ఆనందమాయే సఖి
శ్రీకాకుళం నుంచి విశాఖపట్నం వస్తున్న ఏ, సీ, బస్సు, బయట గాలిని, ట్రాఫిక్ . . చప్పుళ్ళని లోపలికి రానివ్వకుండా సీల్ చేసుకొని ఉంది. మనుషుల మధ్య కూడా విచిత్రమైన నిశబ్దం, ఆ సైలెన్స్ని బద్దలగొట్టే పనేదో తన పైన ఉన్నట్టు టీవీ ఒక సినిమాని ప్లే చేస్తుంది. ఆ సినిమాలోని డైలాగ్స్ వల్లో మరే కారణం చేతో కానీ అంత వరకు మత్తుగా నిద్రపోయిన మైథిలి ఉలిక్కిపడి లేచింది. కళ్ళు నులుముకుంటూ అద్దానికి దగ్గరగా వెళ్లి చీకట్లు అలుముకున్న బయట పరిసరాలని కళ్ళు చిట్లించి చూసింది.
కాసేపు పట్టి పట్టి చూసాక కానీ ఆమెకి బస్సు మద్దిలపాలెం వరకు వచ్చేసిందని తెలియలేదు. మరో రెండు స్టాపుల తర్వాత తను దిగాల్సిన స్టాప్ వస్తుందని అర్థమై తన బాగ్ని సర్దుకుంటూ, అరిపోయిన గొంతులోకి రెండు గుక్కల నీళ్లు పోసుకుని ఖాళీ బాటిల్ కింద పచేయబోయింది. కానీ వెంటనే ఏదో గుర్తొచ్చినట్టు మళ్ళీ బాగ్లోకి తోసింది. చెదిరిన జుట్టు సర్దుకుంటూ ప్యాంటు పాకెట్ లో ఉన్న ఫోన్ బైటకి తీస్తుండగా వెనక నుంచి మైథిలికి కొన్ని మాటలు వినిపించాయి.
డాడీ చూడండి ఆ కలర్ ఎంత చెత్తగా ఉందో! అసలు పింక్ కలర్ అబ్బాయిలు వేసుకోకూడదు. అది గల్ఫ్ కలర్.
మైథిలి తన ప్రమేయం లేకుండానే టీవిలో ప్లే అవుతున్న సీన్ని చూసింది. అక్కడ ఒక పన్నెండేళ్ళ పిల్లాడు తను ఇష్టపడిన అమ్మాయి కోసం ఆ పిల్లకి నచ్చిన రాణి రంగు చొక్కా వేసుకొని స్కూల్కి వెళ్తున్నాడు.
మళ్ళీ అదే గొంతు, గోల్డ్ కూడా అబ్బాయిలకి నచ్చకూడదు. అబ్బాయిల కలర్స్ ఏంటో తెలుసా? బ్లాక్, బ్లూ, గ్రే ఇలాంటివి, అని వినిపించింది మైథిలికి, వెనక నుంచి మాట్లాడేది ఒక ఏడెనిమిది ఏళ్లు మించని పిల్లాడని మైథిలి ఊహించింది.
వీడికి ఇప్పటి నుంచే ఎన్ని తెలుసో చూడండి, అంటోంది ఒక స్త్రీ గొంతు. తన మాటల్లో ఒక రకమైన ఆశ్చర్యం, గర్వం వినిపిస్తున్నాయి. ఆ తండ్రి వెంటనే నీకెలా తెలుసు ఇవన్నీ, అని అడిగాడు. వాడు ఠక్కున టీచర్ చెప్పింది, అన్నాడు.
ఆ మాట విన్న తర్వాత మైథిలి వెనక్కి తిరిగి చూడాలన్న కోరికని బలవంతంగా ఆపుకుంది. ఇంతలో ఒకతను డ్రైవర్కి పాస్సింజర్స్కి అడ్డుగా ఉన్న తలుపుని తెరుచుకుంటూ వచ్చి తన కంచు కంఠంతో, సిగ్నల్ దగ్గర దిగే వాళ్ళు దిగిపోండి మళ్ళీ బస్సు ఆగేది కాంప్లెక్స్లోనే, అని చెప్పి వెళ్ళిపోయాడు. మైథిలి ఆ పిల్లాడి ఆలోచనల నుంచి తేరుకొని భుజానికి బ్యాగ్ తగిలించుకుంటూ లేచింది.
****
ద్వారకానగర్ వీధుల్లో మైథిలి తన ఇంటి వైపు నడుస్తుంది........................
