వేగుచుక్కకు విప్లవ నివాళి
సంవత్సరాల తరబడి జడపదార్థాలుగా నిలిచిపోయినవారు రాజకీయ సంక్షుభిత వాతావరణంలో రోజులలోనే చైతన్యవంతులవుతారని లెనిన్ ఒకసారి చెప్పారు. దేశం కోసం త్యాగం చెయ్యాలనే పట్టుదల, దీక్ష గల కుటుంబంలో జన్మించిన భగత్ సింగ్ అతి చిన్న వయసులోనే దేశం గురించి తీవ్రంగా ఆలోచించాడు.
అతితక్కువ సమయంలోనే టెర్రరిస్టుదశ నుండి ప్రజావిప్లవకారునిగా అభివృద్ధి అయ్యాడు. జాతీయవాదిస్థాయి నుండి కార్మిక, కర్షక రాజ్యాన్ని కోరే సోషలిస్టుగా మార్పు చెందాడు. మతవిశ్వాసాల ముళ్ళకంచెల నుండి విముక్తి చెంది మార్క్సిస్టు భౌతికవాదాన్ని జీర్ణించుకున్నాడు. ఆయనకు ముందు కృషి చేసిన విప్లవకారులలోలేని ఈ విశిష్టత, ప్రత్యేకతలే ఆయన్ని విప్లవానికి వేగుచుక్కగా నిలిపాయి.
భగత్సింగు, ఆయన సహచరులను కేవలం టెర్రరిస్టుగానే ఇంతకాలం బ్రిటీషు పాలకులూ, కాంగ్రెసు నాయకులూ ప్రచారం చేస్తూ వచ్చారు. గాంధీ సిద్ధాంతాన్ని అన్ని కోణాల నుంచి ఖండించినవాడు భగత్ సింగ్. అందుకే భగత్ సింగ్ విశ్వరూపాన్ని భారత ప్రజలకు, ముఖ్యంగా యువతరానికి తెలియనీయకుండా పాలకులు కుట్రలు చేస్తున్నారు.
భగత్ సింగ్కు నివాళులర్పించేవారికి నిజాయితీ వుంటే ఆయన రచనలను పాఠ్యాంశాలుగా చేర్చి విద్యార్థులకు బోధించమని కోరండి!
భగత్ సింగ్ ఇన్ని రచనలు చేసిన సంగతి నిన్నటిదాకా తెలుగు పాఠకులకు తెలియదు. ఆయన విప్లవోత్తేజాన్నందించే త్యాగమూర్తిగానే మనకు తెలుసు. కానీ ఈ గ్రంథం చూచిన తర్వాత స్పష్టమైన రాజకీయ దృక్పథం కల్గిన క్రాంతదర్శిగా ఆయన మనముందు భాసిస్తాడు.
ఇటీవలే 'భగత్ సింగ్ వీలునామా' అనే చిన్న పుస్తకం తెలుగులో వెలువడింది. నిజానికి ఆ వ్యాసం శీర్షిక 'భారతజాతీయ విముక్తి పోరాటం-దిశలు'. వీలునామా................
వేగుచుక్కకు విప్లవ నివాళి సంవత్సరాల తరబడి జడపదార్థాలుగా నిలిచిపోయినవారు రాజకీయ సంక్షుభిత వాతావరణంలో రోజులలోనే చైతన్యవంతులవుతారని లెనిన్ ఒకసారి చెప్పారు. దేశం కోసం త్యాగం చెయ్యాలనే పట్టుదల, దీక్ష గల కుటుంబంలో జన్మించిన భగత్ సింగ్ అతి చిన్న వయసులోనే దేశం గురించి తీవ్రంగా ఆలోచించాడు. అతితక్కువ సమయంలోనే టెర్రరిస్టుదశ నుండి ప్రజావిప్లవకారునిగా అభివృద్ధి అయ్యాడు. జాతీయవాదిస్థాయి నుండి కార్మిక, కర్షక రాజ్యాన్ని కోరే సోషలిస్టుగా మార్పు చెందాడు. మతవిశ్వాసాల ముళ్ళకంచెల నుండి విముక్తి చెంది మార్క్సిస్టు భౌతికవాదాన్ని జీర్ణించుకున్నాడు. ఆయనకు ముందు కృషి చేసిన విప్లవకారులలోలేని ఈ విశిష్టత, ప్రత్యేకతలే ఆయన్ని విప్లవానికి వేగుచుక్కగా నిలిపాయి. భగత్సింగు, ఆయన సహచరులను కేవలం టెర్రరిస్టుగానే ఇంతకాలం బ్రిటీషు పాలకులూ, కాంగ్రెసు నాయకులూ ప్రచారం చేస్తూ వచ్చారు. గాంధీ సిద్ధాంతాన్ని అన్ని కోణాల నుంచి ఖండించినవాడు భగత్ సింగ్. అందుకే భగత్ సింగ్ విశ్వరూపాన్ని భారత ప్రజలకు, ముఖ్యంగా యువతరానికి తెలియనీయకుండా పాలకులు కుట్రలు చేస్తున్నారు. భగత్ సింగ్కు నివాళులర్పించేవారికి నిజాయితీ వుంటే ఆయన రచనలను పాఠ్యాంశాలుగా చేర్చి విద్యార్థులకు బోధించమని కోరండి! భగత్ సింగ్ ఇన్ని రచనలు చేసిన సంగతి నిన్నటిదాకా తెలుగు పాఠకులకు తెలియదు. ఆయన విప్లవోత్తేజాన్నందించే త్యాగమూర్తిగానే మనకు తెలుసు. కానీ ఈ గ్రంథం చూచిన తర్వాత స్పష్టమైన రాజకీయ దృక్పథం కల్గిన క్రాంతదర్శిగా ఆయన మనముందు భాసిస్తాడు. ఇటీవలే 'భగత్ సింగ్ వీలునామా' అనే చిన్న పుస్తకం తెలుగులో వెలువడింది. నిజానికి ఆ వ్యాసం శీర్షిక 'భారతజాతీయ విముక్తి పోరాటం-దిశలు'. వీలునామా................© 2017,www.logili.com All Rights Reserved.