రిజర్వేషన్లు ఎందుకు? ఎవరికి?
ఆదిమ సమాజంలో మినహా ప్రతి సమాజంలో ఏ కాలంలో అయినా మంచి - చెడు, దోపిడీ - ప్రతిఘటన/రక్షణ చర్యలు వుంటాయనే విషయం తెలిసిందే. ఆ చర్యలు ఒక్కో కాలంలో ఒక్కో రూపంలో అమల్లో ఉంటాయి. సువిశాల భారత దేశంలో సామాజిక వైవిధ్యం చాలా గొప్పది, కానీ కులం పేరుతో జరిగిన సామాజిక అన్యాయం చాలా చెడ్డది. అగ్రకులాల వారు సూద్రులను, నిమ్న జాతులను తరతరాలుగా యధేచ్చగా దోచుకోవడం జరిగింది. దానికి ప్రతిగా రిజర్వేషన్ల సదుపాయంతో సూద్రులు, నిమ్న జాతులకు కొంత రక్షణ కల్పించడం అనేది ఇరవయ్యో శతాబ్దం నుండి మొదలైంది. శతాబ్దాలుగా తీవ్రమైన అణచివేతకు, అన్యాయానికి, దోపిడీకి గురైన వారికి కొంత ఉపశమనంగా, నష్టపరిహారంగా విద్యావకాశాల్లో, ఉద్యోగాల కల్పనలో మరియు రాజకీయ పదవుల్లో కొంత నిశ్చితమైన భాగస్వామ్యం కల్పించడానికి రిజర్వేషన్ సదుపాయం కల్పించాల్సి వచ్చింది.
సామాజికంగా, విద్యాపరంగా వెనుకబడిన పౌరులకు విద్యా ఉద్యోగాల్లో కోటాలు నిర్ణయించడానికి మరియు సీట్లు కేటాయించడానికి ప్రభుత్వానికి అధికారం కల్పిస్తూ రాజ్యాంగంలో కొన్ని అధికరణలు ఏర్పాటు చేయడం జరిగింది. షెడ్యూల్డ్ కులాలు (ఎస్సీ), షెడ్యూల్డ్ జాతులు (ఎస్టీ) మరియు వెనుకబడిన తరగతులకు రిజర్వేషన్ సదుపాయం కల్పించబడింది. అయితే, కొంతమందికి కొన్ని ఉద్యోగాలు ఇవ్వడానికే కాదు, వారి పట్ల అంటరానితనం వివక్షను నిరోధించి, వారిని సాధికారులుగా చేసి రాజ్యం యొక్క నిర్ణాయక ప్రక్రియలో భాగస్వాములను చేయడం రిజర్వేషన్ల ప్రధాన లక్ష్యం. స్వతంత్ర దేశంలో ప్రజాస్వామ్య పాలనలో విధాన నిర్ణయాలు జరిగే చట్టసభల్లో మరియు ఆ నిర్ణయాలను అమలు చేసే ఉద్యోగ (బ్యూరోక్రసీ) వర్గంలో అణగారిన కులాలైన దళితుల, గిరిజనుల, బలహీన వర్గాల భాగస్వామ్యం కోసమే రిజర్వేషన్లు ఏర్పాటు చేయడం జరిగింది.................................
రిజర్వేషన్లు ఎందుకు? ఎవరికి? ఆదిమ సమాజంలో మినహా ప్రతి సమాజంలో ఏ కాలంలో అయినా మంచి - చెడు, దోపిడీ - ప్రతిఘటన/రక్షణ చర్యలు వుంటాయనే విషయం తెలిసిందే. ఆ చర్యలు ఒక్కో కాలంలో ఒక్కో రూపంలో అమల్లో ఉంటాయి. సువిశాల భారత దేశంలో సామాజిక వైవిధ్యం చాలా గొప్పది, కానీ కులం పేరుతో జరిగిన సామాజిక అన్యాయం చాలా చెడ్డది. అగ్రకులాల వారు సూద్రులను, నిమ్న జాతులను తరతరాలుగా యధేచ్చగా దోచుకోవడం జరిగింది. దానికి ప్రతిగా రిజర్వేషన్ల సదుపాయంతో సూద్రులు, నిమ్న జాతులకు కొంత రక్షణ కల్పించడం అనేది ఇరవయ్యో శతాబ్దం నుండి మొదలైంది. శతాబ్దాలుగా తీవ్రమైన అణచివేతకు, అన్యాయానికి, దోపిడీకి గురైన వారికి కొంత ఉపశమనంగా, నష్టపరిహారంగా విద్యావకాశాల్లో, ఉద్యోగాల కల్పనలో మరియు రాజకీయ పదవుల్లో కొంత నిశ్చితమైన భాగస్వామ్యం కల్పించడానికి రిజర్వేషన్ సదుపాయం కల్పించాల్సి వచ్చింది. సామాజికంగా, విద్యాపరంగా వెనుకబడిన పౌరులకు విద్యా ఉద్యోగాల్లో కోటాలు నిర్ణయించడానికి మరియు సీట్లు కేటాయించడానికి ప్రభుత్వానికి అధికారం కల్పిస్తూ రాజ్యాంగంలో కొన్ని అధికరణలు ఏర్పాటు చేయడం జరిగింది. షెడ్యూల్డ్ కులాలు (ఎస్సీ), షెడ్యూల్డ్ జాతులు (ఎస్టీ) మరియు వెనుకబడిన తరగతులకు రిజర్వేషన్ సదుపాయం కల్పించబడింది. అయితే, కొంతమందికి కొన్ని ఉద్యోగాలు ఇవ్వడానికే కాదు, వారి పట్ల అంటరానితనం వివక్షను నిరోధించి, వారిని సాధికారులుగా చేసి రాజ్యం యొక్క నిర్ణాయక ప్రక్రియలో భాగస్వాములను చేయడం రిజర్వేషన్ల ప్రధాన లక్ష్యం. స్వతంత్ర దేశంలో ప్రజాస్వామ్య పాలనలో విధాన నిర్ణయాలు జరిగే చట్టసభల్లో మరియు ఆ నిర్ణయాలను అమలు చేసే ఉద్యోగ (బ్యూరోక్రసీ) వర్గంలో అణగారిన కులాలైన దళితుల, గిరిజనుల, బలహీన వర్గాల భాగస్వామ్యం కోసమే రిజర్వేషన్లు ఏర్పాటు చేయడం జరిగింది.................................© 2017,www.logili.com All Rights Reserved.