మృతదేహం మీదున్న కాగితంపై పెన్సిల్తో మూడు పదాలు రాసున్నాయ్. వాటర్ధమేంటో ఎర్లెండరికి తెలీలేదు.
చనిపోయిన వ్యక్తికి దాదాపు 70 ఏళ్ళుంటాయ్. ఒక చిన్న గదిలో, సోఫాకెదురుగా, కుడివైపు ఫ్లోర్పై పడున్నాడు. నీలం రంగు షర్ట్, లేత గోధుమరంగు కార్డాయ్ ప్యాంట్స్ వేసుకున్నాడు. పాదాలకు చెప్పులున్నాయ్. తలంతా దాదాపుగా నెరిసింది; జుట్టు పలుచనవుతోంది కూడా. తలకి పెద్ద గాయమవడంతో, జుట్టు రక్తంతో తడిసి ఎర్రగా అయింది. మృతదేహానికి కొంత దూరంలో, ఫ్లోర్పై, పదునైన కార్నర్స్ ఉన్న ఒక పెద్ద గ్లాస్ యాష్ ట్రే పడుంది; అది కూడా రక్తమయమైంది. పక్కనే కాఫీ టేబుల్ తలకిందులుగా పడుంది.
నార్గుర్హిరిలో, రెండంతస్తుల ఇంట్లో ఉన్న బేస్మెంట్ ఫ్లాట్ ఇది. చుట్టూ ఒక చిన్న తోట, మూడు వైపులా రాతి గోడలున్నాయ్. చెట్ల నుండి రాలిన ఆకులు తోటలో తివాచీలా పరచుకున్నాయ్. మెలితిరిగిన చెట్ల కొమ్మలు ఆకాశంలో అలుముకున్న చీకటిని అందుకోడానికి ప్రయత్నిస్తున్నాయ్. గ్యారేజ్కెళ్ళే కంకర రోడ్డు గుండా రేక్య వీక్ సీఐడీ అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుంటున్నారు. ఇంకొంతసేపట్లో జిల్లా వైద్యాధికారి వచ్చి డెత్ సర్టిఫికెట్పై సంతకం చేస్తాడు. దాదాపు 15 నిమిషాల ముందు మృతదేహాన్ని కనుగొన్నట్లు రిపోర్ట్ వచ్చింది. రేక్యవీక్ పోలీస్ డిటెక్టివ్ ఇన్స్పెక్టర్.....................
మృతదేహం మీదున్న కాగితంపై పెన్సిల్తో మూడు పదాలు రాసున్నాయ్. వాటర్ధమేంటో ఎర్లెండరికి తెలీలేదు. చనిపోయిన వ్యక్తికి దాదాపు 70 ఏళ్ళుంటాయ్. ఒక చిన్న గదిలో, సోఫాకెదురుగా, కుడివైపు ఫ్లోర్పై పడున్నాడు. నీలం రంగు షర్ట్, లేత గోధుమరంగు కార్డాయ్ ప్యాంట్స్ వేసుకున్నాడు. పాదాలకు చెప్పులున్నాయ్. తలంతా దాదాపుగా నెరిసింది; జుట్టు పలుచనవుతోంది కూడా. తలకి పెద్ద గాయమవడంతో, జుట్టు రక్తంతో తడిసి ఎర్రగా అయింది. మృతదేహానికి కొంత దూరంలో, ఫ్లోర్పై, పదునైన కార్నర్స్ ఉన్న ఒక పెద్ద గ్లాస్ యాష్ ట్రే పడుంది; అది కూడా రక్తమయమైంది. పక్కనే కాఫీ టేబుల్ తలకిందులుగా పడుంది. నార్గుర్హిరిలో, రెండంతస్తుల ఇంట్లో ఉన్న బేస్మెంట్ ఫ్లాట్ ఇది. చుట్టూ ఒక చిన్న తోట, మూడు వైపులా రాతి గోడలున్నాయ్. చెట్ల నుండి రాలిన ఆకులు తోటలో తివాచీలా పరచుకున్నాయ్. మెలితిరిగిన చెట్ల కొమ్మలు ఆకాశంలో అలుముకున్న చీకటిని అందుకోడానికి ప్రయత్నిస్తున్నాయ్. గ్యారేజ్కెళ్ళే కంకర రోడ్డు గుండా రేక్య వీక్ సీఐడీ అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుంటున్నారు. ఇంకొంతసేపట్లో జిల్లా వైద్యాధికారి వచ్చి డెత్ సర్టిఫికెట్పై సంతకం చేస్తాడు. దాదాపు 15 నిమిషాల ముందు మృతదేహాన్ని కనుగొన్నట్లు రిపోర్ట్ వచ్చింది. రేక్యవీక్ పోలీస్ డిటెక్టివ్ ఇన్స్పెక్టర్.....................© 2017,www.logili.com All Rights Reserved.