గుట్టు
భువనేశ్వరి ఒరిస్సా రాజధాని భువనేశ్వర్ నించి, హైద్రాబాద్ లోని దాదాపు ఐదువేల మంది పనిచేసే ఓ కేంద్ర ప్రభుత్వ కార్యాలయానికి బదిలీ అయి వచ్చింది. చూడగానే కళ్ళు తిప్పుకోలేని అందం ఆవిడది. ఆవిడ అందంలో, అలంకరణలో పవిత్రత తప్ప అశ్లీలత కానీ, రెచ్చకొట్టే ఛాయలు కాని మచ్చుకైనా కనిపించవు.
భువనేశ్వరి అంటీ అంటనట్లుగా కాక, ఆ ఆఫీసులోని అందరి మనసులకి దగ్గరగా రావడంతో వచ్చిన నెలకల్లా అందరికీ 'ఆంటీ' అయిపోయింది. తమ వ్యక్తిగత సమస్యలని ఆవిడకి చెప్తే చక్కటి పరిష్కారం సూచిస్తుందని క్రమంగా అందరికీ అర్థమవసాగింది.
భువనేశ్వరి నిద్ర లేవగానే బ్రాహ్మీ ముహూర్తంలో, అంటే తెల్లవారుఝామున ధ్యానం చేస్తుందని, ఆ ధాన్యంలో ఆవిడకి ఎన్నో కొత్త విషయాలు తెలుస్తూంటాయని అంతా అనుకోసాగారు. 'ఇది నిజమేనా?' అని ఎవరైనా అడిగితే, ఎప్పుడూ మొహంలో చిరునవ్వు చెక్కుచెదరని భువనేశ్వరి ఆంటీ 'ఇలాంటివి నువ్వు అడక్కూడదు' అనేస్తుంది.
తమ సెక్షన్లో పనిచేసే పైలాకి, ఆమె భర్తకి చాలాకాలంగా ఎడమోహం, పెడమోహం. వాళ్ళిద్దరినీ ఆంటీ తన సలహాతో కలిపిందన్న సంగతి జయత్ర చెవిన పడింది. దాంతో ఆమె పైలా దగ్గరకి వెళ్ళి 'నే విన్నది నిజమేనా?' అని అడిగితే ఏం విన్నావని కూడా అడక్కుండా 'నిజమే' అన్నది.....................
గుట్టు భువనేశ్వరి ఒరిస్సా రాజధాని భువనేశ్వర్ నించి, హైద్రాబాద్ లోని దాదాపు ఐదువేల మంది పనిచేసే ఓ కేంద్ర ప్రభుత్వ కార్యాలయానికి బదిలీ అయి వచ్చింది. చూడగానే కళ్ళు తిప్పుకోలేని అందం ఆవిడది. ఆవిడ అందంలో, అలంకరణలో పవిత్రత తప్ప అశ్లీలత కానీ, రెచ్చకొట్టే ఛాయలు కాని మచ్చుకైనా కనిపించవు. భువనేశ్వరి అంటీ అంటనట్లుగా కాక, ఆ ఆఫీసులోని అందరి మనసులకి దగ్గరగా రావడంతో వచ్చిన నెలకల్లా అందరికీ 'ఆంటీ' అయిపోయింది. తమ వ్యక్తిగత సమస్యలని ఆవిడకి చెప్తే చక్కటి పరిష్కారం సూచిస్తుందని క్రమంగా అందరికీ అర్థమవసాగింది. భువనేశ్వరి నిద్ర లేవగానే బ్రాహ్మీ ముహూర్తంలో, అంటే తెల్లవారుఝామున ధ్యానం చేస్తుందని, ఆ ధాన్యంలో ఆవిడకి ఎన్నో కొత్త విషయాలు తెలుస్తూంటాయని అంతా అనుకోసాగారు. 'ఇది నిజమేనా?' అని ఎవరైనా అడిగితే, ఎప్పుడూ మొహంలో చిరునవ్వు చెక్కుచెదరని భువనేశ్వరి ఆంటీ 'ఇలాంటివి నువ్వు అడక్కూడదు' అనేస్తుంది. తమ సెక్షన్లో పనిచేసే పైలాకి, ఆమె భర్తకి చాలాకాలంగా ఎడమోహం, పెడమోహం. వాళ్ళిద్దరినీ ఆంటీ తన సలహాతో కలిపిందన్న సంగతి జయత్ర చెవిన పడింది. దాంతో ఆమె పైలా దగ్గరకి వెళ్ళి 'నే విన్నది నిజమేనా?' అని అడిగితే ఏం విన్నావని కూడా అడక్కుండా 'నిజమే' అన్నది.....................© 2017,www.logili.com All Rights Reserved.