రంగరించి అందించిన చరిత్ర చందనం
“దిగి వెతుకుతున్న కొద్దీ కట్టెదుట మిరుమిట్లు
తెలుసుకుంటున్న కొద్దీ శరీరంపై గగుర్పాట్లు”
రంగనాథంగారి "రాజాం చరిత్ర-సంస్కృతి" చదివిన తరువాత పాఠకులుగా మనం చెప్పాల్సిన మాటల్ని మన తరఫున ఆయనే చెప్పారు. అసలు శీర్షిక 'నగరరాజం - రాజాం' రాజాంకు అత్యంత గౌరవహోదా నిచ్చింది. కాదు, రంగనాథంగారు ఇచ్చారు. రాజాంప్రాంత ప్రజలందరూ, గర్వంతో ఉప్పొంగిపోయేలా ఈ పుస్తకాన్ని రాశారు. ఉపాధ్యాయుడు కదా! కల్పనలు, కల్లబొల్లికబుర్ల జోలికి వెళ్ళకుండా, అచ్చమైన. స్వచ్ఛమైన, నిక్కమైన చరిత్రను చక్కగా రాసి మనకందించారు రంగనాథంగారు.
మూడువందల ఏభై ఏళ్ళకిందట నిర్మించుకొన్న చిన్నకోట అంటూనే, రాజాంలోనూ, చుట్టుపక్కలా తిరిగి, తిరిగించి, సేకరించిన చరిత్రలో ఆదిమమానవుని ఆనవాళ్ళు, రాతి; ఇనుపయుగాల తరువాత నిలకడగల చారిత్రిక తొలియుగంలో ఖారవేలుడు, శాతవాహనులు, పితృభక్తులు, వాశిష్ఠులు, మాఠరులు, పూర్వ (తూర్పు) గాంగులు, తరువాతి గాంగులు, రెడ్డిరాజుల చొరబాటు, గజపతులు, శ్రీకృష్ణదేవరాయని కళింగదండయాత్ర, జైపూర్ రాజవంశీకులు, తరువాత బొబ్బిలి, విజయనగర సంస్థానాధీశులు; ఇలా రాజాం ప్రాంత చరిత్రను క్రమం తప్పకుండా విడమరచి చెప్పారు..................
రంగరించి అందించిన చరిత్ర చందనం “దిగి వెతుకుతున్న కొద్దీ కట్టెదుట మిరుమిట్లు తెలుసుకుంటున్న కొద్దీ శరీరంపై గగుర్పాట్లు” రంగనాథంగారి "రాజాం చరిత్ర-సంస్కృతి" చదివిన తరువాత పాఠకులుగా మనం చెప్పాల్సిన మాటల్ని మన తరఫున ఆయనే చెప్పారు. అసలు శీర్షిక 'నగరరాజం - రాజాం' రాజాంకు అత్యంత గౌరవహోదా నిచ్చింది. కాదు, రంగనాథంగారు ఇచ్చారు. రాజాంప్రాంత ప్రజలందరూ, గర్వంతో ఉప్పొంగిపోయేలా ఈ పుస్తకాన్ని రాశారు. ఉపాధ్యాయుడు కదా! కల్పనలు, కల్లబొల్లికబుర్ల జోలికి వెళ్ళకుండా, అచ్చమైన. స్వచ్ఛమైన, నిక్కమైన చరిత్రను చక్కగా రాసి మనకందించారు రంగనాథంగారు. మూడువందల ఏభై ఏళ్ళకిందట నిర్మించుకొన్న చిన్నకోట అంటూనే, రాజాంలోనూ, చుట్టుపక్కలా తిరిగి, తిరిగించి, సేకరించిన చరిత్రలో ఆదిమమానవుని ఆనవాళ్ళు, రాతి; ఇనుపయుగాల తరువాత నిలకడగల చారిత్రిక తొలియుగంలో ఖారవేలుడు, శాతవాహనులు, పితృభక్తులు, వాశిష్ఠులు, మాఠరులు, పూర్వ (తూర్పు) గాంగులు, తరువాతి గాంగులు, రెడ్డిరాజుల చొరబాటు, గజపతులు, శ్రీకృష్ణదేవరాయని కళింగదండయాత్ర, జైపూర్ రాజవంశీకులు, తరువాత బొబ్బిలి, విజయనగర సంస్థానాధీశులు; ఇలా రాజాం ప్రాంత చరిత్రను క్రమం తప్పకుండా విడమరచి చెప్పారు..................© 2017,www.logili.com All Rights Reserved.