పరీక్షితు శాపం
నైమిశారణ్యంలో ఋషిగణాలు ఉండేవి. ఆ ఋషులకు కులపతి శౌనకమహాముని, ఆయన ఒకప్పుడు పన్నెండేళ్ళపాటు జరిగే సత్రయాగం చేశాడు. అనేకమంది మహాఋషులు కలిసి ఆ యాగం చేస్తూండగా అక్కడికి రోమహర్షణుడి కొడుకు ఉగ్రశ్రవసుడు అనే సూతుడు వచ్చాడు. సూతుడికి తెలియని పురాణగాథలు లేవు. సూతుణ్ణి చూడగానే మునులందరూ అతని చుట్టూ మూగి, "నువు ఎక్కడి నుంచి వస్తున్నావు? నువ్వు రావటం మాకెంతో సంతోషమయింది. నీ నుంచి మేము ఎన్నో పుణ్యకథలు వినవచ్చు." అన్నారు.
సూతుడు వారితో, "మహర్షులారా, పరీక్షితుడి కొడుకు జనమేజయుడు సర్పయాగం చేశాడు. ఆ సమయంలో జనమేజయుడికి వైశంపాయనుడు భారతకథలను చెప్పాడు. ఆ కథలను చెప్పినవాడు. వైశంపాయనుడి గురువైన వేదవ్యాసుడే, నేను ఆ కథలన్నీ విని, అనేక తీర్థాలు సేవించి, కౌరవ పాండవులు యుద్ధం చేసిన శమంతకపంచకం అనే పుణ్యక్షేత్రానికి వెళ్ళి, అటు నుంచి ఇలా వచ్చాను,” అన్నాడు. వ్యాసుడు రచించిన భారతకథలను తెలుసుకోవాలనే కుతూహలం మహర్షులకు కలిగింది. వాటిని తమకు చెప్పమని సూతుణ్ణి శౌనకాది మహామునులు కోరారు.
సూతుడు వారితో ఇలా చెప్పాడు: "భారతరచన ఎలా జరిగిందనుకున్నారు? కృష్ణద్వైపాయనుడు అనే పేరుగల వ్యాసుడు వేదాలను నాలుగుగా విభజించిన అనంతరం హిమాలయాల మీద తపస్సు చేశాడు. ధృతరాష్ట్రుడి తరంవారంతా చనిపోయాక భారతం ఆలోచించాడు. అది లోకానికంతకూ పఠనీయంగా ఉండేటట్టు చేసే మార్గమేమిటా అని ఆలోచిస్తూండగా ఆయనను చూడటానికి బ్రహ్మ వచ్చాడు. వ్యాసుడు బ్రహ్మకు ప్రణామం చేసి, కూర్చోబెట్టి, “దేవా, నేను వేదవేదాంగాల సారమంతా ఇమిడ్చి, భారతం అనే ఇతిహాసాన్ని రచించాను. ప్రజలు దాన్ని చదివి ఆనందించేటట్టుగా లిఖించేవాడెవడూ కనబడదు." అన్నాడు.
"నాయనా, విఘ్నేశ్వరుణ్ణి ప్రార్థించి, అతని ద్వారా నీ భారత ఇతిహాసాన్ని రాయించు," అని బ్రహ్మ వ్యాసుడికి సలహా ఇచ్చాడు.
వ్యాసుడు ధ్యానించగా విఘ్నేశ్వరుడు వచ్చాడు. వ్యాసుడు కోరిన ప్రకారం, ఆయన చెబుతూ ఉంటే విఘ్నేశ్వరుడు మహాభారతాన్ని లిఖించాడు. దాన్ని దేవలోకంలో నారదుడు, పితృలోకంలో దేవలుడనే అసితుడు, గంధర్వాదిలోకాలలో శుకుడు ప్రచారం చేశారు. జనమేజయుడు సర్పయాగం చేసినప్పుడు వైశంపాయనుడు దానినే పఠించి, భూలోకంలో ప్రచారంలోకి తెచ్చాడు.
శౌనకాది మునులు ఈ విషయాలు విని సంతోషించి, "కౌరవపాండవులు యుద్ధం చేసిన శమంతక పంచకం అనే క్షేత్రానికి ఆ పేరు ఎలా వచ్చింది?" అని సూతుణ్ణి అడిగారు.
