కొన్ని సంవత్సరాల క్రితం తమిళనాడులో కన్యాకుమారి పక్కనే ఉన్న తిరునవ్వేలి జిల్లాలో నేను ప్రభుత్వోద్యోగిగా పని చేసేవాడిని. ఎంతో ఆనందంగా రోజులు గడిచి పోతున్నాయి. ఏడు సంవత్సరాల క్రితం శాంతాక్రజ్ విమానాశ్రయం నుండి విమానంలో ఢిల్లీకి వెళ్తున్నప్పుడు ఎన్నికల సమయంలో ఒకవేళ నాకు ఏదైనా నక్సలైట్ల చోట్లు తటస్థపడితే! అక్కడ భయంకరమైన సమస్యలు, పరిస్థితులు ఉంటాయి. ఈ ఆలోచన ఒక్కసారిగా మెరుపై ఉరుమై తలఎత్తింది.
విమానంలో నా సీట్లో కూర్చున్నాను. కాళ్ళు కొంచెం బారజాపాను. ఈ ఆలోచన నాలో గట్టి పడింది. నక్సలైట్ల భయం గొలిపే నల్లనినీడ కమ్ముకున్న ఛత్తీస్గఢ్క నన్ను పంపిస్తే?
నేను ఈ ఆలోచనలలో మునిగిపోతున్నాను. ఇంతలో నా కళ్ళ ఎదురుగుండా 2013, మే 25న జరిగిన రక్తపాతంతో అందరినీ గడగడలాడించిన భయంకరమైన సంఘటన కదలాడ సాగింది. అక్కడ దట్టంగా చెట్లు, చేమలు, ఆకులు అలములతో నిండుకున్న ఆకుపచ్చటి అడివిలో కాంగ్రెస్ పార్టీ 'పరివర్తన్ యాత్ర' ముందుకు నడుస్తోంది. ఆ సమయంలో నక్సలైట్లు యుఎస్ఆర్, ఎ.కె. 47 మొదలైన ఆధునిక ఆయుధాలతో, గ్రెనైడ్లతో అరణ్యాన్ని అదర గొట్టారు. పొద్దువాలుతున్న సంధ్య ఎర్రెర్రగా ఉంది. ఆకుపచ్చటి అడవి అప్పుడే స్నానం చేసిందా అని అనిపిస్తోంది. అందమైన అరణ్యాన్ని నక్సలైట్లు బుగ్గిపాలు చేశారు. అంతటా పైకెగిసే మంటలు - హాలీవుడ్ సినిమాలో చూపించే వియత్నాం యుద్ధంలా ఆ దృశ్యం కళ్ళ ఎదురుకుండా కదలాడ సాగింది. అంతటా భగభగా మండుతున్న మంటలు. ఆ ఆకుపచ్చటి అడవిలో నల్లటి పాములు నడయాడుతున్నట్లుగా దారి.... ఆ బాట పైన సగం సగం కాలిన విరిగి ముక్కలైన పిల్లలు ఆడుకునే బొమ్మల్లా వాహనాలు... గుళ్ళ వర్షం వల్ల వాహనాల కిటికీలకు, స్క్రీన్, విండీస్క్రీన్లలో పడ్డ చిల్లులు. లెక్కపెట్ట లేనన్ని చిల్లులు... సగం సగం ఒరిగిపోయిన వాహనం. తెరుచుకున్న తలుపులలో నుండి మాజీ కేంద్రమంత్రి విద్యాచరణ్ శుక్లా బయటకి వస్తున్నారు. దాదాపు 8 సం॥ల క్రితం జరిగిన సంఘటన. ఆయన ముఖంలో బాధ - భయం వ్యక్తం అవుతున్నాయి.................
కొన్ని సంవత్సరాల క్రితం తమిళనాడులో కన్యాకుమారి పక్కనే ఉన్న తిరునవ్వేలి జిల్లాలో నేను ప్రభుత్వోద్యోగిగా పని చేసేవాడిని. ఎంతో ఆనందంగా రోజులు గడిచి పోతున్నాయి. ఏడు సంవత్సరాల క్రితం శాంతాక్రజ్ విమానాశ్రయం నుండి విమానంలో ఢిల్లీకి వెళ్తున్నప్పుడు ఎన్నికల సమయంలో ఒకవేళ నాకు ఏదైనా నక్సలైట్ల చోట్లు తటస్థపడితే! అక్కడ భయంకరమైన సమస్యలు, పరిస్థితులు ఉంటాయి. ఈ ఆలోచన ఒక్కసారిగా మెరుపై ఉరుమై తలఎత్తింది. విమానంలో నా సీట్లో కూర్చున్నాను. కాళ్ళు కొంచెం బారజాపాను. ఈ ఆలోచన నాలో గట్టి పడింది. నక్సలైట్ల భయం గొలిపే నల్లనినీడ కమ్ముకున్న ఛత్తీస్గఢ్క నన్ను పంపిస్తే? నేను ఈ ఆలోచనలలో మునిగిపోతున్నాను. ఇంతలో నా కళ్ళ ఎదురుగుండా 2013, మే 25న జరిగిన రక్తపాతంతో అందరినీ గడగడలాడించిన భయంకరమైన సంఘటన కదలాడ సాగింది. అక్కడ దట్టంగా చెట్లు, చేమలు, ఆకులు అలములతో నిండుకున్న ఆకుపచ్చటి అడివిలో కాంగ్రెస్ పార్టీ 'పరివర్తన్ యాత్ర' ముందుకు నడుస్తోంది. ఆ సమయంలో నక్సలైట్లు యుఎస్ఆర్, ఎ.కె. 47 మొదలైన ఆధునిక ఆయుధాలతో, గ్రెనైడ్లతో అరణ్యాన్ని అదర గొట్టారు. పొద్దువాలుతున్న సంధ్య ఎర్రెర్రగా ఉంది. ఆకుపచ్చటి అడవి అప్పుడే స్నానం చేసిందా అని అనిపిస్తోంది. అందమైన అరణ్యాన్ని నక్సలైట్లు బుగ్గిపాలు చేశారు. అంతటా పైకెగిసే మంటలు - హాలీవుడ్ సినిమాలో చూపించే వియత్నాం యుద్ధంలా ఆ దృశ్యం కళ్ళ ఎదురుకుండా కదలాడ సాగింది. అంతటా భగభగా మండుతున్న మంటలు. ఆ ఆకుపచ్చటి అడవిలో నల్లటి పాములు నడయాడుతున్నట్లుగా దారి.... ఆ బాట పైన సగం సగం కాలిన విరిగి ముక్కలైన పిల్లలు ఆడుకునే బొమ్మల్లా వాహనాలు... గుళ్ళ వర్షం వల్ల వాహనాల కిటికీలకు, స్క్రీన్, విండీస్క్రీన్లలో పడ్డ చిల్లులు. లెక్కపెట్ట లేనన్ని చిల్లులు... సగం సగం ఒరిగిపోయిన వాహనం. తెరుచుకున్న తలుపులలో నుండి మాజీ కేంద్రమంత్రి విద్యాచరణ్ శుక్లా బయటకి వస్తున్నారు. దాదాపు 8 సం॥ల క్రితం జరిగిన సంఘటన. ఆయన ముఖంలో బాధ - భయం వ్యక్తం అవుతున్నాయి.................© 2017,www.logili.com All Rights Reserved.