మొదటి అధ్యాయం
కరీంనగర్ పట్టణం నుండి హన్మకొండ పట్టణానికి పోయే తారు రోడ్డులో - కరీంనగరు ముప్పయి కిలోమీటర్ల దూరంలో కుడివైపు అనగా దక్షిణం వేపు మత్స్యగిరీంద్ర స్వామి కొండకింద ఊరుపేరు కొత్తగట్టు. మొత్తం ఎనిమిది వందల గడప మూడు వేల జనాభా గల పెద్దూరే. మొత్తం ఆ ఊరి ఆయకట్టు తరి కుష్కి కలిపి ఇరువై ఏడు వందల ఎకరాలు. సబ్బండవర్ణాలు నివసించే ఆ ఊళ్లో 1966 మార్చి నెల 23వ తేది బుధవారం... పరాభవనామ సంవత్సరం ఉగాది రోజు తెల్లవారుఝామున ఇంకా మసకమసకగా ఉండగానే....
గొల్ల కొమరమ్మ చప్పుడు పెద్దగా రాకుండా అతి చాకచక్యంగా చీపురుతో విశాలమైన వాకిలిలో ఊడ్చింది. వాకిట్లో నులకమంచంలో అడ్డదిడ్డంగా పడుకొని గాఢ నిద్రలో ఉన్న ఆదిరెడ్డిని ముదిగారవంగా తట్టి లేపింది.
హఠాత్తుగా కళ్ళు తెరిచి మసక, మసకగా పైన చుక్కల ఆకాశం కింద తన మంచం పక్క నిల్చున్న కొమరమ్మను చూసి “పోయే నన్ను పండుకోనియ్యి" విసుక్కున్నాడు. "మా అయ్యవుగాదు లే! అన్నలు లేసిన్లు. వదినలు లేసిన్లు. మరిచి పోయినవా ఇయ్యాల సాగుబాటు.”
"మీ అయ్య సుట్ట గబ్బు మొఖపోడు. లే - పో - నేను దున్నేది లేదు. దోకెది లేదు. నాకెందుకు సాగుబాటు?”
"వాన్ని గారువం చేసి పాడు చేసింది నువ్వేనే ! లేరా ! రైతు పుట్టుక బుట్టినవా?................
మొదటి అధ్యాయం కరీంనగర్ పట్టణం నుండి హన్మకొండ పట్టణానికి పోయే తారు రోడ్డులో - కరీంనగరు ముప్పయి కిలోమీటర్ల దూరంలో కుడివైపు అనగా దక్షిణం వేపు మత్స్యగిరీంద్ర స్వామి కొండకింద ఊరుపేరు కొత్తగట్టు. మొత్తం ఎనిమిది వందల గడప మూడు వేల జనాభా గల పెద్దూరే. మొత్తం ఆ ఊరి ఆయకట్టు తరి కుష్కి కలిపి ఇరువై ఏడు వందల ఎకరాలు. సబ్బండవర్ణాలు నివసించే ఆ ఊళ్లో 1966 మార్చి నెల 23వ తేది బుధవారం... పరాభవనామ సంవత్సరం ఉగాది రోజు తెల్లవారుఝామున ఇంకా మసకమసకగా ఉండగానే.... గొల్ల కొమరమ్మ చప్పుడు పెద్దగా రాకుండా అతి చాకచక్యంగా చీపురుతో విశాలమైన వాకిలిలో ఊడ్చింది. వాకిట్లో నులకమంచంలో అడ్డదిడ్డంగా పడుకొని గాఢ నిద్రలో ఉన్న ఆదిరెడ్డిని ముదిగారవంగా తట్టి లేపింది. హఠాత్తుగా కళ్ళు తెరిచి మసక, మసకగా పైన చుక్కల ఆకాశం కింద తన మంచం పక్క నిల్చున్న కొమరమ్మను చూసి “పోయే నన్ను పండుకోనియ్యి" విసుక్కున్నాడు. "మా అయ్యవుగాదు లే! అన్నలు లేసిన్లు. వదినలు లేసిన్లు. మరిచి పోయినవా ఇయ్యాల సాగుబాటు.” "మీ అయ్య సుట్ట గబ్బు మొఖపోడు. లే - పో - నేను దున్నేది లేదు. దోకెది లేదు. నాకెందుకు సాగుబాటు?” "వాన్ని గారువం చేసి పాడు చేసింది నువ్వేనే ! లేరా ! రైతు పుట్టుక బుట్టినవా?................© 2017,www.logili.com All Rights Reserved.