ఆనందమాయే సఖి శ్రీకాకుళం నుంచి విశాఖపట్నం వస్తున్న ఏ, సీ, బస్సు, బయట గాలిని, ట్రాఫిక్ . . చప్పుళ్ళని లోపలికి రానివ్వకుండా సీల్ చేసుకొని ఉంది. మనుషుల మధ్య కూడా విచిత్రమైన నిశబ్దం, ఆ సైలెన్స్ని బద్దలగొట్టే పనేదో తన పైన ఉన్నట్టు టీవీ ఒక సినిమాని ప్లే చేస్తుంది. ఆ సినిమాలోని డైలాగ్స్ వల్లో మరే కారణం చేతో కానీ అంత వరకు మత్తుగా నిద్రపోయిన మైథిలి ఉలిక్కిపడి లేచింది. కళ్ళు నులుముకుంటూ అద్దానికి దగ్గరగా వెళ్లి చీకట్లు అలుముకున్న బయట పరిసరాలని కళ్ళు చిట్లించి చూసింది. కాసేపు పట్టి పట్టి చూసాక కానీ ఆమెకి బస్సు మద్దిలపాలెం వరకు వచ్చేసిందని తెలియలేదు. మరో రెండు స్టాపుల తర్వాత తను దిగాల్సిన స్టాప్ వస్తుందని అర్థమై తన బాగ్ని సర్దుకుంటూ, అరిపోయిన గొంతులోకి రెండు గుక్కల నీళ్లు పోసుకుని ఖాళీ బాటిల్ కింద పచేయబోయింది. కానీ వెంటనే ఏదో గుర్తొచ్చినట్టు మళ్ళీ బాగ్లోకి తోసింది. చెదిరిన జుట్టు సర్దుకుంటూ ప్యాంటు పాకెట్ లో ఉన్న ఫోన్ బైటకి తీస్తుండగా వెనక నుంచి మైథిలికి కొన్ని మాటలు వినిపించాయి. డాడీ చూడండి ఆ కలర్ ఎంత చెత్తగా ఉందో! అసలు పింక్ కలర్ అబ్బాయిలు వేసుకోకూడదు. అది గల్ఫ్ కలర్. మైథిలి తన ప్రమేయం లేకుండానే టీవిలో ప్లే అవుతున్న సీన్ని చూసింది. అక్కడ ఒక పన్నెండేళ్ళ పిల్లాడు తను ఇష్టపడిన అమ్మాయి కోసం ఆ పిల్లకి నచ్చిన రాణి రంగు చొక్కా వేసుకొని స్కూల్కి వెళ్తున్నాడు. మళ్ళీ అదే గొంతు, గోల్డ్ కూడా అబ్బాయిలకి నచ్చకూడదు. అబ్బాయిల కలర్స్ ఏంటో తెలుసా? బ్లాక్, బ్లూ, గ్రే ఇలాంటివి, అని వినిపించింది మైథిలికి, వెనక నుంచి మాట్లాడేది ఒక ఏడెనిమిది ఏళ్లు మించని పిల్లాడని మైథిలి ఊహించింది. వీడికి ఇప్పటి నుంచే ఎన్ని తెలుసో చూడండి, అంటోంది ఒక స్త్రీ గొంతు. తన మాటల్లో ఒక రకమైన ఆశ్చర్యం, గర్వం వినిపిస్తున్నాయి. ఆ తండ్రి వెంటనే నీకెలా తెలుసు ఇవన్నీ, అని అడిగాడు. వాడు ఠక్కున టీచర్ చెప్పింది, అన్నాడు. ఆ మాట విన్న తర్వాత మైథిలి వెనక్కి తిరిగి చూడాలన్న కోరికని బలవంతంగా ఆపుకుంది. ఇంతలో ఒకతను డ్రైవర్కి పాస్సింజర్స్కి అడ్డుగా ఉన్న తలుపుని తెరుచుకుంటూ వచ్చి తన కంచు కంఠంతో, సిగ్నల్ దగ్గర దిగే వాళ్ళు దిగిపోండి మళ్ళీ బస్సు ఆగేది కాంప్లెక్స్లోనే, అని చెప్పి వెళ్ళిపోయాడు. మైథిలి ఆ పిల్లాడి ఆలోచనల నుంచి తేరుకొని భుజానికి బ్యాగ్ తగిలించుకుంటూ లేచింది. **** ద్వారకానగర్ వీధుల్లో మైథిలి తన ఇంటి వైపు నడుస్తుంది........................© 2017,www.logili.com All Rights Reserved.