బాలోత్సవ్ - 2025
మహాభారతం || 7
పరీక్షితు శాపం నైమిశారణ్యంలో ఋషిగణాలు ఉండేవి. ఆ ఋషులకు కులపతి శౌనకమహాముని, ఆయన ఒకప్పుడు పన్నెండేళ్ళపాటు జరిగే సత్రయాగం చేశాడు. అనేకమంది మహాఋషులు కలిసి ఆ యాగం చేస్తూండగా అక్కడికి రోమహర్షణుడి కొడుకు ఉగ్రశ్రవసుడు అనే సూతుడు వచ్చాడు. సూతుడికి తెలియని పురాణగాథలు లేవు. సూతుణ్ణి చూడగానే మునులందరూ అతని చుట్టూ మూగి, "నువు ఎక్కడి నుంచి వస్తున్నావు? నువ్వు రావటం మాకెంతో సంతోషమయింది. నీ నుంచి మేము ఎన్నో పుణ్యకథలు వినవచ్చు." అన్నారు. సూతుడు వారితో, "మహర్షులారా, పరీక్షితుడి కొడుకు జనమేజయుడు సర్పయాగం చేశాడు. ఆ సమయంలో జనమేజయుడికి వైశంపాయనుడు భారతకథలను చెప్పాడు. ఆ కథలను చెప్పినవాడు. వైశంపాయనుడి గురువైన వేదవ్యాసుడే, నేను ఆ కథలన్నీ విని, అనేక తీర్థాలు సేవించి, కౌరవ పాండవులు యుద్ధం చేసిన శమంతకపంచకం అనే పుణ్యక్షేత్రానికి వెళ్ళి, అటు నుంచి ఇలా వచ్చాను,” అన్నాడు. వ్యాసుడు రచించిన భారతకథలను తెలుసుకోవాలనే కుతూహలం మహర్షులకు కలిగింది. వాటిని తమకు చెప్పమని సూతుణ్ణి శౌనకాది మహామునులు కోరారు. సూతుడు వారితో ఇలా చెప్పాడు: "భారతరచన ఎలా జరిగిందనుకున్నారు? కృష్ణద్వైపాయనుడు అనే పేరుగల వ్యాసుడు వేదాలను నాలుగుగా విభజించిన అనంతరం హిమాలయాల మీద తపస్సు చేశాడు. ధృతరాష్ట్రుడి తరంవారంతా చనిపోయాక భారతం ఆలోచించాడు. అది లోకానికంతకూ పఠనీయంగా ఉండేటట్టు చేసే మార్గమేమిటా అని ఆలోచిస్తూండగా ఆయనను చూడటానికి బ్రహ్మ వచ్చాడు. వ్యాసుడు బ్రహ్మకు ప్రణామం చేసి, కూర్చోబెట్టి, “దేవా, నేను వేదవేదాంగాల సారమంతా ఇమిడ్చి, భారతం అనే ఇతిహాసాన్ని రచించాను. ప్రజలు దాన్ని చదివి ఆనందించేటట్టుగా లిఖించేవాడెవడూ కనబడదు." అన్నాడు. "నాయనా, విఘ్నేశ్వరుణ్ణి ప్రార్థించి, అతని ద్వారా నీ భారత ఇతిహాసాన్ని రాయించు," అని బ్రహ్మ వ్యాసుడికి సలహా ఇచ్చాడు. వ్యాసుడు ధ్యానించగా విఘ్నేశ్వరుడు వచ్చాడు. వ్యాసుడు కోరిన ప్రకారం, ఆయన చెబుతూ ఉంటే విఘ్నేశ్వరుడు మహాభారతాన్ని లిఖించాడు. దాన్ని దేవలోకంలో నారదుడు, పితృలోకంలో దేవలుడనే అసితుడు, గంధర్వాదిలోకాలలో శుకుడు ప్రచారం చేశారు. జనమేజయుడు సర్పయాగం చేసినప్పుడు వైశంపాయనుడు దానినే పఠించి, భూలోకంలో ప్రచారంలోకి తెచ్చాడు. శౌనకాది మునులు ఈ విషయాలు విని సంతోషించి, "కౌరవపాండవులు యుద్ధం చేసిన శమంతక పంచకం అనే క్షేత్రానికి ఆ పేరు ఎలా వచ్చింది?" అని సూతుణ్ణి అడిగారు. బాలోత్సవ్ - 2025 మహాభారతం || 7© 2017,www.logili.com All Rights Reserved.