంలో ఫ్రెంచ్ విప్లవం సైన్యం రైన్ ప్రాంతంలోని రాజవంశానికీ, మత పీఠానికీ చెందిన ఫ్యూడల్ భూస్వాముల ఆస్తులను జప్తుచేసి, ఫ్యూడల్ పన్నులను తొలగించివేసింది. జర్మనీలో తొలి ఫ్యాక్టరీలు వెలిసినదీ, వాటితోపాటు పారిశ్రామిక బూర్జువా వర్గము, కార్మికవర్గమూ అన్న రెండు కొత్త వర్గాలు ఆవిర్భవించినదీ ఈ ప్రాంతంలోనే. 18వ శతాబ్ది ఆఖరు రోజుల్లోని ఫ్రెంచి బూర్జువా విప్లవం వల్ల ఈ రాష్ట్రంలో చేకూరిన సత్ఫలితాలను తుడిచిపెట్టడానికి ప్రష్యా ప్రభుత్వం సాహసించలేదు; కాని దాని పోలీస్ - నిరంకుశాధికారవర్గ పాలన రైన్ బూర్జువా వర్గాన్ని నొక్కి పెట్టింది. రోమన్లు స్థాపించిన ట్రియర్ పట్టణంలో ప్రాచీన, మధ్యయుగాల చారిత్రక అవశేషాలు అనేకం ఉండేవి. గత కాలపు కట్టడాలే కాకుండా ఎన్నో చర్చీలు ఆ పట్టణానికి ఒక ప్రత్యేకతను సంతరించాయి. దాని వీధుల్లో బికారులైన చేతివృత్తులవారు, రైతులు తరచూ తటస్థపడేవారు. మార్క్స్ చిన్ననాటినుండీనే సామాజిక వైరుధ్యాల మధ్య పెరిగారు. ఆయన తండ్రి హీన్రెచ్ మార్క్స్, ట్రియర్లో న్యాయవాదీ; స్థానిక న్యాయవాది సంఘానికి ఎన్నికైన అధిపతీ. ఉన్నత విద్యా, ఉదారస్వభావం, ప్రగతిశీల తాత్విక దృక్పథం గల ఆయన విజ్ఞానవాద, మానవతా భావాలున్న వ్యక్తి. ప్రముఖ జర్మన్ రచయిత లెస్సింగ్ రచనలు, ఫ్రెంచి విజ్ఞానవాదులైన వాల్తేర్, రూసో రచనలు ఆయనకు ఎంతో అభిమాన పాత్రమైనవి. కార్ల్ మార్క్క తన తండ్రిపట్ల ఎంతో గౌరవభావముండేది. తరువాతి కాలంలో * 1815లో ప్రష్యా జర్మన్ సమాఖ్యలో చేరింది. 38 సంస్థానాలూ, రాజ్యాలూ, నాలుగు స్వేచ్ఛా నగరాలతో ఇది ఏర్పడ్డది.......................© 2017,www.logili.com All Rights Reserved.