లవ్
--- సంధ్య -
అరుణ్ నన్ను బ్యాంకునుంచి పిక్అప్ చేసుకున్నాడు.
ఈసారి ఒక పెద్ద కంపెనీ పార్టీ ఇస్తోంది. అక్కడికి ఎక్కువగా యువతీ యువకులే వస్తారు. వాళ్ళు తమతోపాటు ఒక్కో గెస్ట్ని కూడా తెచ్చుకోవచ్చు. అది అవటానికి న్యూయర్ పార్టీయే ఐనా, కంపెనీ తన నెట్వర్కింగ్ని, అంటే తన కాంటాక్ట్స్ ని పటిష్ఠం చేసుకోవటానికే ఇలాంటి పార్టీలు ఇస్తుంది.
సరే, నాకు వెళ్ళక తప్పలేదు. అరుణ్ నా ఫాన్! అతను డాక్టరు. నేను ఆడిన పెద్ద మాచ్ల వీడియోలన్నీ అతని దగ్గర ఉన్నాయి. ఒకసారి మాచ్లో బౌలింగ్ చేసేటప్పుడు నా భుజం ఎముక జారిపోతే అతనే సరిచేశాడు.
నేను సామాన్యంగా పార్టీల్లో మద్యం తాగను. అరుణ్ వెళ్లటం ఇది మొదటిసారి కూడా కాదు. కానీ ఈసారి అతనూ, మిగతావాళ్లు ఎంతో బలవంతం చెయ్యటంతో రెండు పెగ్గులు తాగాల్సి వచ్చింది. రాత్రి పన్నెండూ, ఒంటిగంటదాకా మేమక్కడ బాగా మజా చేశాం. ఆ పార్టీ తెల్లారేదాకా అలా సాగుతూనే ఉంటుంది. కానీ అరుణ్ నాతో ఒంటరిగా ఉండటం కోసం మధ్యలోనే నన్ను అక్కణ్ణించి లాక్కొచ్చేశాడు. మేమిద్దరం తళతళ మెరిసిపోతున్న అతని కారెక్కి ఊళ్లోని బైపాస్ రోడ్డు మీద వేగంగా పోసాగాం.................
లవ్ --- సంధ్య - అరుణ్ నన్ను బ్యాంకునుంచి పిక్అప్ చేసుకున్నాడు. ఈసారి ఒక పెద్ద కంపెనీ పార్టీ ఇస్తోంది. అక్కడికి ఎక్కువగా యువతీ యువకులే వస్తారు. వాళ్ళు తమతోపాటు ఒక్కో గెస్ట్ని కూడా తెచ్చుకోవచ్చు. అది అవటానికి న్యూయర్ పార్టీయే ఐనా, కంపెనీ తన నెట్వర్కింగ్ని, అంటే తన కాంటాక్ట్స్ ని పటిష్ఠం చేసుకోవటానికే ఇలాంటి పార్టీలు ఇస్తుంది. సరే, నాకు వెళ్ళక తప్పలేదు. అరుణ్ నా ఫాన్! అతను డాక్టరు. నేను ఆడిన పెద్ద మాచ్ల వీడియోలన్నీ అతని దగ్గర ఉన్నాయి. ఒకసారి మాచ్లో బౌలింగ్ చేసేటప్పుడు నా భుజం ఎముక జారిపోతే అతనే సరిచేశాడు. నేను సామాన్యంగా పార్టీల్లో మద్యం తాగను. అరుణ్ వెళ్లటం ఇది మొదటిసారి కూడా కాదు. కానీ ఈసారి అతనూ, మిగతావాళ్లు ఎంతో బలవంతం చెయ్యటంతో రెండు పెగ్గులు తాగాల్సి వచ్చింది. రాత్రి పన్నెండూ, ఒంటిగంటదాకా మేమక్కడ బాగా మజా చేశాం. ఆ పార్టీ తెల్లారేదాకా అలా సాగుతూనే ఉంటుంది. కానీ అరుణ్ నాతో ఒంటరిగా ఉండటం కోసం మధ్యలోనే నన్ను అక్కణ్ణించి లాక్కొచ్చేశాడు. మేమిద్దరం తళతళ మెరిసిపోతున్న అతని కారెక్కి ఊళ్లోని బైపాస్ రోడ్డు మీద వేగంగా పోసాగాం.................© 2017,www.logili.com All Rights Reserved.