మగువ తెగువ
అతను అర్ధరాత్రిదాకా మ్యాపులూ రైల్వే టైం టేబుల్సూ పరిశీలిస్తూ గడిపాడు. మ్యాపులు పారిస్కూ ఎఫెర్నేకూ మధ్యగల దేశంలో వివిధ స్థలాలను గురించి విపులంగా చూపెడుతున్నాయి. టైంటేబుల్లో, అనేక ఊళ్ళ మీదుగా వెళ్ళే "పారిస్- వియన్నా ఎక్స్ప్రెస్" వివరాలు అతన్ని ఎంతగానో ఆకర్షించాయి
సగం రాత్రి గడచిన తరువాత అతను ఎర్ర పెన్సిలు తీసుకుని మ్యాపులో ఒక చోట గుర్తు పెట్టాడు. ఒక చిన్న కాగితం ముక్క తీసుకుని, దాని మీద 'ఒజాయిర్ - లా - ఫెర్రీ - రాత్రి 10 గం. 44 ని.' అని రాసుకున్నాడు. ఆ కాగితం ముక్క మ్యాపులో మడిచి పెట్టి, దాన్ని ఒక చేతి సంచిలో భద్రపరిచి, సంచి తన తలదిండు క్రింద దోపాడు. తరవాత లేచి సిగరెట్టు ముట్టించాడు. కిటికీ తలుపు తెరిచాడు. కిటికీలో మోచేతులానించి, నిద్రా ముద్రితమై వున్న పారిస్ నగరం వంక ఒక మారు చూచాడు.
నగరంలో ఒక మూల ఒక చిన్న హోటలు మూడో అంతస్థులో ఉన్నది అతని గది. కిటికీలో నుంచి చూస్తుంటే స్టేషన్కు వెళ్ళే రోడ్డు నిర్మానుష్యంగా కనిపిస్తున్నది. దూరంగా స్టేషనూ, ప్లాటుఫారమూ అగుపిస్తున్నాయి. స్టేషన్లోని దీపాల పైన ఒక తెల్లటి పొగమబ్బు కమ్ముకున్నది. రైలు పట్టాలు ఉక్కు తీగెల్లాగా తళతళలాడుతున్నాయి. ఆ పట్టాల మీదిగానే పారిస్ నుండి బయలు దేరే ఎక్సుప్రెస్ వియన్నా పోతుందని అతను పదేపదే భావన చేసుకున్నాడు.
చల్లటిగాలి వచ్చి తాకింది. అయినా అతను కిటికీ వద్ద నుంచి కదల్లేదు. నోట్లో సిగరెట్టు లా కాలిపోయి చివరకతని పెదవులు చుర్రుమన్నాయి.
అతను సిగరెట్టు పారేశాడు. కిటికి తలుపు మూశాడు. ఆవులిస్తూ వచ్చి పక్కమీద పడుకున్నాడు.
మరునాడు ఉదయం స్థానిక ప్రాంతాలకు వెళ్ళే ఒక రైలు ఎక్కాడు. మూడవ తరగతి పెట్టెలో కూచున్నాడు. ఆ పెట్టెలో అతను తప్ప మరో ప్రయాణీకుడు లేడు. కిటికీ వద్ద కూచుని, కనుచూపుమేరలో కనుపించే భూమినంతా పరిశీలించసాగాడు. చిన్న అడవి ప్రాంతంలో ప్రవేశించింది..............
మగువ తెగువ అతను అర్ధరాత్రిదాకా మ్యాపులూ రైల్వే టైం టేబుల్సూ పరిశీలిస్తూ గడిపాడు. మ్యాపులు పారిస్కూ ఎఫెర్నేకూ మధ్యగల దేశంలో వివిధ స్థలాలను గురించి విపులంగా చూపెడుతున్నాయి. టైంటేబుల్లో, అనేక ఊళ్ళ మీదుగా వెళ్ళే "పారిస్- వియన్నా ఎక్స్ప్రెస్" వివరాలు అతన్ని ఎంతగానో ఆకర్షించాయి సగం రాత్రి గడచిన తరువాత అతను ఎర్ర పెన్సిలు తీసుకుని మ్యాపులో ఒక చోట గుర్తు పెట్టాడు. ఒక చిన్న కాగితం ముక్క తీసుకుని, దాని మీద 'ఒజాయిర్ - లా - ఫెర్రీ - రాత్రి 10 గం. 44 ని.' అని రాసుకున్నాడు. ఆ కాగితం ముక్క మ్యాపులో మడిచి పెట్టి, దాన్ని ఒక చేతి సంచిలో భద్రపరిచి, సంచి తన తలదిండు క్రింద దోపాడు. తరవాత లేచి సిగరెట్టు ముట్టించాడు. కిటికీ తలుపు తెరిచాడు. కిటికీలో మోచేతులానించి, నిద్రా ముద్రితమై వున్న పారిస్ నగరం వంక ఒక మారు చూచాడు. నగరంలో ఒక మూల ఒక చిన్న హోటలు మూడో అంతస్థులో ఉన్నది అతని గది. కిటికీలో నుంచి చూస్తుంటే స్టేషన్కు వెళ్ళే రోడ్డు నిర్మానుష్యంగా కనిపిస్తున్నది. దూరంగా స్టేషనూ, ప్లాటుఫారమూ అగుపిస్తున్నాయి. స్టేషన్లోని దీపాల పైన ఒక తెల్లటి పొగమబ్బు కమ్ముకున్నది. రైలు పట్టాలు ఉక్కు తీగెల్లాగా తళతళలాడుతున్నాయి. ఆ పట్టాల మీదిగానే పారిస్ నుండి బయలు దేరే ఎక్సుప్రెస్ వియన్నా పోతుందని అతను పదేపదే భావన చేసుకున్నాడు. చల్లటిగాలి వచ్చి తాకింది. అయినా అతను కిటికీ వద్ద నుంచి కదల్లేదు. నోట్లో సిగరెట్టు లా కాలిపోయి చివరకతని పెదవులు చుర్రుమన్నాయి. అతను సిగరెట్టు పారేశాడు. కిటికి తలుపు మూశాడు. ఆవులిస్తూ వచ్చి పక్కమీద పడుకున్నాడు. మరునాడు ఉదయం స్థానిక ప్రాంతాలకు వెళ్ళే ఒక రైలు ఎక్కాడు. మూడవ తరగతి పెట్టెలో కూచున్నాడు. ఆ పెట్టెలో అతను తప్ప మరో ప్రయాణీకుడు లేడు. కిటికీ వద్ద కూచుని, కనుచూపుమేరలో కనుపించే భూమినంతా పరిశీలించసాగాడు. చిన్న అడవి ప్రాంతంలో ప్రవేశించింది..............© 2017,www.logili.com All Rights Reserved.