న్యాయం పవిత్రమైనది
గోడ దూకాడు రామారావు. కాలేజీ రోజుల్లోని ఆటల ప్రావీణ్యం అతనికిప్పుడు ఉపకరించింది. వీధివేపు అంతా చీకటిగా ఉన్నా పెరటిలో మాత్రం వెల్తురు బాగానే ఉంది.
వరండా బయట వెలుగుతున్న బల్బు.
మూల గుబురుగా ఉన్న సన్నజాజిపొద వెనక కొద్దిపాటి మసకతనం ఉంటే చప్పున అటు నడిచాడు.
ఎక్కడా అలికిడి లేదు. వరండా అవతలగా తెరచి ఉన్న గుమ్మంలోంచి డైనింగ్ టేబులు మీద స్టెయిన్లెస్ స్టీల్ పాత్రలు, బోర్లించిన పళ్ళాలు, వాటర్ జగ్, గ్లాసులు మొదలైనవి కనిపిస్తున్నాయి.
పొదవెనక నిలబడి ఉన్న రామారావు గుండెలు వేగంగా కొట్టుకోసాగాయి. అతని కళ్ళనిండా భయం. కాళ్ళలో నిస్త్రాణత. రెండురోజుల క్రితం చేసిన భోజనం కావటంతో అతనికి తన శరీరమే భారంగా అనిపిస్తోంది.
దొంగతనం చేయటానికి వచ్చాడు అతనిప్పుడు. డబ్బు తస్కరిద్దామని కాదు. విలువైన ఆభరణాలకోసమూ కాదు. కేవలం తిండి, తిండిని దొంగిలించుదామని! రెండు రోజులనుంచీ పస్తులుంటున్న భార్యాబిడ్డల ఆకలిని తీర్చటం కోసం... న్యాయమైన రీతిలో ఆ పని చేయటానికి అవకాశాలు లేక, చాతకాక, అన్యాయంగానైనా సరే సంపాదించుదామని!!..................................
న్యాయం పవిత్రమైనది గోడ దూకాడు రామారావు. కాలేజీ రోజుల్లోని ఆటల ప్రావీణ్యం అతనికిప్పుడు ఉపకరించింది. వీధివేపు అంతా చీకటిగా ఉన్నా పెరటిలో మాత్రం వెల్తురు బాగానే ఉంది. వరండా బయట వెలుగుతున్న బల్బు. మూల గుబురుగా ఉన్న సన్నజాజిపొద వెనక కొద్దిపాటి మసకతనం ఉంటే చప్పున అటు నడిచాడు. ఎక్కడా అలికిడి లేదు. వరండా అవతలగా తెరచి ఉన్న గుమ్మంలోంచి డైనింగ్ టేబులు మీద స్టెయిన్లెస్ స్టీల్ పాత్రలు, బోర్లించిన పళ్ళాలు, వాటర్ జగ్, గ్లాసులు మొదలైనవి కనిపిస్తున్నాయి. పొదవెనక నిలబడి ఉన్న రామారావు గుండెలు వేగంగా కొట్టుకోసాగాయి. అతని కళ్ళనిండా భయం. కాళ్ళలో నిస్త్రాణత. రెండురోజుల క్రితం చేసిన భోజనం కావటంతో అతనికి తన శరీరమే భారంగా అనిపిస్తోంది. దొంగతనం చేయటానికి వచ్చాడు అతనిప్పుడు. డబ్బు తస్కరిద్దామని కాదు. విలువైన ఆభరణాలకోసమూ కాదు. కేవలం తిండి, తిండిని దొంగిలించుదామని! రెండు రోజులనుంచీ పస్తులుంటున్న భార్యాబిడ్డల ఆకలిని తీర్చటం కోసం... న్యాయమైన రీతిలో ఆ పని చేయటానికి అవకాశాలు లేక, చాతకాక, అన్యాయంగానైనా సరే సంపాదించుదామని!!..................................© 2017,www.logili.com All Rights Reserved.