ఆరంభం
విశాలమైన భూభాగంతో, కనువిందు చేసే ప్రకృతి సౌందర్యంతో, పశు సంపద - పాడిపంటలతో భారతదేశం వర్థిల్లుతోంది. ఇక్కడి సుగంధ ద్రవ్యాలు, ముత్యాలు, వజ్ర వైఢూర్యాలూ విదేశీ వ్యాపారుల ద్వారా ప్రపంచం అంతటా వ్యాప్తి చెంది, అందరి కళ్లూ భారతదేశం మీదనే నిలిచి ఉన్నాయి. విదేశీ పాలకుల రాజ్యకాంక్ష విస్తరించి, భారత ఉప ఖండం వైపు మళ్లీ మళ్లీ చొచ్చుకురావడం కొనసాగుతూనే ఉంది. మొఘలులు అప్పుడప్పుడే దక్షిణ భారత్లోకి వస్తున్న సమయం. పోర్చుగీస్ వాళ్ళు మలబారు తీరంలో అడుగు పెడుతున్న తరుణం.
దక్షిణ భారతదేశం అంతటా విజయనగర సామ్రాజ్యం విస్తరించి ఉంది. ఒకపక్క ప్రపంచాన్ని చైనాకి చెందిన 'మింగ్' రాజ్యం పాలిస్తోంది. మగవాళ్ళతో సమానంగా అక్కడక్కడ కొంతమంది ఆడవాళ్లు రాజ్యాలను ఏలుతున్నారు.
అదే 15వ శతాబ్దం.
భారతదేశంలో చాలా మార్పులు జరిగిన శతాబ్ది.
అదే కాలంలో తెలుగు నేల మీది కొంత భాగాన్ని కులశేఖర వంశం పరిపాలిస్తోంది. ఆ వంశంలో జన్మించిన శ్రీ హరివీర మహోదయ విజయ వర్మ పాలనలోనూ, ప్రజల సంక్షేమాన్ని పెంపొందించటంలోనూ ప్రసిద్ధి చెందాడు. శ్రీ హరివీర మహోదయ విజయ వర్మ గారి పితామహుడు ఆదిశేఖర రాజవర్మ కులశేఖర రాజ్యాన్ని 1440వ సంవత్సరంలో స్థాపించారు. ఆ రాజ్యం మొదటినుంచీ విజయ నగర సామ్రాజ్యంతో సన్నిహితంగా ఉంటూ, సైనిక, వాణిజ్య రంగాల్లో సహాయ సహకారాలు పొందటం ఆనవాయితీగా వస్తోంది. విజయనగర సామ్రాజ్యం...................
ఆరంభం విశాలమైన భూభాగంతో, కనువిందు చేసే ప్రకృతి సౌందర్యంతో, పశు సంపద - పాడిపంటలతో భారతదేశం వర్థిల్లుతోంది. ఇక్కడి సుగంధ ద్రవ్యాలు, ముత్యాలు, వజ్ర వైఢూర్యాలూ విదేశీ వ్యాపారుల ద్వారా ప్రపంచం అంతటా వ్యాప్తి చెంది, అందరి కళ్లూ భారతదేశం మీదనే నిలిచి ఉన్నాయి. విదేశీ పాలకుల రాజ్యకాంక్ష విస్తరించి, భారత ఉప ఖండం వైపు మళ్లీ మళ్లీ చొచ్చుకురావడం కొనసాగుతూనే ఉంది. మొఘలులు అప్పుడప్పుడే దక్షిణ భారత్లోకి వస్తున్న సమయం. పోర్చుగీస్ వాళ్ళు మలబారు తీరంలో అడుగు పెడుతున్న తరుణం. దక్షిణ భారతదేశం అంతటా విజయనగర సామ్రాజ్యం విస్తరించి ఉంది. ఒకపక్క ప్రపంచాన్ని చైనాకి చెందిన 'మింగ్' రాజ్యం పాలిస్తోంది. మగవాళ్ళతో సమానంగా అక్కడక్కడ కొంతమంది ఆడవాళ్లు రాజ్యాలను ఏలుతున్నారు. అదే 15వ శతాబ్దం. భారతదేశంలో చాలా మార్పులు జరిగిన శతాబ్ది. అదే కాలంలో తెలుగు నేల మీది కొంత భాగాన్ని కులశేఖర వంశం పరిపాలిస్తోంది. ఆ వంశంలో జన్మించిన శ్రీ హరివీర మహోదయ విజయ వర్మ పాలనలోనూ, ప్రజల సంక్షేమాన్ని పెంపొందించటంలోనూ ప్రసిద్ధి చెందాడు. శ్రీ హరివీర మహోదయ విజయ వర్మ గారి పితామహుడు ఆదిశేఖర రాజవర్మ కులశేఖర రాజ్యాన్ని 1440వ సంవత్సరంలో స్థాపించారు. ఆ రాజ్యం మొదటినుంచీ విజయ నగర సామ్రాజ్యంతో సన్నిహితంగా ఉంటూ, సైనిక, వాణిజ్య రంగాల్లో సహాయ సహకారాలు పొందటం ఆనవాయితీగా వస్తోంది. విజయనగర సామ్రాజ్యం...................© 2017,www.logili.com All Rights Reserved.