కేశం
---- నరన్
ఈ 1972, ఫాల్గుణ మాసం రోజు ఉదయం నుండి ఆత్తియప్పన్కు శరీరంపై ఒకటే చీమలు పాకుతున్న అనుభూతి. సామాన్యంగా ఇటువంటి అనుభూతులకు లోనైనపుడు, అతని మనసులో అంతుబట్టని సంతోషమేదో పెల్లుబుకుతుంది. అది సంభోగకాలంలో మగ మదపుటేనుగు స్రవించే మదజలానికి సమానం. అయితే, ఇన్ని రోజులుగా లేనిది, ఈరోజే హఠాత్తుగా ఎందుకిలా అయ్యిందని అతడికి కూడా అంతుబట్టలేదు. యాభైతొమ్మిదేళ్ళ ఆత్తియప్పన్, తన కౌమార ప్రాయంలో వేంబారి నుండి పేదరికంతో పొట్ట చేతబట్టుకుని బ్రతుకుతెరువుకై విరుదునగర్కు వలసవచ్చాడు. అక్కడ పత్తిపేటలో చిన్నాచితకా పనులు చేసుకుంటూ, అంచెలంచెలుగా పత్తి దళారీ స్థాయికెదిగి, తక్కువ లాభానికి సరుకును చేతులు మార్చేవాడు. కొనుగోలు చెయ్యడం మొదలుపెట్టి ఈ రోజు పత్తిపేట అంతటిలో అతడిదే భారీ వ్యాపారం. కొడుకు కదిరేశనే ప్రస్తుతం వ్యాపార లావాదేవీలన్నింటిని చక్కబెడుతున్నాడు. అతడికి తన తండ్రి వయసులో సగమే ఉంటుంది.
ఆత్తియప్పన్ సరాసరి మనుష్యుల కంటే కాస్త పొడుగు. శరీరం వర్షంలో తడిసిన తాటిమొద్దు రంగు. తలలో వొత్తుగా దూది పేర్చినట్లుండే తెల్లవెంట్రుకలతో ఉండేవాడు. నడుముకు తెల్ల టెర్లిన్ పంచె, పైభాగంలో మోచేతి వరకు మడిచిన తెల్ల............
కేశం ---- నరన్ ఈ 1972, ఫాల్గుణ మాసం రోజు ఉదయం నుండి ఆత్తియప్పన్కు శరీరంపై ఒకటే చీమలు పాకుతున్న అనుభూతి. సామాన్యంగా ఇటువంటి అనుభూతులకు లోనైనపుడు, అతని మనసులో అంతుబట్టని సంతోషమేదో పెల్లుబుకుతుంది. అది సంభోగకాలంలో మగ మదపుటేనుగు స్రవించే మదజలానికి సమానం. అయితే, ఇన్ని రోజులుగా లేనిది, ఈరోజే హఠాత్తుగా ఎందుకిలా అయ్యిందని అతడికి కూడా అంతుబట్టలేదు. యాభైతొమ్మిదేళ్ళ ఆత్తియప్పన్, తన కౌమార ప్రాయంలో వేంబారి నుండి పేదరికంతో పొట్ట చేతబట్టుకుని బ్రతుకుతెరువుకై విరుదునగర్కు వలసవచ్చాడు. అక్కడ పత్తిపేటలో చిన్నాచితకా పనులు చేసుకుంటూ, అంచెలంచెలుగా పత్తి దళారీ స్థాయికెదిగి, తక్కువ లాభానికి సరుకును చేతులు మార్చేవాడు. కొనుగోలు చెయ్యడం మొదలుపెట్టి ఈ రోజు పత్తిపేట అంతటిలో అతడిదే భారీ వ్యాపారం. కొడుకు కదిరేశనే ప్రస్తుతం వ్యాపార లావాదేవీలన్నింటిని చక్కబెడుతున్నాడు. అతడికి తన తండ్రి వయసులో సగమే ఉంటుంది. ఆత్తియప్పన్ సరాసరి మనుష్యుల కంటే కాస్త పొడుగు. శరీరం వర్షంలో తడిసిన తాటిమొద్దు రంగు. తలలో వొత్తుగా దూది పేర్చినట్లుండే తెల్లవెంట్రుకలతో ఉండేవాడు. నడుముకు తెల్ల టెర్లిన్ పంచె, పైభాగంలో మోచేతి వరకు మడిచిన తెల్ల............© 2017,www.logili.com All Rights Reserved.