విప్లవాల శతాబ్ది ఎవరి శతాబ్ది? ఎవరి సహస్రాబ్ది?
ఆధునిక నాగరికతకు అనేక లక్షణాలున్నాయి. కొన్ని సానుకూలమైనవి, మరి కొన్ని ప్రతికూలమైనవి. ఇరవయ్యవ శతాబ్దికి కొన్ని ప్రత్యేకమైన లక్షణాలు ఉన్నాయి. అవి గతంలో ఉండకపోయి ఉండవచ్చు, లేదా గతంలోనివే గుర్తించవీలులేనంతగా మారిపోయి ఉండవచ్చు. అత్యధిక కథనాలు శాస్త్ర, సాంకేతిక విజ్ఞాన అంశాలను ముందుకు తీసుకు వస్తాయి. అవేవీ కొత్తగా ఉద్భవించినవి కావు. ఈ శతాబ్దంలో పుట్టినవి కావు. అవి గత శతాబ్దపు చివర్లో వూహించలేనంతగా మానవజాతి జీవన విధానాన్ని మార్పు చెందించాయి. ఉదాహరణకు ఇరవయ్యో శతాబ్దంలో ఉత్పత్తి శక్తులు మరింత గొప్పగా అభివృద్ధి చెందాయని అంచనా వేయబడింది. ఆ విధంగా గత శతాబ్దాలు, సహస్రాబ్దిలు అన్నింటిలో కన్నా ఎక్కువగా సంపద సృష్టించే మానశ శక్తి సామర్థ్యాలు 20వ శతాబ్దంలో పెరిగి పోయాయి. ఈ త్వరిత పురోగతి పారిశ్రామికాభివృద్ధి లోను, సమాచార సాంకేతిక విజ్ఞానపు అభివృద్ధిలోను స్పష్టంగా కనిపిస్తుంది. వ్యవసాయంలో సైతం నాటకీయమైన మార్పులు సంభవించాయి. గత కాలంలో మాదిరి స్థానిక వినియోగం కోసం, పారిశ్రామికేతర పద్దతుల్లో పండించే రైతు నేడు, ప్రపంచంలోని అత్యధిక దేశాల్లో అదృశ్యమవుతున్న తరగతిగా మారిపోయాడు. ఈ విజయాలకు మరొక అంచున, ప్రకృతి పర్యావరణానికి సాంకేతిక మార్పు తెచ్చిపెట్టే విధ్వంసక ఫలితాలు కూడ పొంచి చూస్తున్నాయి. ప్రపంచ చరిత్రలోనే మొట్టమొదటి సారి, ఈ భూగోళంపై జీవజాతులు అదృశ్యమవుతాయా, అసలు భూగోళమే ఈ విధ్వంసాన్ని తట్టుకుంటుందా, లేక అంతర్ధానమవుతుందా అన్న పరిస్థితి తలెత్తింది. కొందరు తమ తమ అభిరుచికి.....................
విప్లవాల శతాబ్ది ఎవరి శతాబ్ది? ఎవరి సహస్రాబ్ది? ఆధునిక నాగరికతకు అనేక లక్షణాలున్నాయి. కొన్ని సానుకూలమైనవి, మరి కొన్ని ప్రతికూలమైనవి. ఇరవయ్యవ శతాబ్దికి కొన్ని ప్రత్యేకమైన లక్షణాలు ఉన్నాయి. అవి గతంలో ఉండకపోయి ఉండవచ్చు, లేదా గతంలోనివే గుర్తించవీలులేనంతగా మారిపోయి ఉండవచ్చు. అత్యధిక కథనాలు శాస్త్ర, సాంకేతిక విజ్ఞాన అంశాలను ముందుకు తీసుకు వస్తాయి. అవేవీ కొత్తగా ఉద్భవించినవి కావు. ఈ శతాబ్దంలో పుట్టినవి కావు. అవి గత శతాబ్దపు చివర్లో వూహించలేనంతగా మానవజాతి జీవన విధానాన్ని మార్పు చెందించాయి. ఉదాహరణకు ఇరవయ్యో శతాబ్దంలో ఉత్పత్తి శక్తులు మరింత గొప్పగా అభివృద్ధి చెందాయని అంచనా వేయబడింది. ఆ విధంగా గత శతాబ్దాలు, సహస్రాబ్దిలు అన్నింటిలో కన్నా ఎక్కువగా సంపద సృష్టించే మానశ శక్తి సామర్థ్యాలు 20వ శతాబ్దంలో పెరిగి పోయాయి. ఈ త్వరిత పురోగతి పారిశ్రామికాభివృద్ధి లోను, సమాచార సాంకేతిక విజ్ఞానపు అభివృద్ధిలోను స్పష్టంగా కనిపిస్తుంది. వ్యవసాయంలో సైతం నాటకీయమైన మార్పులు సంభవించాయి. గత కాలంలో మాదిరి స్థానిక వినియోగం కోసం, పారిశ్రామికేతర పద్దతుల్లో పండించే రైతు నేడు, ప్రపంచంలోని అత్యధిక దేశాల్లో అదృశ్యమవుతున్న తరగతిగా మారిపోయాడు. ఈ విజయాలకు మరొక అంచున, ప్రకృతి పర్యావరణానికి సాంకేతిక మార్పు తెచ్చిపెట్టే విధ్వంసక ఫలితాలు కూడ పొంచి చూస్తున్నాయి. ప్రపంచ చరిత్రలోనే మొట్టమొదటి సారి, ఈ భూగోళంపై జీవజాతులు అదృశ్యమవుతాయా, అసలు భూగోళమే ఈ విధ్వంసాన్ని తట్టుకుంటుందా, లేక అంతర్ధానమవుతుందా అన్న పరిస్థితి తలెత్తింది. కొందరు తమ తమ అభిరుచికి.....................© 2017,www.logili.com All Rights Reserved.